తనివి తీరిందా? – Part 7 488

“అబ్బే అదేం లేదురా, ఇంతకీ ఎలా ఉంది మేరీడ్ లైఫ్” అన్నారు మా వారు.

“ఊం బాగానే ఉంది. కేరళా అమ్మాయి అయినా పూర్తిగా హైదరాబాద్ లో పెరిగింది. నేనంటే బాగా ఇష్టం, నేను వాళ్ళ కంపెనీలో పనిచేసేటప్పుడు మాకు CEO గా ఉండేది. మా అత్తగారు లేరు. నేను ఢిల్లీ బ్రాంచ్ లో చేరగానే తనతో పరిచయం ఏర్పడింది.” ఇద్దరం ఆశక్తిగా వింటున్నాం.

“పరిచయం ప్రేమగా మారి మా పెళ్ళికి దారితీసింది. మా పెళ్ళైన రెండురోజులకి మామగారు అదే మా చైర్మెన్ చనిపోయారు. ఇక ఈ బిజినెస్ అంతా నా మీద వదిలేసి తను హౌస్ వైఫ్ గా మారిపోయింది. అదిరా టూకీగా మా కధ” వింటున్న మా ఆయన కళ్లల్లో ఏదో ఆశ.

మధు రూపంలో ఆయనకి ఒక ఆధారం దొరికినట్తైంది, మధు గారు తల్చుకుంటే మా ఆయనకి జాబ్ రావడం పెద్ద విషయమేమీ కాదు. కార్ వాళ్ళ గెస్ట్ హౌస్ కి చేరుకోగానే మధు గారు ఇద్దరినీ లొపలికి తీసుకెళ్ళారు. విశాలమైన హాల్ లొ మా ఇద్దరినీ కూర్చోపెట్టి ఆయన వైఫ్ ని పిలిచారు.

“వసూ..చూడు ఎవరొచ్చారో”

లోపలినుంచి సుమారు 30 ఏళ్ల ఒక అందమైన ఆవిడ నవ్వుతూ బైటికొచ్చింది. ఆవిడని చూడగానే తెలిసిపోతుంది కేరళ కుట్టి అని. ఆల్చిప్పల్లాంటి సొగసైన కళ్ళు, నవ్వుతూ ఉండే పెదాలు ఎర్రగా దొండపళ్ళలా ఉన్నాయి.