సింధు శ్రావణి లు పడుకున్నాక నేను పడుకొని నిద్రపోయాను .ఎవరో నన్ను చెయ్యి పట్టుకొని లాగుతున్నట్టు అనిపించింది. జుట్టు గడ్డం పెంచుకుని పిచ్చి వాడిలా కనిపిస్తున్న ఒక వ్యక్తి నా చెయ్యి పట్టుకొని ఊరి ద్వారం దగ్గరకు తీసుకెళ్లి రోడ్డు కు ఎడమ వైపుగా కొంచం దూరం నడిచి కొంచం మట్టిని తవ్వగానే రెండు నాగ ప్రతిమలు బయట పడ్డాయి . నా వైపు కు చూసి 32 పళ్ళు కనిపించేలా నవ్వినాడు ఆ పిచ్చి వ్యక్తి కానీ ఆ మొహం లో తేజస్సు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది . వెంటనే నా కాలి కి ఎదో మెత్తగా తగిలింది తల దింపి ఏమిటా అని చేస్తే పాము పడగ ఎత్తి కాటేయ్యబోతుంటే గట్టిగా అరిచాను . సింధు శ్రావణి లేచి ఏమైంది బావ ఏమైనా పీడకల ఏమైనా వచ్చిందా ఒసేయ్ సింధు బావ కి కొంచం మంచినీళ్లు తెచ్చి ఇవ్వవే అని చెప్పి శ్రావణి నన్ను దగ్గరకు తీసుకోని ఏమైంది బావ అంటూ అనునయంగా అడుగుతుంటే ఏమి లేదని చెప్పాను . ఇవిగో బావ కొంచం తాగు కంగారు తగ్గుతుంది అంటూ మంచినీళ్లు తాగించి ఇక పడుకో బావ అంటూ నన్ను పడుకోపెట్టి ఇద్దరు పడుకున్నారు . ఉదయాన్నే నిద్ర లేచి బయటకు వెళ్తుంటే సునీత వచ్చి ఏమైంది కిరణ్ రాత్రి అలా అరిచావ్ అంట అంది సునీత . అదేం లేదు సుని ఎదో పిచ్చి కల సరే నేను బయటకువెళ్లి వస్తా అంటూ పొలం కి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్న ఎందుకు ఈ కల వచ్చింది నాకు ఏమోలే దీని గురించి ఎందుకు పనికిమాలిన ఆలోచనలు ఆకలిగా ఉంది ఇంటికి వెళ్లి ఏమైనా తిని పనులు చూసుకుంటే సరిపోతుంది అసలే మనకు ఎక్కువ టైం లేదు ఈరోజు పూజ అని ఇంటి వైపు నడుస్తుంటే ఎలాగూ ప్రవేశ ద్వారం దగ్గరే కదా ఒకసారివెళ్లి చూసి వద్దాం అని వెళ్ళాను . అక్కడ ఒక కొండ రాయి లాంటి బండ మీద ఒకతను కూర్చొని పశువులను అదిలిస్తూ ఉన్నాడు . నేను వెళ్తుంటే రాత్రి వచ్చిన కల నిజమా అని తెలుసుకోవడానికి వెళ్తున్నావా చిరంజీవి అన్న కంఠం వినపడి ఆయన వైపు చూసాను . నాకు తెలుసు చిరంజీవి కానీ నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్లి చూడడం మంచిది కాదు నా మాట విని వెళ్లిపో అన్నాడు కొంచం మృదువుగానే . తల ఊపి అక్కడ నుండి ఇంటికి చేరాను .పెట్టిన 4 ఇడ్లి లు తిని సునీత పనులు చెప్తుంటే అన్ని చేస్తూ గడిపేసాను . సాయంత్రం పూజ కి అందరం స్నానం చేసి వెళ్ళాము . సునీత భాగ్యలక్ష్మి ఇద్దరు పూజ లో కూర్చుంటే ఇది దంపతులు చేయవలసిన పూజ అన్నాడు పూజారి . మా భర్త లు లేరు అంటే మీ ఇంట్లో ఉండే మగ వాళ్ళు ఎవరైనా పర్లేదు అన్నాడు పూజారి . అప్పుడు భాగ్యలక్ష్మి నువ్వు కిరణ్ కూర్చొని పూజ జరిపించండి సునీత అంది . బాగ్యా రా కిరణ్ అంటుంటే వద్దు అని తల అడ్డంగా ఊపాను . సునీత లేచి నా దగ్గరకువచ్చి మన పెళ్లి అయ్యాక అందరి సమక్షంలో పూజ చేస్తున్నాం నా మాట కాదనకుండా వచ్చి కూర్చో అంది . సరే అని వస్తుంటే బాబు ఈ బట్టలతో కాదు పట్టు పంచ చొక్కా అన్నాడు . అవి లేవు అన్నాను . ఉన్నాయి ఉండు తెప్పిస్తాను అంటూ ప్రియ ని పిలిచి తన గదిలో ఎక్కడ ఉన్నాయో తెమ్మని పంపింది . నీ కోసమే కొన్నాను కిరణ్ కానీ ఇక్కడ పనుల వల్ల నీకు అప్పుడు ఇవ్వడం కుదరలేదు అయితే ఏమి ఇప్పుడు పనికొస్తున్నాయి అంది సునీత . ప్రియ బట్టల కవర్ తో వచ్చి నా చేతికి ఇచ్చింది . ఆ పక్క గదిలో కి వెళ్లి మార్చుకో కో బాబు అంటూ చూపించాడు పూజారి . పట్టు చొక్క పంచ లో వచ్చాను . చంద్రునిలా వెలిగిపోతున్నావ్ అచ్చు పెళ్లి కొడుకు లా అంటూ సునీత పక్కన కూర్చోపెట్టాడు . పక్కన సిద్దార్ద్ ఉమ లు కూర్చొని ఉన్నారు . పంతులు పూజ చేస్తుంటే రాఘవరావు లోపలికి వస్తుంటే అందరూ ఆయనకి నమస్కారం చేస్తూ లోపలికి దారి ఇచ్చారు . ఏంది మావ ఇంత లెట్ గాన వచ్చేది అని సిద్దార్ద్ అంటుంటే కొంచెం పని ఉండి లెట్ అయ్యింది అంటూ పక్కనే కూర్చున్నాడు . తనకి వచ్చిన అన్ని మంత్రాలు అన్ని చదివేస్తున్నడేమో అనిపించింది . కొంతసేపటికి మంత్రాలు అపి బాబు మీరు ఇద్దరు ఈ పాలతో దేవి కి అభిషేకం చేయండి అని ఒక గంగళంతో పాలు ఇచ్చారు చాలా పెద్దదిగా ఉంది ఏది ఐతే అది అవుతుందిఅని దేవి కి ఒక దణ్ణం పెట్టి గంగళంని లేపాను చాలా తేలికగా లేచింది దేవి మీద పాలు పోస్తుంటే సునీత కూడా పట్టుకుంది . అభిషేకం పూర్తి అవ్వగానే సిద్దార్ద్ ఉమ దంపతులని అమ్మ వారికి బట్టలు అలంకరిచమని చెప్పాడు .
Ani parts thvaraga upload chey broo