అది అంతా విన్నా సంజయ్ కి అసలు ఏం అర్థం కాదు. భాటియా అలాంటి వాడితో శైలుకు ఏం గొడవలు. ఏమైనా బిజినెస్ గొడవలా అని అనుకుంటు. ఆ రౌడీ ని ఒక పిల్లర్ కట్టేసి, శైలు ఉన్న రూమ్ వైపు వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు స్పృహ లేకుండా పడి ఉన్న శైలు చూసి ఎత్తుకొని వచ్చి తన కారులో కూర్చోబెడతాడు సీటును కొంచెం వెనకకు
బెండ్ చేసి సీటు బెల్టు పెడతాడు.అక్కడే ఆదిత్య వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
అప్పుడే ఆదిత్య కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లను తీసుకుని అక్కడికి వస్తాడు. ఆదిత్య అక్కడకు వచ్చి కారులో ఉన్న తన చెల్లిని చూసి కొంచెం కుదుటపడి వాళ్ల నాన్నగారికి ఫోన్ చేసి చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందర్నీ అరెస్టు చేసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకెళ్తారు ఆదిత్య తీసుకొచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లు.
ఆదిత్య సంజయ్ మాత్రం శైలుని హాస్పటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ హాస్పటల్లో చూపించుకోని శైలుని ఆదిత్య ఇంటికి తీసుకెళ్తాడు.
మన హీరో హీరోయిన్ ని కాపాడతాడా!!!
అసలు ఎవరు ఈ భాటియా?????
ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం…..
ఆమని గారి విరాభిమాని …. Heart Heart……
ఆదిత్య శైలుని హాస్పిటల్ లో చూపించికొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. తనుకు మత్తు మందు ఇవ్వడం వల్ల శైలు అలాగే నిద్రలో ఉంటుంది. ఆదిత్య శైలును తిసుకపోయి తన బెడ్ మీద పడుకోబెడతాడు.
అందరూ శైలు చుట్టూ ఆదిత్య చుట్టూ చేరి శైలు పరిస్థితిని చూసి అందరూ ఏడుస్తుంటారు. ఆదిత్య పై అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఏమైందిరా శైలుకు ఎందుకు అలా ఉంది అని అడుగుతుంది ఆదిత్య వాళ్ళ నాయనమ్మ తులసమ్మ. ఆదిత్య భయపడాల్సిందేం నానమ్మ తనకు మత్తు మందు ఇవ్వడం వల్ల తను నిద్రపోతుందని చెప్తాడు. భయపడాల్సింది ఏం లేదంటావ్ ఏందిరా? శైలు పరిస్థితి ఆలా ఉంటే అని అంటుంది రుక్మిణమ్మ ఆదిత్య వాళ్ళ అమ్మ. అమ్మ నేను శైలుని హాస్పిటల్ లో చూపించుకొని వస్తున్నాను తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పాడు.ఆదిత్య నువ్వు వెళ్లే ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్తాడు వాళ్ళ బాబాయ్ మధుసూదన్. ఆదిత్య తన రూముకి వెళ్తాడు తనతో పాటే ఆమని కూడా వెళుతుంది. ఏంటండీ అలా ఉన్నారు నిజంగా శైలు కి ఏం కాలేదు కదా అని అడుగుతుంది ఆమని. ఆదిత్య ఆమని తో ఏం కాలేదా భయపడాల్సిందే ఏం లేదని చెప్తాడు. మరి మీరు ఎందుకండి అలా ఉన్నారు అని అడుగుతుంది ఆదిత్యను ఆమని. శైలుని అ పరిస్థితిలో చూసి నాకు భయమేసింది ఆమని. అసలు శైలు మనకు దక్కుతుందా లేదా అనిపించింది. శైలుకి ఏమన్నా అయితే మన ఇంట్లో పరిస్థితి ఏంటి అని భయమేసింది.ఆదిత్య ఏడుపు ఆపుకోలేక ఆమని ని హత్తుకుని ఏడ్చేస్తాడు. ఏం కాదులే ఆదిత్య ఇప్పుడు మన శైలు మన దగ్గరకు వచ్చింది కదా ఇకనుంచి చాలా జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్తుంది ఆమని.
ఆదిత్య అసలు శైలు ఎక్కడుందో నీకు ఎలా తెలిసిందని అడుగుతుంది ఆమని. సంజు వల్లే అని చెప్తాడు.ఈ విషయంలో సంజు లేకపోతే నేను ఏం చేసే వాడిని కూడా నాకు తెలియదు. సంజు లేకుంటే ఈరోజు మన ఇంట్లో పరిస్థితి ఎంటో ఊహించుకుంటేనే చాలా భయంకరంగా అని ఉంది చెప్తాడు ఆదిత్య. సంజయ్ కి చాలా థాంక్స్ చెప్పాలి అని అంటుంది ఆమని. టవల్ ఇచ్చి మీరు ఫ్రెష్ ఐ రండి నేను వంట ప్రిపేర్ చేస్తాను అని అంటుంది ఆమని.సరే అని బాత్రూంలోకి వెళ్తాడు ఆదిత్య. ఆమని కూడా వెళ్లి వంట ప్రిపేర్ చేస్తుంది. ఆదిత్య ఫ్రెష్ అయ్యి రాగానే అందరినీ తినడానికి రమ్మని చెప్తుంది ఆమని. రుక్మిణి నేను తర్వాత తింటాను అని చెప్తారు. ఆమని అందరికీ భోజనాలు వడ్డించి తను కూడా తినేస్తుంది. ఆ తర్వాత రుక్మిణమ్మ కోసం ఆమని ప్లేట్లో భోజనం వడ్డించి తన దగ్గరికి తీసుకొని వెళుతుంది. నాకు ఇప్పుడు తినాలని లేదు అని అంటుంది రుక్మిణమ్మ.
అత్తయ్య అందరూ తిన్నారు. మీరు తినకుంటే నీరసం వస్తుంది మీరు ఇప్పుడు తినాలి అని కలిపి తినిపిస్తుంది ఆమని. రుక్మిణమ్మ తిన్నాక ఆమని కిచెన్ అంతా సర్దుతుంది. తులసమ్మ, రుక్మిణమ్మ, చందు, పృద్వి, విజయ్, అజయ్, శైలు రూంలో పడుకుంటారు.మిగతా వాళ్లంతా ఎవరి రూములకు వాళ్ళు వెళ్ళిపోతారు.