లేచి, నేను వాళ్ళ వైపు చూశాను. వాళ్లంతా పడవ అంచుకి పరుగులు తీశారు. నా ఎత్తు ఇంకా రూపం వాళ్ళ మీద ఆవరించడంతో వాళ్ళు పిచ్చిగా వణికిపోయారు, వాళ్ళ దురదృష్టకరమైన ముఖాల మీద ఏడుపు నీడ పడింది. “మమ్మల్ని క్షమించండి,” అని వాళ్లలో ఒకరు తడబడుతూ అన్నారు.
“మీ కెప్టెన్ ఎవరు ?” అని కోపంతో అడిగాను. నేను ఈ రోజుని ఆనందంగా ముగించేవాడిని, కానీ ఇప్పుడు నాకు గాయమైంది, నా ప్రేయసి వారి వల్ల ఏడుస్తోంది.
ఆమె హెల్మ్ దగ్గర మూలుగుతున్న ఒక దొంగని చూపించింది, ఆమె చేయి ఆకులా వణుకుతోంది. గాయపడిన దొంగ ఛాతీలో బాణం ఉంది, బహుశా ఎక్కువ సమయం బ్రతకదు. ఆమె చనిపోవడానికి అర్హురాలు కాబట్టి నాకు బాధ అనిపించ లేదు. “ఈ రాత్రి మీ ప్లాన్ ఏమిటి ?”
“ఏమీ లేదు, మేము పొరపాటు చేసాము” అని ఆమె అంది.
“మీరు సముద్రపు దొంగలు కదూ ?”
“కాదు, కేవలం తప్పుదోవ పట్టిన జనాలం,” అని వాళ్ళు అన్నారు.
నేను కళ్ళు తిప్పాను. “మీ దోపిడీ సొమ్ము చూపించండి, నేను మిమ్మల్ని వదిలివేస్తాను.”
“మా దగ్గర ఏమీ లేదు.”
“అతను చెప్పింది చేయండి,” అని ఇంకెవరో ఆమెని అడ్డుకున్నారు.
నేను నా కత్తి కొనని ఆమె గొంతుకి గురిపెట్టాను. “నేను దీన్ని ఒక్కసారి మాత్రమే చెబుతాను. చూపించు.”
ఆమె తల ఊపింది. చివరికి పరిగెత్తి ఒక రహస్య తలుపు తెరిచింది. రెండు నిధి పెట్టెలని తన వెనుక నుండి లాగి నా కాళ్ళ ముందు పెట్టింది. “మీరు కావాలంటే మేము ఇంకా ఎక్కువ ఇస్తాము,” అని ఆమె గొంతు తడబడుతూ చెప్పింది.
“మీ మురికి డబ్బు నాకు వద్దు, నేను దానిని అసలైన యజమానికి తిరిగి ఇస్తాను” అని నేను వాళ్ళతో అన్నాను.
నేను నా కత్తిని ఇంకా వాడలేదు. వాళ్ళు అప్పటికే తమని తాము తడుపుకుంటున్నారు. నేను ఆ రెండు నిధి పెట్టెలని నా చేతుల్లోకి తీసుకుని నా పడవపైకి దూకాను. ఆ దూకుడు వాళ్ళని ఆశ్చర్యపరిచింది. “మీరు మళ్ళీ ఇలాంటిది చేస్తే, నేను మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరుకుతాను” అని చెప్పాను.
వాళ్ళు తలలు వంచారు. “దయచేసి, మా క్షమాపనని స్వీకరించండి.”
నేను సమాధానం ఇవ్వలేదు. వాళ్ళని చూస్తుంటేనే అసహ్యం వేసింది. నేను నా పడవని ఆటో పైలట్ లో పెట్టాను, మేము అక్కడి నుండి దూరంగా బయలుదేరాము. నేను త్వరగా మా మాస్టర్ సూట్ కి వెళ్ళాను, కామిని దివాన్ అంచున తన తల చేతుల్లో దాచుకుని కూర్చుంది. ఆమె ఏడుస్తోంది, కన్నీళ్లు ఆమె మణికట్టు, చేతుల మీదుగా కారుతున్నాయి.
“కామినీ, ఏమైంది ?” అని ఆమెని అడిగాను. ఆమె పక్కన కూర్చుని నా చేయి ఆమె భుజం చుట్టూ వేశాను.
“నాకు ఆయుధాలు ఇంకా పోరాటాలు, గొడవలు నచ్చవు,” అని ఆమె ముక్కు చీదింది.
నేను కొన్ని టిష్యూ పేపర్లు తీసుకుని ఆమె ముక్కు, బుగ్గలు తుడువడానికి సహాయం చేశాను. “నన్ను క్షమించు, కానీ నేను చేయాల్సి వచ్చింది.”
“మీకు గాయమైందా ?”
“నేను బాగానే ఉన్నాను. వాళ్ళ కెప్టెన్ గాయపడింది, వాళ్ళు మన జోలికి మళ్ళీ రారు.”
“సరే, నేను ఏడుస్తున్నందుకు నన్ను క్షమించు, కానీ నేను పోరాటాలని చూడలేను” అని కామిని ముక్కు చీదుతూ అంది.
“నాకు అర్థమైంది, నేను నిన్ను తప్పు పట్టను. మనం భిన్నమైన వ్యక్తులం” అని అన్నాను.
ఆమె తన చేతుల మధ్య నుండి తల ఎత్తింది, నా తొడని చూడగానే ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి. “అయ్యో, నీకు రక్తపు గాయం అయింది.”
“నేను బాగానే ఉన్నాను,” అని అన్నాను.
“లేదు, నేను దాన్ని శుభ్రం చేయాలి” అని అంది.
“సరే,” అని ఒప్పుకున్నాను. ఆమె నన్ను చూసుకోవడానికి బదులుగా నేను ఆమెతో ఎక్కువ సమయం గడుపుతానని అనుకున్నాను. ఆమె నన్ను చూసుకోవాలని పట్టుబట్టడంతో, నాకు ఇప్పుడు వేరే మార్గం లేనట్లు అనిపించింది. కామిని ముక్కు చీదుతూ ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం చేయి చాపింది. ఆమె కళ్ళు వెంటనే ఆరిపోయాయి, ఆమె ఇక అంత బాధగా కనిపించలేదు. వేరే వాళ్ళ కోసం సహాయపడడం ఆమెకి ఇష్టమని అది ఆమెని సంతోషపరుస్తుందని నాకు తెలుసు.
“నువ్వు ఇంతకు ముందు ఎప్పుడన్నా గాయాన్ని కుట్టావా ?” అని కామినిని అడిగాను.
“చాలా సార్లు, పిల్లలు పరిగెత్తడం, ప్రతిచోటా పడిపోవడం చేస్తారు. నేను చిన్నతనంలో నేర్చుకున్న మొదటి నైపుణ్యాలలో అది ఒకటి” అని ఆమె పెదవులపై చిరునవ్వుతో చెప్పింది.
“అలాగా,” అని అన్నాను. అది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఆమె మోకాళ్ళ మీద కూర్చుని నా షార్ట్ ని తీసింది. ఆమె అలా నన్ను చూసుకోవడం వింతగా కామోద్దీపన ని కలిగించింది. ఆమె నా తొడ నుండి, గాయం నుండి కారుతున్న రక్తం శుభ్రం చేయడం మొదలుపెట్టింది.
