రెండు రోజులు తర్వాత
నాన్న : ఒరేయ్ ప్రశాంత్ బయట వాన్ వచ్చింది లోపల ఆ సామాన్లు తీసుకొని రా…..
నాన్న పిలుపు తో అమ్మ నేను ఆల్రెడీ ముందు గా సర్దేసిన సామాన్లు సంచులు అన్ని మోస్తూ వాన్ లోకి ఎక్కించం…. మరో ఇద్దరు మనుషులు సాయం తో మొత్తానికి ఇల్లు కాలి చేసేసం….
వీధి లో సుబ్బారావు : ఏమయ్యా ఇల్లు కాలి చేస్తున్నావా.
నాన్న : అవునయ్య సుబ్బారావు మా వాడికి ఆ ఊర్లో సీట్ వచ్చింది అది మంచి కాలేజ్ అని తెలిసి ఆ ఊరికే ట్రాన్స్ఫర్ పెటేసుకున్నాను.
సుబ్బారావు : ఓహో శుభం నువ్వు అదృష్ట వంతుడు వయ్య ప్రశాంత్…..మీ నాన్న నీ కోసం ఊర్లు కూడా మారుతున్నాడు….. ఎంత పుణ్యం ఉంటే ఇలాంటి తల్లి తండ్రులు దొరుకుతారు అయ్యా……
నాకు సుబ్బారావు గాడి బట్ట తల మీద తపాల ఇచ్చి కోటేయలి అన్పించింది.
డ్రైవర్ : సార్ టైం అవ్తుంది ఎక్కండి
రాత్రి భోజన సమయం
నాన్న : ఎలా ఉంది కాలేజ్
నేను : బాగుంది
నాన్న : క్లాస్ లు అవి బాగా జరిగాయా
నేను : హా
నాన్న : ఎక్కడ కూర్చున్నావు.
అమ్మ : అబ్బబ్బా తిన్నప్పుడు కూడా ఏంటండీ మీ గోల
నాన్న అమ్మ వైపు ఎర్రగా చూసాడు……
అమ్మ : ప్రశాంతం గా తిన్నాక అడగొచ్చు కదా అని.
నేను : అమ్మ ఆ సుందరరావు ఇలాగే తిన్నప్పుడు అడిగే వాడు ఎమో…. ఎందుకు ఆయన్ని సతాయిస్తావ్…. పాపం అడుగుతుంటే.
*****************
రాత్రి పడుకునే సమయం 9:30
అదే నేను కాదు మా పేరెంట్స్ నేను 11:00 వరకు చదివి ఆ తర్వాత పడుకోవాలి.
నాన్న : అడ్వాన్స్ ఇవ్వమని ఇచ్చాను… ఇచ్చవా…
అమ్మ : హా వెళ్ళా అండి…. ఇంటిగాలోలు (ఓనర్స్) ఎవరు లేరు…ఒక పాప ముసలావిడ మాత్రమే ఉన్నారు….
(మేము ఉన్నది పెంట్ హౌస్ లాంటి ఇంట్లో….మా కింద ఇంట్లో మా ఓనర్స్ ఉంటారు…..)
నాన్న : హా మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఎదో షాప్ చుస్కుంటారు అంట…. పొద్దున్నే నేను వెళ్తున్నప్పుడే వాళ్ళు కూడా వెళ్తున్నారు.
నేను : అబ్బా ఇక్కడ చదువు కోవాల ఒద్ద నేను మీరు అలా మాట్లాడకండి…. డిస్టర్బ్ గా ఉంది…..(నా కోపాన్ని ఈ రకంగా చూపిస్తా చదువు విషయంలో వాళ్ళ మీద….ఈ okka విషయం లో నన్ను ఏమి అన లేరు)..
నాన్న : వాడికి రేపు ఆ రూం సర్దేసి ఇవ్వు…
అమ్మ : రేపు మొత్తం క్లీన్ చేస్తా నాన్న ఈ ఒక్క రోజు ఇలా చదువుకో……
నేను : హా సర్లే ఇంక పడుకో
కాసేపటికి
అమ్మ నాన్న …. గుర్ర్ గుర్ అని గురకలు పెడుతున్నారు….. నేను వాళ్ళ వంక చూసి దీని కంటే మీరు మాట్లాడుకుంటే నే బెటర్ ఎమో అని చెవులు ముస్కొని మరి చదువుకుంటున్న….
*************************
మరుసటి రోజు పొద్దున్న 4:30 కి అలారమ్ మోగింది మా నాన్న ఫోన్ లో….. తను లేవటానికి కాదు నన్ను లేపటానికి…. కోడి కూడా కుయ్యని ఇలాంటి ఊర్లో ఇంత పొద్దున్నే లేచే పకోడీ గాడ్ని నేనేమో…..ఒరేయ్ సుకొ గా నీకు దండం రా…. అనుకుంటూ బద్దకం గా లేచాను….. లేచాక అర్థం అయింది అయింది ఇంకా ఒక రోజే గా అది కూడా రాత్రే చదివేసం… ఇంకేం ఉంది లే అని మళ్ళ కాస్త కునుకు పాట్లు పడ్డానో లేదో…..రేయ్ ప్రశాంత్ అని చీకట్లో మా నాన్న అరిచాడు…… నేను టింగ్ మని లేచి కూర్చుని హా లేచేస నాన్న అని అన్నాను… కర్మ రా బాబు అని తిట్టుకుంటూ….. అలాగే లేచి మెల్లగా తలుపు తీసుకొని బయటకి వచ్చాను….. మేడ మీద నుంచి చుట్టు పక్కల అంత కన్పిస్తుంది…. ప్రశాంత్ నగర్ మేము ఉంటున్న ఏరియా….ఆహా నిజం గా ఎంత ప్రశాంతం గా ఉంది…. దూర దూరంగా ఇల్లులు…. మధ్య మధ్య లో కాలి గ్రౌండ్ లు చెట్లు… పెద్దగా జన సంచారం లేని ఏరియా….ఆహా పేరు కి తగట్లే ప్రశాంతం గా ఉంది మా కాలనీ కూడా… హ్మ్మ్ ఈ పేరు మనుషుల కి సెట్ అవ్వదు ఎమో లే …..అని ఒళ్ళు విరుచుకుంటూ మా పక్కిల్లు ని చూసా…. ఒరోరే ఎంది రా ఇది ఇట్లా ఉంది అని ముక్కున వెలేస్కున్న…… తెల తెల వారు చీకట్లోనే….. నేను ఆ ఇంటి ని పరిశీలిస్తున్న…..మా ఇంటికి ఆనుకునే ఉంది…. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ…ఆ గోడ మీద ముళ్ళ ఫెన్సింగ్…. ఇది ఇళ్ల లేక ఏదైనా మిలిటరీ వాళ్ళు ఉండే స్థావరమ అనేట్లు ఉంది…. అబ్బో సీసీ కెమెరా లు కూడా ఉన్నాయి అంటే ఎదో పెద్ద ఆఫీస్ లా ఉంది అనుకొని చూస్తున్నా….
అంతే రేయ్ ప్రశాంత్ అని గావు కేక తో….నా గుండెల్లో గుది బండ పడినట్లు అయింది….. తిరిగి చూస్తే మా నాన్న కరవడానికి రెడీ గా ఉన్న…. మరీ తండ్రి ని అల పోలిస్తే బాగోదు లే…. మీరె అర్థం చేసేస్కొండి….
**************************
