యు అర్ బ్యూటిఫుల్ 220

“అదే పిల్లి లాగా ఎవడో పూగ్గడు వీడియో తేశాడుగా.. ఆ లంబ్ది కొడుకు గురించే” రాశికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళా తిరిగి అర్జున్ వైపు చూసింది అయోమయంగా.. అర్జున్ మొఖంలో నెత్తురు చుక్కలేదు. అర్జున్ మొహం చూడగానే రాశికి పొట్టపగిలేల నవ్వొచ్చింది. కానీ అంతా కడుపులోనే దాచుకుని పెదాలు కరుచుకుని నవ్వు ఆపుకుంటూ ముసలాయనతో “ఏం పర్వాలేదు అంకుల్” అంది.
“పర్లేదు కాదమ్మా అలా ఎలా తీస్తాడు లంబ్డికొడుకు అసలు.. అలాంటి ముండా..” అని ఇంకేదో చెప్పబోతుంటే.. రాశి నవ్వు ఇంకా ఎక్కువసేపు ఆపుకోలేదని అర్థం అయ్యి “అంకుల్ అంకుల్ పర్లేదు.. ఏం కాదు మీరు వెళ్ళండి.. మర్చిపోండి ఇదంతా” అంటూ అతన్ని చిన్నగా పంపిచేస్తూ అతను కొంత దూరం వెళ్ళగానే పగలబడి నవ్వింది.
“సరేలే నేను చెప్పినట్టే మారాడుగా అది చాలు” అని కవర్ చేసుకుంటున్నాడు అర్జున్.
“సారి అర్జున్.. బట్ ఐ కాంట్ కంట్రోల్..మై…” అంటూనే నవ్వేస్తుంది.. నువ్వు నవ్వుకో అంటూ..”సన నీ ఫ్రెండ్ ని చూసుకోలేకపోతే నవ్వి నవ్వి ట్రాఫిక్ జామ్ చేసేట్టు ఉంది” అంటూ పక్కకు..ఆ ముసలాయన పోయే వైపు పోయాడు. ఇవేమీ గమనించని సన రాశి ఎందుకు నవ్వుతుందో తెలియక దగ్గరకొచ్చి అడుగుతుంది.
“ఇదిగోండి అంకుల్..” అంటూ అర్జున్ పిలిచాడు..
వెనక్కు తిరిగి..రాశితో వచ్చిన అబ్బాయి అని గుర్తుపట్టి “ఏంటి” అన్నాడు
“అదే.. ఆ వీడియో ఇంటర్నెట్లో ఉండడానికి నీకేం ప్రాబ్లెమ్ లేదు కదా”
“ఏ వీడియో??”
“అదే.. నువ్వు, మా రాశి ఉన్న వీడియో”
“నాకేం ప్రాబ్లెమ్.. ఆ అమ్మాయికే ప్రోబ్లమ్”
“అయితే ఉంచొచ్చా?”
“తీసి దెంగాలి.. ఆ అమ్మాయి ఇబ్బంది పడదూ… అయినా ఆ లంబ్డికొడుకు ఎవడో తీయాలి గా”
“ఆ అమ్మాయి ఒప్పుకుందిలే గాని నీ సంగతి చెప్పు” అసహనంగా అడిగాడు అర్జున్
“అమ్మాయి ఒప్పుకుందా.. ఎవడు అడిగాడు?”
“నేనే”
“అంటే ఆ వీడియో తీసిన లంబ్డి..”
“ఆ..నేనే..” ఇంకా అసహనంగా…
ఆ ముసలాడు అర్జున్ ని, దూరంగా ఉన్న రాశిని చూసి ఏం అనుకున్నాడో ఏమో “సావు” అని వెళ్ళిపోయాడు.

***

“ముసలాడు.. అదే ముసలాయన కూడా ఒప్పుకున్నాడు..సో ఇక వీడియో డిలీట్ చేయను సరేనా” రాత్రి 8 ప్రాంతంలో రాశి కార్ లో అర్జున్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లే దారిలో అడిగాడు.
“ఆ టైం లో నిన్ను వీడియో తీసి పెట్టాల్సింది నీ వీడియో” అంటూ నవ్వుతుంది రాశీ.
“ఐ కన్సిడర్ థిస్ యాస్ యెస్” అన్నాడు.
“క్యూట్ బాయ్ ఎంబరాస్డ్ ఆన్ విజయవాడ స్ట్రీట్ అని థంబ్ నైల్ పెడితే నా వీడియో వ్యూస్ దాటిపోతాయి”
“నో వే.. నిన్ను దాటలేం”
“ఎందుకేంటి” నవ్వుతూనే అడిగింది రాశి.
“ఎందుకంటే ఆ వీడియోలో నీది ఎంత అందమైన మనసో తెలుస్తుంది. ఇంత అందమైన అమ్మాయిలు అంతే అందమైన మనసు కలిగి ఉండడం రేర్ తెలుసా”
కార్ నడుపుతూనే కళ్ళు అర్జున్ వైపు చూశాయి. నిజమే చెప్తున్నట్టుగా ఉన్నాయి అతని కళ్ళు.
“అందుకే ఇంత డబ్బు వుండి కూడా మిడిల్ క్లాస్ బోయ్ తో ఇంత దగ్గరగా ఉన్నావ్, అదీ నీ పెర్మిషన్ లేకుండా నిన్ను వీడియో తీసిన అబ్బాయితో.. ఎంత బ్యూటిఫుల్ నువ్వు.. నన్ను అర్థం చేసుకున్నావ్.. వేరే ఎవరన్నా అయితే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు.. కానీ నువ్వు నాకు తెలియదు అంటే చెప్పావ్.. అది తప్పు అని తెలిసేలా చెప్పావ్.. అందుకే నువ్వు బ్యూటిఫుల్..”
రాశి సైలెంట్ గా కార్ నడుపుతోంది.. కానీ రాశి ఇదంతా మనసుతో వింటుంది అనడానికి సాక్ష్యంగా కార్ స్లో అవుతోంది.
“ఇప్పుడు చెప్పు నా వీడియో నీ వీడియోని క్రాస్ అవుతుందా?”
చిన్నగా నవ్విన రాశి. “అవుతుంది” అంది.
“ఎందుకు?”