యు అర్ బ్యూటిఫుల్ 220

“హాయ్ అండి. నా పేరు అర్జున్. ఈసీఈ 3 నేను” అని ఆపాడు
“ఓహ్”
“అదీ.. మొన్న saturday మీరు benz circle దగ్గర..” అని చెప్పబోతుండగా రాశికి అతను ఏ సంఘటన గురించి మాట్లాడబోతున్నాడో అర్థం అయింది. “హే.. ప్లీస్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ ఇన్సిడెంట్” అంటూ కట్ చేసింది.
“అంటే అదీ..” అంటూ భయంగా మాట్లాడబోతున్నాడు
“ప్లీస్” అంటూ మళ్ళా ఫోన్ లోకి దూరిపోయి ఏదో స్క్రోల్ చేస్తుంది.
“ఆ వీడియో నేనే తీశాను”
రాశి ఫోన్ లో చేసేది ఆపేసి. కళ్ళతో పైకి చూసింది. అలా చూస్తూనే చిన్నగా లేచింది. అతను ఏదో ఇబ్బందిగానే చూస్తున్నాడు. రాశి చేతులు కట్టుకుని “యా చెప్పు” అంది కొంచెం కళ్ళతో కోపాన్ని ఒలికిస్తూ
“అదే.. నాకో యూట్యూబ్ ఛానల్ ఉంది.. ప్రాంక్ వీడియోస్ అవీ చేస్తుంటాను. మొన్న ఆరోజు మీరంతా కలిపి ముసలాయనికి హెల్ప్ చేశారు కదా.. అప్పుడు అక్కడే ఉన్నా.. అప్పుడు వీడియో తీశాను..”
రాశి అలానే చూస్తుంది. కోపంగా చూస్తుందని అర్థం అయినా చెప్పడమే గతి అని మళ్ళా గొంతు సరిచేసుకుని
“…అది నా ఛానెల్ లో పెట్టాను. రెస్పాన్స్ అంత బాగా వస్తుందనుకోలేదు” అంటూ చూశాడు
“అయితే” అంది ఇంకా ఇంకా అతని కళ్ళల్లోకి చూస్తూ
“అదే మీ పెర్మిషన్ తీసుకుందాం అని…”
రాశికి ఈ మాటకి మండిపోయింది. అంతే తన స్టైల్ లో క్లాస్ మొదలెట్టడానికి సిద్ధమైంది.
“నీకు కంసెంట్ మీనింగ్ తెలుసా అసలు? పెర్మిషన్ అడుగుతున్నవా? ఇప్పుడు? 20 వేల మంది చూసిన తర్వాత అందులో ఉన్న నన్ను అడుగుతున్నవా? డోంట్ యూ నో హౌ టు రెస్పెక్ట్ ప్రైవసీ?”
“Sorry”
“Not accepted” అని తాను కూర్చుని తన ఫోన్లో చూసుకుంటుంది.
“తప్పు నాదే. మిమ్మల్ని ముందే అడగాల్సింది. కానీ నాకు అంత ఆలోచన రాలేదు. అలా అడగాలని కూడా తెలియదు. ఏదో హెల్ప్ చేస్తున్న అమ్మాయిని తీసి అందరికీ ఇన్స్పిరేషన్ ఇద్దాం అనుకున్నా. కానీ ఆ ముసలాయన అలా మాట్లాడేసరికి అది ఇలా టర్న్ తీసుకుంది.” రాశి ఫోన్లో ఏదో స్క్రోల్ చేస్తోంది గానీ.. అతని మాటలే వింటోంది. “అసలే మీరు అందంగా ఉంటారు కదా.. నా ఛానెల్ కి వ్యూస్ కూడా వస్తాయి అని చేసేశాను. నిజంగా sorry అండి” ఫోన్ ఆపేసి రాశి అతన్ని చూసింది. అతను నిజాయితీగా చెప్పినట్టు తోస్తుంది తనకు. నిజమే చాలా మందికి కాన్సెన్ట్ అనేది అడగాలని తెలియదు. కానీ అడగకపోవడం తప్పు అని తెలిసినా అదే తప్పు చేసే వాళ్లదే తప్పు. కానీ ఇతను నిజాయితీగా నాకు తెలియదు, నేను చేసింది తప్పు అంటున్నాడు. రాశికి ఏం చెప్పాలో తెలియలేదు.

“నీ sorry accepted లే.. ఇంతకీ నీ పేరేంటి బాబూ” అని అతని వెనకాల నుండి మాట వినపడింది. వెనక్కి తిరిగి చూసాడు. అతనికి ఆ అమ్మాయి తెలుసు. వీడియో లో చూశాడు. “అర్జున్” అన్నాడు. “సనా నా పేరు, దీని పేరు రాశి”
“హా తెలుసండీ”
“ఏం తెలుసు? నా పేరా? దాని పేరా? లేక ఇద్దరివా?” సనా అంతే. సందర్భాన్ని ఎప్పుడూ ఇలా ఫ్రెండ్లీ గా మార్చేస్తుంది.
“ఆమె పేరు”
“అంతేలే నీకు ‘ఆమె’ మీదనే ఈ ఇంటరెస్టు లాగుంది. అక్కడ ఆరుగురం వున్నా కూడా క్యూట్ గర్ల్ అంట.. మరి మేమేంటో..” ఆమె అన్న పదాన్ని నొక్కి చెప్పింది. అతను రాశిని ‘ఆమె’ అన్నాడని పొడుస్తూ.
రాశికి కూడా నిజమే కదా అక్కడ అంతమంది ఉంటే క్యూట్ గర్ల్ అని తనొక్కదాన్ని ఉద్దేసింది టైటిల్ పెట్టాడు అనుకుంది.
“అంటే ఆమె..” మళ్ళా ఆమె అంటే ఈ సనా ఏమంటదో అని ఆమెని మింగేసి ” అంటే తాను కదా మిమ్మల్ని అందరినీ హెల్ప్ చేయమంటూ లాక్కెళ్ళింది. అందుకే ఆమెకు ఫోకస్ పెట్టాను.. ఆమె సర్వీస్ నేచర్ వల్ల అలా..”
“అలా ఫోకస్ అంతా ‘తాను’ మీద పెట్టా అంటావ్” చిలిపిగా చూస్తూ అంది సనా
అర్జున్ కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అది చూసి రాశి కి నవ్వొచ్చింది. ఈ సనా నుండి ఈ క్యూట్ అబ్బాయిని కాపాడాలి అనిపించింది.
“అతను మనతో పాటు, నువ్వు రాగింగ్ చేయక్కర్లేదు”
” ఓహో.. ‘అతణ్ణి’ వదిలేయమంటావ్.. నేనేం ఎత్తుకుపోనులేవే”