యు అర్ బ్యూటిఫుల్ 200

రోడ్డంతా అటూ ఇటూ కాలేజీల బస్ ల కోసం తమ తమ స్టాప్స్ లో ఎదురుచూసే యువ్వనంతో కళ్ళనిండుగా ఉంది. రోడ్ కి ఇటుపక్కనున్న శ్రీధి కాలేజీ బస్ స్టాప్ మీదే చుట్టుపక్కలున్న అందరి దృష్టి. మామూలుగానే శ్రీధి కాలేజి అమ్మాయిలంటే విజయవాడలో ఒక రేంజ్ ఉంది. బయటి కాలేజీ అబ్బాయిలకు శ్రీధి కాలేజి అమ్మాయితో మాట్లాడడం ఒక స్టేటస్ సింబల్ లాగా అన్నమాట. ఇక ఆ కాలేజీ అమ్మాయిని పడేస్తే వాడిక వాడి కాలేజీలో హీరో బిల్డఅప్ ఇచ్చుడే. అలాంటిది ఈ బస్టాప్ లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు అమ్మాయిలు ఎక్కుతారు. వీళ్ళు కాలేజీలోకల్లా అందమైన అమ్మాయిలే కాదు, అల్లరి చేసే అమ్మాయిలు కూడా.. సనా అయితే మరీనూ. ఈ రోజు అప్పటికే ఐదుగురు అమ్మాయిలు వచ్చేశారు సనాతో సహా. చుట్టుపక్కల అందరి కళ్ళూ వీళ్ళ మీదే ఉన్నాయి. ఒక్కడివి తప్ప. వాడెవడో కొత్త అనుకుంటా ఇక్కడ. ఈ అమ్మాయిల పక్కనే ఉన్న స్టాప్ లో ఆ కుర్రాడు వీపుకి బాగ్ తగిలించుకుని మెడలో కెమెరా పెట్టుకుని అటెటో తిరిగి వంగి వంగి పువ్వుల్ని పురుగుల్ని ఫోటో తీస్తున్నాడు. నవ్వుకుంటూ, తుళ్ళకుంటూ, బట్టలు సరి చేసుకుంటూ, ఎవరెవరు తమని చూస్తున్నారో ఓరకంటితో లెక్కేస్తున్న సనాకి వీడి నిర్లక్ష్యపు ధోరణి ఆశ్చర్యం తెప్పించింది.
“అటు చూడండే.. ఎదురుగా పువ్వుల్లాంటి మనల్ని పెట్టుకుని పురుగుల్ని ఫోటోలు తీస్తున్నాడు అంది”
అంతే ఐదుగురు కలిపి వాడిని స్కాన్ చేసేస్తున్నారు.
“కుర్రాడి కలర్ నీకు మాచింగేనే సనా” అంటూ పక్కనున్న పాప సనా నడుం గిల్లి చెప్పింది.
“ఐ హావ్ ఏ బాయ్ ఫ్రెండ్” ఆ కుర్రాడి మొహం చూడడం కోసం అటే చూస్తూ ఇటు పాపతో చెప్పింది సనా.
“మరీ అలా తినేసేలాగా చూడకే.. దిలీప్ కి చెప్తా.. అదే నీ బాయ్ ఫ్రెండ్ కి చెప్తా”
“చెప్పుకో”
అంతలో బీప్ అని గట్టిగా హార్న్ మోగడం వలన అంతా రోడ్ వైపు తిరిగారు. ఎదురుగా కార్ ఆగింది. అద్దం దించి లోపల నుండి ఓ అమ్మాయి తొంగి చూస్తూ “గెట్ ఇన్” అంది.
అప్పటిదాకా ఈ ఐదుగురు అమ్మాయిల్నే చూసిన చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు కారులోని అమ్మాయి కోసం తొంగి తొంగి చూస్తున్నారు. ఎందుకంటే తానే ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆఫ్ శ్రీధి కాలేజీ. అఫ్కోర్స్ ఆ కాలేజీలోకల్లా అందమైన అమ్మాయి అంటే విజయవాడలోకల్లా అందమైన అమ్మాయనే అర్థం. పేరు రాశి.. రాశి ఖన్నా..
“ఏంటే సడన్ గా కార్ ఏసుకొచ్చావ్” తన బరువైన ఛాతిని తలుపుకు అద్ది తల లోపలికి పెట్టి అడిగింది సనా
“ఇక ఈ కార్ మనదే” కళ్ళు మెరుస్తూ చెప్పింది రాశి

“మీ డాడ్ అంత ఈజీగా ఎలా ఇచ్చేసాడే” మళ్ళా ఆశ్చర్యంగా అడిగింది సనా..
“ముందు ఎక్కండి.. దారిలో చెప్తా” అని కొద్దిగా వంగి డోర్ ఓపెన్ చేసింది. తాను పంజాబీ టాప్ వేసుకోవడం వలన కొద్దిగా ఎద అలా అలా సనాకి దర్శనమిచ్చింది. అయినా ఇలా కనపడడం అమ్మాయిలకు కొత్తేమి కాదు. ఒకళ్ళవి ఒకళ్లకు ఏదో రకంగా కనిపిస్తూనే ఉంటాయి.
వెంటనే తలుపులు తీసుకుని ఐదుగురు అమ్మాయిలు ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటూ ఇరుగ్గా కూర్చున్నారు.
“మంచి కుర్రాడు ఉన్నాడు. కాసేపాగి వచ్చి ఉంటే సైట్ ఏసుకునే వాళ్ళం కదే” అంది సనా వేలు ఆ కుర్రాడి వైపు చూపిస్తూ.. రాశి కళ్ళు ఆమె చూపుడు వేళ్ళని అనుసరిస్తూ అతనిని చూస్తున్నాయి. అతను వంగి ఏవో ఫోటోలు తీసుకుంటూనే వున్నాడు.
“వాళ్ళం కాదు, నువ్వే సైట్ కొడ్తున్నావ్ మమ్మల్ని కలపకు” పక్కనున్న పాప సనాకు కౌంటర్ ఏసింది.
“అబ్బాహ్ చూడవే.. ఇంకొంచెం వంగుంటే బ్యాక్ క్లీవేజ్ కనిపిస్తది” చిలిపిగా రాశిని భుజం మీద పొడుస్తూ అనింది సనా.
“వాట్ ద నాన్సెన్స్. సనా.. థిస్ ఐస్ రాంగ్, disgusting.. unintentional గా కనిపించే వాటిని మనం చూడకూడదు అండ్ ఇలా మాట్లాడకూడదు” అతన్ని చూస్తూనే అంది రాశి.
“ఇదొకటి.. జోక్ కి నిజానికి తేడా తెలీదు” చిరాగ్గా ఫేస్ పెట్టింది సనా..
“వాటెవర్” అని చూపు తిప్పి కార్ కీ తిప్పి స్టార్ట్ చేసింది.
అంతలో ఎదురుగా..ఒక 15 మీటర్ల దూరంలో ఒక ముసలి మనిషి నేల మీద పడి ఉండడం గమనించింది రాశి. తదేకంగా అతన్నే చూస్తుంది. ఒక్క సారిగా కళ్ళు పెద్దవి చేసి కార్ ఆపేసింది. తలుపు తీయబోతున్న రాశితో “ఏమైందే” అని అడిగింది సనా.
“సీ అక్కడ ఎవరో ముసలాయన పడిపోయి ఉన్నాడు.. ఎవరూ పట్టించుకోవట్లేదేంటి ఇంతమంది ఉన్నారు రోడ్ మీద..” అంటూ దిగిపోయింది.
తనతో పాటు మిగతా అమ్మాయిలు కూడా దిగి రాశి తో పాటు నడుస్తున్నారు.
“ఎవడో తాగుబోతు అయ్యుంటాడు లేవే” పక్కనున్న పాప ఆపడానికి ప్రయత్నిస్తుంది.
“మే బీ..బట్ అక్కడ బ్లడ్ ఉంది” అంది రాశి వేగంగా నడుస్తూ.
వెంటనే సనా నడకని పరుగులాంటి నడకగా మార్చింది రాశి తో సమానంగా.
వీళ్లంతా వేగంగా నడుచుకుంటూ ఆ ఫోటోలు తీసుకుంటున్న కుర్రాడిని దాటేశారు. ఇంతమంది అంత వేగంగా నడిచేసారికి అతని దృష్టి వీళ్ళ మీద పడింది. ఇతనూ వీళ్ళని చూస్తూ చిన్నగా నాలుగు అడుగులు వేసాడు.