రొమాంటిక్ చర్చ్నింగ్ 26 124

ఏమి చేయగలవు రా తుశ్చ కర్ణా?నువ్వొక అల్పుడువి నా ముందు..ముందుగా నీ అంతం అదిగో నీ బావ నక్షత్రుడు అంతం చూస్తాను మా తండ్రి కోరిక మేరకు, ఆ తర్వాత ఇదిగో మీ ప్రియ గురువు సుధాముడు వంతు..

నీ శక్తులు చూసి భయపడే పిరికి వెధవలము కాదు రా,రాజనీతి తెలిసిన ఒక వీర క్షత్రియుడను..నా కంఠం లో ప్రాణం ఉండగా నీ పని జరగదు..దమ్ముంటే నీ మాయమంత్రాలు ప్రయోగించకుండా నాతో తలపడు చూద్దాం అప్పుడు తెలుస్తుంది నీ వీరత్వం ఏంటో, ఎవరి అంతం ఏంటో అంటూ ప్రతిసవాల్ విసిరాడు కర్ణుడు..

ఆగు ఆగు కర్ణా,అక్కడికే వస్తాను…నేను నీ కన్నా ఉత్తముడిని,నీకన్నా ఎక్కువ విద్యలు తెలిసిన వాడిని..రాజనీతి ప్రకారం ఎవడు యోగ్యుడో వాడే విజేత అవుతాడు అన్నది నీకూ తెలుసు కదా?మరెందుకు నా విద్యలు ప్రదర్శించొద్దు అంటున్నావ్
?
నీతి మార్గంలో నువ్వు ఆ విద్యలు పొంది ఉంటే మాకూ సంతోషం,నువ్వొక దుర్మార్గుడివి అందుకే రా ఈ ప్రతిఘటన..

ఓహో అదా నీ సందేహం,నీతో మాటలేంటి నాకు?సిద్ధంగా ఉండు మరణించడానికి అంటూ వెళ్లిపోయాడు ఆ జ్యోతిరాదిత్యుడు..

వాడి మాటలు విన్న గురువర్యులు ఆందోళనలో మునిగిపోయాడు..

గురువర్యా,మీరేమీ చింతించొద్దు.మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ వాడిని అంతం చేయడానికే ప్రయత్నిస్తాము…నాదొక మనవి అంటూ కర్ణుడు శాంతింపజేసాడు..

కర్ణా,ఏంటి నీ మనవి చెప్పు..

గురువర్యా, ఆ కర్ణపిశాచిని విద్యలని మాకూ నేర్పించండి అదే మా యొక్క కోరిక..

అది విరుద్ధం కర్ణా,ఈ ఆశ్రమం లో ఒక్కడికి అబ్బిన తర్వాత మరెవరికీ ఆ విద్యలు అబ్బవు..

మరి మీరు ఇంతకుముందు ఎవరికీ ఈ విద్యలు నేర్పించలేదా?

ఈ విద్యలు సంపూర్ణంగా ఎవ్వరికినీ నేర్పించలేదు,ఎందుకంటే ఒక పరిమితి దాటితే వినాశనానికి దారి తీస్తుంది అన్న నెపంతో అలా చేసాను..కానీ ఈ దుష్టుడు మొత్తం ఔపోసన పట్టాడు అదే నా ఆందోళన అంతా..

అవునా,మరి మీరు ఇంతకుముందు ఎవ్వరికి నేర్పించారో వారి వివరాలు తెలపండి,మేము వాళ్ళ దగ్గర ఏవైనా తెలుసుకొని వాడిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాము..

కర్ణా,నీ ఉపాయం బాగుంది…ఇదివరకు తొమ్మిది మందికి ఈ విద్యలు నేర్పించాను.. వారి వివరాలు ఇదిగోండి…ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు వారి దగ్గర మాత్రం ఇవి నేర్చుకోవద్దు.వారిని మీకు అనుకూలంగా మాత్రం మలుచుకోండి..ఇంకనూ ఈ విద్యలు మీ ఇద్దరూ కాకుండా ఇంకొక వ్యక్తి నేర్చుకోవడం ఉత్తమం ఎందుకంటే నా ఆశ్రమం ధర్మం ప్రకారం ఇది జరగాలి…ఈ విద్యల తాలూకు కొద్ది సమాచారం మన సూర్యకీర్తి దగ్గర ఉన్న పుస్తకంలో ఉంది…

అదేంటి గురువర్యా?మేము నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకోవాలి??

అది దైవ నిర్ణయం కర్ణా,దైవత్వం ఉన్న రోజులూ ఏదో ఒకచోట ఇలాంటి దుష్టులని అంతం చేసే ఒక వీరుడు ఉదయిస్తూనే ఉంటాడు..ఆ వీరుడిని వెతికి పట్టుకోవడం మీ కర్తవ్యం..ఇక ఇందులో మినహాయింపు ఏ మాత్రం లేదు..

అలాగే గురువర్యా,మీరు చెప్పిన విధంగానే చేస్తాము…

సంతోషం యువరాజుల్లారా,కనీసం వాడిని ప్రతిఘటించి ఈ విశ్వ వినాశనాన్ని ఆపితే చాలు అదే పదివేలు..

అలాగే గురువర్యా,మేము ఈ కార్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు.

సంతోషం కర్ణా,కానీ వాడి చూపు మీ ఇద్దరి రాజ్యాల పైనే ఉంది…వాడి సంపూర్ణ శక్తులు మీ పైన పనిచేయవు..అందులోనూ వాడు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాడు.. మీరు జాగ్రత్తగా ఉండటం సమంజసం..

చిత్తం గురువర్యా,ఇక మేము మా రాజ్యాలకి బయలుదేరుతాము సెలవిప్పించండి..

విజయోస్తు,నేనూ తులసితో పాటు మా సూర్యకీర్తి దగ్గరికి వెళ్తాము..మా ఇద్దరినీ అక్కడే దింపి వెళ్ళండి యువరాజుల్లారా..

అలాగే గురువర్యా,పయనం కొనసాగిద్దాం వేగిరంగా..

సుధాముడు ఆశ్రమంలోని అందరు విద్యార్థులు కి తమ స్వస్థలాలు కి వెళ్ళమని చెప్పి బయలుదేరారు..

యోధ స్థావరంకి చేరుకున్న తర్వాత కాసేపటికి భేతాళుడు వచ్చి,రాజగురువులు సుధాముడు కి సుస్వాగతం అంటూ ఎదురొచ్చాడు..

భేతాళా,నువ్వు ఇంకనూ జీవించి ఉన్నావా?సుధాముడు కళ్ళల్లో ఒక ఆశ్చర్యం..

అవును గురువర్యా, దేవుడి దయ మెండుగా ఉండటం వల్ల బయటపడ్డాను..

నక్షత్రా,మీ రాజ్యపు సంరక్షకుడు భేతాళుడు గురించి తెలుసా నీకు??

లేదు గురువర్యా, మీరే చెప్పాలి ఆ యోధుడి కథ..

ఏమీలేదు నక్షత్రా,గుహుడు అని ఒక రాక్షసుడు గురించి చెప్పాను కదా మీకు, అతడితో తలపడటానికి వెళ్లిన భేతాళుడు ఆ రాక్షసుడి చేతిలో మరణించాడు అన్న వార్త మమ్మల్ని చేరింది,కానీ అదృష్టవశాత్తూ భేతాళుడు బ్రతికి ఉండటం చాలా సంతోషం..భేతాళా ఇంతకీ ఆ గుహుడు గురించి చెప్పవా?

గురువర్యా, ఆ గుహుడు నా చేతిలో మరణించాడు అతి భీకర యుద్ధం తర్వాత..తిరిగొచ్చిన నాకు మన మహారాజు రాజ్యవర్ధనుడు నుండి ఒక వార్త వచ్చింది కొద్ధి రోజులు అజ్ఞాతంలో ఉండమని అందుకే ఇలా ఉన్నాను అని ముగిస్తూ ఇంకొక ముఖ్య విషయం ఒకటి ఉంది గురువర్యా అని ఆపాడు..

ఏంటి భేతాళా??

మన శత్రురాజ్యం “అజీవిక” రాజు యొక్క పుత్రుడు “జ్యోతిరాదిత్యుడు” ఆ గుహుడు యొక్క శిష్యుడు అన్న విషయం నాకు ఆ యుద్ధంలో తెలిసింది..

సుధాముడు ఆశ్చర్యపోతూ,ఏంటి భేతాళా నువ్వన్నది నిజమేనా?

అక్షరాలా నిజం గురువర్యా,ఆ యువరాజు గుహుడు దగ్గర విద్యాభ్యాసం చేసినట్లు నేను నా కళ్లారా చూసాను..

నేనకున్నది నిజం అయింది భేతాళా,జ్యోతిరాదిత్యుడు కి ఇంత కపట బుద్ధి ఎలా వచ్చింది అని మదనపడ్డాను..ఇప్పుడు అవగతం అయ్యింది ఇదంతా గుహుడి మాయ అని..ఆ గుహుడు అంతం అయినా వాడి ఉద్దేశ్యంని జ్యోతిరాదిత్యుడు కి చెప్పి అంతం అయ్యాడు..

ఏంటి గురువర్యా మీరన్నది??వాడి దుష్ట ఆలోచన అయిన విశ్వ వినాశనం తాలూకు భావనలు జ్యోతిరాదిత్యుడు కి వచ్చాయా?

అవును భేతాళా,నువ్వు విన్నది సత్యం..మన ముందు ఒక మహా ఉపద్రవం పొంచి ఉన్నది ఆ జ్యోతిరాదిత్యుడు రూపంలో..ఈ విశ్వ కల్యాణం కి ఎల్లప్పుడూ సంరక్షణకర్తలు గా ఉన్న మీ వంశానికి మళ్లీ ఒక సవాల్ ముందు ఉంది..ఈ ఉపద్రవం ని ఎలా జయిస్తారో అర్థం కాకున్నది..

మీరేమీ దిగులు పడకండి గురువర్యా,మా ప్రయత్న లోపం ఎప్పుడూ ఉండదు..ఇలాంటివి ముందే ఊహించి తగిన జాగ్రత్తలు ముందుగానే చేసాను అంటూ “అహల్యా” అని పిలిచాడు…

(అహల్య మన సివంగి,ఆ సివంగి ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేము,నూనూగు ప్రాయంలో సాక్షాత్తూ దేవతలా ఉంది నయనానందం కలిగిస్తూ)..

గురువర్యులకి నమస్కారం అంటూ సుధాముడు యొక్క పాదాల పైన పడి ఆశీర్వాదాలు తీసుకుంది అహల్య..

లేవమ్మా అహల్యా,ఇంతకీ నీ విద్యలు పూర్తి అయ్యాయా?అంటూ ప్రేమగా అహల్యాని పైకి లేపాడు సుధాముడు..

గురువర్యా సకల విద్యలూ మా పిత నాకు నేర్పించారు,మీ ముందు నా విద్యలని చూపించే అవకాశం ఇవ్వండి అంటూ తల వంచి నమస్కరించింది..