తనివి తీరిందా? – Part 6 321

“రేయ్…..గిరీ, ఏమైపోయావ్ రా? మొన్నటినుంచి నీ మొబైల్ ట్రై చేస్తున్నా, ఒకటే స్విచ్ ఆఫ్ మెస్సేజ్ వస్తోంది” దాదాపు గట్టిగా అరిచారు మధు గారు.

“బాగానే ఉన్నారా” పొడిగా సమాధానమిచ్చారు మా ఆయన.

“అదేంట్రా అలా ఉన్నవూ? ఆ గడ్డమేమిటీ అంత డల్ గా….అసలేమి జరిగింది?” మా ఆయన కళ్లల్లోకి సీరియస్ గా చూస్తూ అడిగారు.

“అదంతా పెద్ద కధలేరా. ఇప్పుడవన్నీ ఎందుకు. ఇంతకీ ఎప్పుడొచ్చావ్ ఢిల్లీ నుంచి?” నెమ్మదిగా అన్నారు ఆయన

“మేము హైదరాబాద్ వచ్చేశామురా, ప్రస్తుతానికి మా కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉన్నాము. నెమ్మదిగా ఇల్లు చూసుకుని సెటిల్ అవ్వాలి. అదే విషయం చెబుదామని మూడు రోజులనుంచి నీ మొబైల్ కి ట్రై చేస్తున్నా”

అంటూ వాళ్ళుంటున్న గెస్ట్ హౌస్ వైపు దారి తీశారు, మా ఆయన వద్దొంటున్నా వినకుండా మమ్మల్ని బలవమతంగా లాక్కెళ్ళి ఆయన కార్ లో కూర్చోబెట్టారు. A/C టయోటా ఇన్నొవా కార్ లో వెనక నేను కూర్చుంటే మా వారు ముందు ఆయన పక్కన కూర్చున్నారు.

“ఏరా పెళ్ళికి పిలవలేదని కోపం వచ్చిందా?” అన్నరు మధు.