కొంచెం దూరం నడిచేసరికి ఒక పెద్ద పడక గది సకల సౌకర్యాలతో కనిపించింది మాకు..చూస్తుంటే ఇది ఆ సాధ్విల పడక గదిలా ఉన్నట్లుంది.
సంజయ్ ఈ గదిలోనే మనకు కావలసిన వస్తువు ఉంది, అది ఒక పుస్తకం..ఒక్క ఇంచ్ తప్పోకుండా వెతుకు అంటూ నాకు హుకుం జారీ చేసి తానూ వెతికే పనిలో పడింది…ఒక గంట పైగా సమయం వెతకడంతోనే గడిచిపోయింది కానీ ఆ పుస్తకం జాడ మాత్రం దొరకలేదు..లాస్ట్ కి మంచం కింద భాగంలో ఒక ఇనుప ద్వారం చిన్న సైజ్ లో కనిపించేసరికి ఉమా అని కేక వేసాను..
తను ఆత్రంగా వచ్చి ఆ ఇనుప ద్వారంని చూసి తన ఇత్తడి బిళ్ళ సహాయంతో దాన్ని ఓపెన్ చేసింది.. అప్పుడు కనిపించింది ఆ పుస్తకం వజ్రాలతో చెక్కబడి,నగ్న నర్తకి విగ్రహం అందంగా కనిపిస్తూ..
ఉమా సంతోషంతో ఇదే సంజయ్ మనకు కావలసినది అంటూ నన్ను హత్తుకుంది సంతోషంగా..
ఫర్వాలేదు ఉమా గారు,మీరు అనుకున్నది సాధించారు అదే పదివేలు ఇంతకీ ఏముందో చూడొచ్చా ఆ పుస్తకంలో అన్నా(నిజమైన చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అన్న కుతూహలం తో).
సామాన్యులకు ఈ పుస్తకంలోని విషయాలు కనిపించవు సంజయ్ అందుకే నీ ప్రయత్నం ని విరమించుకో దయ చేసి అంది నన్ను స్మూత్ గా వారిస్తూ..
సరే నండి ఉమా గారు,మీరు ఎలాగూ ఆ వంశానికి చెందిన వారేగా అదేదో మీరే ఓపెన్ చేసి ఏముందో నాకు చెప్పండి అన్నాను..
హమ్మో సంజయ్,ఏంటి నీకు ఇంత ఆసక్తి వచ్చింది ఇందులోని విషయం తెలుసుకోవాలని..కొంపదీసి నువ్వు ఆ మాయావి మనిషివి కాదుగా అంది నన్ను తేడాగా చూస్తూ.
అబ్బే అలాంటిదేమీ లేదు లే ఉమా గారు,ఏదో కుతూహలం అంతే..మీరు అనవసరంగా నన్ను అనుమానించొద్దు దయ చేసి
.
ఓకే ఓకే ఇక్కడ ఓపెన్ చేయడం మంచిది కాదు,దీన్ని మా తాతయ్య దగ్గరే ఓపెన్ చేయడం ఉత్తమం ఇక బయలుదేరదాం పద అంటూ ఆదేశించింది..
సరే అని తిరిగి బయలుదేరుతున్న నాకు ఒక చిన్న ఖడ్గం కనిపించి దాని పైన మోజు పెంచేలా చేసింది..
వెంటనే ఉమా అన్నా.
ఏంటి చెప్పు అంది కళ్ళెగరేస్తూ..
అది కాదు ఆ చిన్న ఖడ్గం భలే ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే దాన్ని తీసుకుంటాను అన్నా నవ్వుతూ.
అయ్యో దానికి పర్మిషన్ ఎందుకు సంజయ్ తీసుకో హ్యాపీగా, ఇంకా కావాలంటే ఇక్కడ ఏమి నచ్చితే అవి తీసుకో అంది నవ్వుతూ.
హమ్మయ్యా థాంక్యూ ఇది చాలులే నాకు అంటూ ఖడ్గం ని తీసుకొని బయలుదేరాము..
ద్వారం దగ్గరకు రాగానే ఆటోమేటిక్ గా నా చేతికి తాళాల గుత్తి ఇచ్చింది ఓపెన్ చేయమని.దాన్ని ఓపెన్ చేసి బయటకి వచ్చాక మళ్లీ క్లోజ్ చేసేసాను..తన బ్యాగ్ లోనుండి ఏదో తీసి మళ్లీ ఆ ఇనుప స్వస్తిక్ సింబల్ స్థానంలో యధావిధిగా మునుపటి బొమ్మ వచ్చేలా చేసి బయలుదేరాము..
కోట బయటికి వచ్చాక తన తాతయ్య కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది స్పీకర్ ఆన్ చేసి..
వాళ్ళ తాత ఏంటీ అతను ఆ తలుపుని తెరిచాడా??ఇంతకీ అతను ఉన్నాడా వెళ్లిపోయాడా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసాడు ఒక విధమైన కంగారు తన గొంతులో వినిపించేలా మాట్లాడుతూ..
ఉన్నాడు తాతయ్యా నాతో పాటే అంది ఉమా..
అమ్మా ఉమా నువ్వు అతడికి ఎలాగోలా నచ్చజెప్పి,మన ఇంటికి తీసుకురావాలి తప్పకుండా అన్నాడు..
అతను మన ఇంటికి ఎందుకు తాతయ్యా??
ఇది మీ తాతయ్య ఆజ్ఞ అనుకో,తప్పకుండా అతడు మన ఇంటికి రావాలి అన్నాడు.
సరే అంటూ కాల్ కట్ చేసి,సంజయ్ నువ్వు మా ఇంటికి రావాలి మా తాతయ్య అదేపనిగా చెప్పాడు అంది..
నేనా ఎందుకు??(మనసులో వెళ్లి వాళ్లని కలిసి ఇంకాస్తా రహస్యాలు తెలుసుకోవాలన్న ఆశ ఉంది)
ఏమో సంజయ్,ప్లీజ్ రావొచ్చు గా అంది బుంగమూతి పెడుతూ.
ఓకే ఓకే వస్తాను,కానీ మా ఇంట్లో ఒక్కసారి చెప్పేసి బయలుదేరదాం అన్నాను..
సరే అంటూ మా ఇంటి వైపు బయలుదేరాము..
తనని కావాలనే ఆ సాధ్విల నివాసం వైపు ఉన్న దారిలో తీసుకొస్తున్నాను,ఉమా ఆ నివాసాన్ని చూసి సంజయ్ ఎవరిది ఈ ఇల్లు అని ఆశ్చర్యం గా అడిగేసరికి ఇందాకా నువ్వు అన్నావ్ గా సాధ్విలు అని,ఈ నివాసం వాళ్లదే అని అంటున్నారు ఇక్కడి వాళ్లంతా అన్నాను ఏమీ తెలియనట్లు..
హో అవునా,ఎప్పటి నుండి ఉంది ఈ ఇల్లు ఇక్కడ?(తన కళ్ళల్లో ఆశ్చర్యం ఎక్కువైంది).
ఈ మధ్యనే రెండు రోజుల ముందు హఠాత్తుగా ఈ భవనం వెలిసింది అన్నాను..
అవునా,మనం అక్కడికి వెళ్ళొచ్చా??
లేదు లేదు మన లాంటి వాళ్ళకి ప్రవేశం జరగదు అందులోకి.
ఏమీకాదు రా అంటూ నా చేయి పట్టుకొని లాక్కొని వెల్తూ ఆ నివాసం ముందున్న స్వస్తిక్ గుర్తుని చూసి ఆశ్చర్యపోతూ తన మొబైల్ ని తీసి కాల్ చేసింది.
తాతయ్యా మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి నేను మన వంశస్థుల నివాసాన్ని కనిపెట్టాను అంటూ అడ్రెస్ చెప్పి కాల్ కట్ చేసింది..
Superb broo roju roju ki katha involve chestunnru keep going best of luck