పూర్తి గా తెల్లారింది….. నేను రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్దాం అని బాక్స్ తీసుకొని అమ్మ కి వెళ్తున్నా అని చెప్పి….. మెట్లు దిగాను…. మెట్లు దిగి ఇక్కడ నా సైకిల్ ఒకటి ఉండాలి కదా ఏమయ్యింది అబ్బా అని అటు ఇటు చూస్తే…. అది కాస్త మెట్ల కింద పెట్టి ఉంది…. ఓహ్ ఇక్కడున్నావా అనుకుంటూ మెల్లగా దూరి కీ లాక్ తీస్తున్నా….. ఒకటి గమనించారా మనల్ని ఎవరైనా చూస్తున్నారు అంటే మనకి ఎలాగోలా తెలిసిపోద్ది…. అలాగే ఆ క్షణం నాకు అన్పించింది…. ఇరుకు గా ఉన్న మెట్లు కింద పక్క గా ఒక కిటికీ లోంచి ఒక వ్యక్తి కిటికి గ్రిల్స్ పట్టుకుని నన్నే చూస్తున్నారు…. నాకు చాలా దగ్గరగా…. అక్కడ ఒకరు ఉన్నారు అని తెలిసి షాక్ లో నేను పైకి లేవగానే…. ధడేల్ మని నా గుండు కి బొక్క పడేలా మెట్టు తగిలింది…..
క్లాస్ లో బెంచ్ మీద తల పెట్టుకొని పడుకున్నాను… మెట్టు తగిలేసరికి తల అంతా దిమ్ము గా అయినట్లు ఉంది…. ఇంక ఎవరూ రాలేదు…. అంత లో రోహిత్ గాడు వచ్చాడు….
రోహిత్ : హాయ్
నేను సగం తెరిచిన కళ్ళ తో వాడిని చూసి హాయ్ అని చెప్పి అలాగే పడుకున్న.
రోహిత్ : ఎం అయింది
నేను : తల నొప్పి గ ఉంది.
రోహిత్ : ఎందుకు ఉంది
నేను : తల కి మా ఇంటి దగ్గర మెట్టు తగిలింది.
రోహిత్ : ఎందుకు చుస్కోకుండ తగులుకున్నావా.
నేను : హా
రోహిత్ : అల ఎలా… అంటే ఇంకేదో చూస్తున్నావ్ ఎంటి అది.
నేను : ఉఫ్ఫ్!!!!!!!
రోహిత్ : చెప్పు చెప్పు ఎం చూసావు
నేను : అవును నా పక్కన ఒకరు ఉన్నారు…. సడన్ గా చూసేసరికి భయపడి గుద్దేస్కున్న.
రోహిత్ : ఎవరు ఉన్నారు
ఇందాకటి నుంచి చూస్తున్నా… ప్రశ్న మీద ప్రశ్న ఆపట్లేదు ఎంటి ఈడు… అయినా ఈడికి ఎందుకు చెప్పాలి అసలే తలనొప్పి తో ఉంటే వీడు ఇంకా తలనొప్పి గా తయారయ్యాడు అని రిప్లై ఇవ్వకుండా అలాగే పడుకున్న…
********************
క్లాస్ స్టార్ట్ అయింది నేను కష్టం గా నే లేచి కూర్చున్న
అంత లో ప్రిన్సిపల్ వచ్చాడు…. ఎదో నాలుగు ముక్కలు అవి ఇవి చెప్పి…. ఫ్రంట్ బెంచ్ లో ఉన్న వాళ్ళని వెనక్కి పోమన్నాడు…. బాక్ బెంచ్ లో కోరి కూర్చున్న వాళ్ళని ముందుకు మార్చేశాడు…. ఇంట్రస్ట్ ఉన్నవాడు ఎక్కడైనా చదువుతాడు…. లేని వాడు ఫ్రంట్ బెంచ్ లోనే చదువుతాడు అంట వెళ్ళిపోతూ లాస్ట్ డైలాగ్…. నాకు మాత్రం తలనొప్పి తగ్గే దాకా లాస్ట్ బెంచ్ బెటర్ అని వెళ్లి పడుకున్న….
*******************
రోహిత్ : హాయ్ ఇంకా తగ్గలేదా
నేను : నీకు ఇంకో దగర ప్లేస్ దొరకలేదా
రోహిత్ : నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే కూర్చుంట.
నేను : ఎందుకు
రోహిత్ : ఫ్రండ్ ఎట్ ఫస్ట్ సైట్
నేను : అయితే చిన్న హెల్ప్
రోహిత్ : చెప్పు
నేను : కాసేపు ఎం మాట్లాడకు
రోహిత్ : సరే ఈ రావు బామ్ రాస్కో.
ఈడు మంచోడో మెంటలోడో అర్థం కాలేదు…. ఇప్పటి వరకు ఉండి కూడా ఎందుకు ఇవ్వలేదు అని అడిగా.
రోహిత్ : సర్ప్రైజ !!!!!!
*********************
