యు అర్ బ్యూటిఫుల్ 220

“బికాస్ యు అర్ బ్యూటిఫుల్”
“అబ్బాయిల్ని హ్యాండ్సమ్ అంటారు అండీ” అంటూ నవ్వాడు
“నేర్పే వాళ్ళ కన్నా నేర్చుకునే మనసున్న వాళ్లే బ్యూటిఫుల్” అంది రాశి.
రాశి వైపు తదేకంగా చూస్తూ.. “అయితే నువ్వు కూడా నాలగా బ్యూటిఫుల్ హార్ట్ ని ప్రేమిస్తావా?” అన్నాడు
“వాట్..” చాలా చిన్నగా అంది రాశి. అయోమయంగా అతన్నే చూస్తూ పక్కకు కార్ ఆపింది.
“వాట్ డూ యూ మీన్ అర్జున్?”
“మనం కలిసి 1 మంత్ కూడా కాలేదు..కానీ నాకు నువ్వంత ఎవరూ నచ్చలేదు. అసలు నీలో ఏం చూసినా నచ్చుతుంది. లేక నాకు నచ్చేవి అన్నీ నీలోనే దొరుకుతున్నాయేమో.. ఐ డోంట్ నో..నేనైతే ఇంత షార్ట్ టైం లో ఎవరితోనూ ఇలా క్లోస్ అవ్వలేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఇపుడు నాక్కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నీ ఇష్టాలు నా ఇష్టాలు అయిపోయాయి. నీ వరల్డ్ నా వరల్డ్ అనిపిస్తుంది.. నీకేం అనిపించట్లేదా..?”

రాశికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇదంతా కొత్తగా ఉంది. అంటే తనకు చాలా మందే చాలా రకాలుగా చెప్పారు ఇలాంటివి. కానీ ఇది కొత్తగా ఉంది. మొదటి నుండి రాశికి అర్జున్ నచ్చాడు. సన కూడా మంచిగా చెప్పడం వలన ఇంకా నచ్చాడు. అర్జున్ ని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏమి కనపడలేదు తనకు. అలాగని ఇంత త్వరగా నిర్ణయం తీసుకోడం కరెక్ట్ కాదనిపించింది. అదే చెబుదాం అని అర్జున్ వైపు తిరిగి చీకటి లో అతని మొహం వైపు చూస్తూ చెప్పబోయే లోపు “ఒక్క నెలలో ఆ ముసలాయన మారి నీకు సారీ చెప్పాడు, ఒక్క నెలలో మనిద్దరం క్లోస్ అయ్యాం.. ఒక్క నెలలో నాకు నీమీద చాలా ప్రేమ వచ్చింది. నీకు ఈ నెలలో ఏమీ అవ్వలేదా..? లేక దాస్తున్నవా? నువ్వు నిజంగా నిజం చెప్పు..నాకు కంసెంట్ నేర్పించావుగా.. నేను నిన్ను ఆ విషయంలో దిస్తుర్బ్ చేయను.. జస్ట్ యెస్ ఆర్ నో అంతే..”

రాశికి అతన్ని వదులుకోవడం ఇష్టం లేదు. అలాగని ఇప్పుడే చెప్పడమూ భయంగా ఉంది. ఊపిరి తీసుకుని అర్జున్ వైపు చూస్తూ..
“చాలా ప్రశ్నలకు ఆన్సర్స్ యెస్ కి నో కి మధ్యలో ఉంటాయి అర్జున్..”
“బట్ డెసిషన్స్ యెస్ ఆర్ నో మధ్యనే ఉంటాయి” తడుముకోకుండా అన్నాడు అర్జున్
అతను అన్నది రాశికి నచ్చలేదు. కానీ అలా అనడం నచ్చింది. చిన్నగా నవ్వి “నీకు చాలా నేర్పాలి.. అందుకే యెస్. నువ్వు చాలా నేర్చుకోవాలి అందుకే నో” అంది
అర్జున్ కి ఇది యెస్ అన్నంత ఆనందమూ.. నో అన్నంత బాధా ఒకేసారి వచ్చాయి.
“తిన్నగా ఒకటి చెప్పొచ్చుగా” అలక ఫేస్ పెట్టాడు.
రాశికి ఇది నచ్చింది. “ఆల్మోస్ట్ యెస్ అనుకో.. కాకపోతే మన టేస్ట్స్ ఒకళ్ళవి ఇంకొకళ్ళకి తెలియాలి ఇంకా..అందుకే మనం ఇంకొంచెం తెలుసుకోవాలి”
“అయితే డేటింగ్ ఆహ్” ఎక్ససిటింగ్ గా అడిగాడు అర్జున్.
“మోర్ దాన్ దట్” నవ్వుతూ అంది. ఆ నవ్వులో ఎన్నెన్నో అర్థాలు వెతుక్కోవచ్చు.
“అయితే టేస్ట్స్ తెలుసుకోవాలి అంటావ్” చిలిపిగా అన్నాడు అర్జున్.
“హ్మ్మ్.. యా”
“కెన్ ఐ టేస్ట్ యువర్ లిప్స్” ఆశగా అడిగాడు
రాశి షాక్ అయ్యింది. వీడు ఇంత ఫాస్ట్ అనుకోలేదు.
“కంసెంట్ అడిగా సినిమాల్లో హీరోల్లాగా కిస్ చేయలేదుగా”
రాశి చిలిపిగా కోపం నటిస్తూ “అంటే కిస్ చేసేద్దాం అనే..”
“మరి ఆల్మోస్ట్ యెస్ అన్నప్పుడు కిస్ అనేది కూడా ఆల్మోస్ట్ యెస్ ఏ గా”
“నో” కొంచెం ఉడికిస్తూ అంది రాసి
“అదేంటి మళ్ళీ” నీరసంగా అన్నాడు అర్జున్
“ఆల్మోస్ట్ యెస్ కి నో. కంప్లీట్ యెస్ కి యెస్” కసిగా చూస్తూ అంది రాశి.
“అంటే..” ఆశ్చర్యంగా అడిగాడు
“యెస్” అంది
నమ్మలేకపోయాడు అర్జున్. రాశి నుండి ఇలాంటి మాట ఊహించలేదు. ఇంత రొమాంటిక్ పర్సన్ ఉందా రాశిలో.. ముద్దుకు యెస్ అని తానే తన నోటితో చెప్తుందా.. తనలో ఇంకా ఏమేమి దాగున్నాయో చూడాలనిపిస్తుంది. ముందు తన పెదాల రుచి చూడాలి.

కార్ లో లైట్ ఆన్ చేసాడు. తనకు అడుగు దూరంలో అందమైన రాశి. ఇప్పుడే యెస్ చెప్పిన తడి పెదాలు మూసి ఉన్నాయి. చిన్నగా నవ్వుతూ ఉన్నాయి. కళ్ళు అతనిని కట్టేసి దగ్గరకు లాగుతున్నాయి. అందుకే ఏమో అడుగు దూరం అంగుళం అయ్యింది. ఒకళ్ళ ఊపిరి ఒకళ్లకు తగులుతుంది. రాశి కళ్ళు మూసుకుంది. అర్జున్ చిన్నగా రాశి నవ్వే పేదలకు తన పెదాలు ఆనించాడు. ఇద్దరిలో ఎవరు తెరిచారో గుర్తులేదు ఐదు నిముషాల తర్వాత ఇద్దరి పెదాలు ఇద్దరి లాలాజలంతో తడిసిపోయాయి. చెంపలు ముక్కు చెవులు కూడా తడి అయ్యాయి.ఆ తడిని పొడుస్తూ కార్ ఏసీ ఇద్దరిని రెచ్చగొడుతుంది. అర్జున్ భుజాలు, వీపు గట్టిదనాన్ని రాశి, రాశి చేతుల, వీపు మెత్తదనల్ని అర్జున్ తడుముతున్నారు. అలా అర్జున్ రాశి మీద కి అలా వెళ్ళగానే.. అర్జున్ మోచేయి తగిలి హారన్ మోగింది. వాళ్ళకది ఇంకాసేపు ఇలానే ఉంటే ఏమేమి అయిపోతాయో అన్నట్టుగా అలారం సౌండ్ లాగా అనిపించింది. అందుకే విడిపోయారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. ఏసీ ఊపిరి పీల్చుకుంది. “వెళదామా” అంది రాశి.
“సరే” అన్నాడు
“ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది?” స్టార్ట్ చేస్తూ అడిగింది
“అలా అడిగితే ఈ సారి అడక్కుండా పెట్టేస్తా”
దారంతా ముసిముసి నవ్వులు.