నువ్వు అర్జెంటుగా కంట్రోల్ రూమ్ కి వెళ్లి శైలు ఫోను ట్రాక్ చెయ్, తన మెసేజెస్ తన ఫోన్ కాల్స్ తన కాంటాక్ట్స్ ఏది వదలకుండా అన్ని చెక్ చెయ్ నేను గంటలో వచ్చి నీతో జాయిన్ అవుతా అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు సంజయ్.
ఆదిత్య సంజయ్ చెప్పినట్టుగానే కంట్రోల్ రూమ్ కి వెళ్తాడు.
డ అక్కడ నుండి బయలుదేరి వెళుతున్న సంజయ్ కి లాస్ట్ వీక్ ఒక కేసు విషయంలో విషయంలోయంలో వెళ్తాడు అక్కడ ఎవరు లేకపోవడంతో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని అక్కడ అంతా వెతుకుతాడు అప్పుడు అక్కడ శైలు ఫోటో చూసిన విషయం గుర్తుకు వచ్చి అక్కడికి బయలుదేరుతాడు సంజయ్.
సంజయ్ అక్కడికి వెళ్లేసరికి కొంతమంది కాపలాగా ఉంటారు. సంజు తన మొబైల్ తీసి సైలెంట్ లో పెట్టుకొని, గన్ను పట్టుకుని అక్కడ బయట కాపలా వాళ్లను అందరినీ నీట్ గా పడుకోపెట్టేస్తాడు. శైలు వెతుక్కుంటూ లోపలికి వెళతాడు. అక్కడ ఎక్కడ శైలు కనిపించదు ఎవరో వస్తున్నట్టుగా అనిపించి వాళ్లకు కనిపించకుండా దాచుకుంటాడు. అతను వచ్చి అక్కడ ఉన్న కుర్చీ లాక్కొని ఎవరికో ఫోన్ చేస్తాడు అమ్మాయిని తీసుకొచ్చాం మత్తు మందు ఇచ్చామని చెప్తాడు. అవతల వ్యక్తి మాట్లాడే మాటలు సంజయ్ కి వినపడవు కానీ, మీ పని అయ్యే వరకు అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం సార్ అని చెప్తాడు కుర్చీలో కూర్చున్న అతను.
ఆ అమ్మాయిని నెల రోజుల నుంచి కనిపెట్టి పట్టుకుని వచ్చాము జాగ్రత్తగా చూసుకుంటాం సార్ అని చెప్తాడు. మళ్లీ అవతలి వ్యక్తి ఏదో మాట్లాడుతాడు. సరే సరే మేము ఇక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు చాలా జాగ్రత్తగా ఉంటాం సార్ అమ్మాయికి ఏం కానివ్వమని చెప్తాడు. సరే సార్ ఉంటా సార్ అని కాల్ కట్ చేస్తాడు.
సంజు ఆదిత్య కి లొకేషన్ షేర్ చేసి రమ్మని మెసేజ్ చేసి ఏం సౌండ్ రాకుండా శైలు కోసం వెతుకుతుంటాడు.
ఒక్క రూమ్ బయట నుండి లాక్ చేసి ఉండడంతో డోర్ ఓపెన్ చేసే ప్రయత్నంలో డోర్ సౌండ్ వస్తుంది. ఆ డోర్ సౌండ్ విని మోడీ పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. నేనెవరో చెప్తాలే కానీ శైలు ఎక్కడ ఉంది రా అని అడుగుతాడు రౌడీని సంజయ్. అసలు శైలు ఎవర్రా అని అడుగుతాడు రౌడీ, అసలు నువ్వు ఎవడ్రా ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు బ్రతకాలని లేదా ప్రాణాల మీద తీపి లేదా ఈరోజు నిన్ను చంపేస్తారా అని అరుస్తాడు రౌడీ.
నీ చేతిలో చావడానికి వచ్చాను మరి ఆ అమ్మాయి ఎక్కడుందో మర్యాదగా చెప్పురా అని కళ్ళు ఎర్ర చేస్తాడు సంజయ్. రేయ్ అని తన దగ్గర ఉన్న రౌడీలను పిలుస్తాడు. ఎవరు రారు పట్టుకొని ఇక్కడికి వచ్చాను రా మిగిలింది నువ్వు ఒక్కడివే అని చెప్తాడు సంజయ్.
రౌడీ గానికి కోపం వచ్చే సంజయ్ మీదికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సంజయ్ రౌడి తో కలబడి, వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి మోకాళ్ళ మీద కూర్చో పెడతాడు. సంజయ్ తన గన్ను తీసి రౌడీ తలకు పెట్టి. ఇప్పుడు చెప్పరా శైలు ఎక్కడుందో అని అడుగుతాడు. చావు దెబ్బలు తిన్న రౌడీ భయపడి ఆ రూమ్ లో ఉందని చెప్తాడు.
ఆ అమ్మాయిని నువ్వు ఇప్పుడు కాపాడిన ఎలాగైనా ఆమెను చంపేస్తారు. ఇప్పుడు నన్ను ఒక్కడినే కొట్టావు. ఇంకా ఎంతమందిని అని కొట్టి కాపాడగలవు నువ్వు. ఇవాళ కాకపోయినా రేపు ఎల్లుండో ఏదో ఒక రోజు అమ్మాయిని మాత్రం కచ్చితంగా చంపేస్తారు అని నవ్వుతూ అంటాడు ఆ రౌడీ.
ఎవరు ఎందుకు అతని పేరేంటి అంటాడు సంజయ్. ఆ రౌడీ నోరు విప్పడు, సంజయ్
కి కోపం వచ్చి రౌడీని కొడతాడు.ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీ పేరు చెప్తాడు.
“భాటియా” అని చెప్తాడు.
ఎందుకు చంపుతారో నాకైతే తెలియదు గాని ఆమెకు కోసం కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. ఒకరోజు భాటియా గారు ఫోన్ చేసి నీకు ఒక ఫోటో పంపుతున్నాను ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని వెతికితే నీకు ఊహించనంత డబ్బు ఇస్తాను. నీలాగా ఆ అమ్మాయి కోసం చాలామంది వెతుకుతున్నారు అని చెప్పాడు. అప్పటినుండి ఆ అమ్మాయిని వెతకడం మొదలుపెట్టాం. ఒక డీల్ మీద కాలేజీకి వెళ్ళినప్పుడు తనని చూశాను. ఎవరా అని ఎంక్వయిరీ చేసి తెలుసుకుంటే తను ఆదిత్య చెల్లి అని తెలిసింది. ఆరోజు నుంచి చాలా ప్రయత్నాలు చేశాం తనని కిడ్నాప్ చేయడానికి కానీ కుదరలేదు. ఎన్నోసార్లు ఆదిత్యను ఫోన్లు చేసి బెదిరించాం. ఈ రోజు మా ప్లాన్ ప్రకారం మీ బుక్ చేసిన క్యాబ్ లో ఎక్కేలాగా ప్లాన్ చేశాం అని చెప్పి కింద పడిపోతాడు ఆ రౌడీ…..