నా కలల రాణి 182

నేను వదిన అని అనూష చెప్పింది అన్నది. హో మరి తెల్సి కూడా నా వంక అలా ఎందుకు చేస్తున్నావ్ అన్నది. నేను ఇదే ఛాన్స్ అనుకోని, ఇప్పటివరకు నీ లాంటి అందం నేను చూడలేదు అన్నాను. అహ అంత బాగుంటానా అన్నది, అప్పుడు అనుకున్నా ఓహో ఇది పొగిడితే సంతోషించే రకం అనుకోని. ఇక కాదా మరి, ఆ రోజు బస్సు లో అందరి కన్ను మీ మీదనే అన్నాను. అవునా ఎం బాగుంటయి అన్నది. నేను మీ మొఖం గుండ్రగా తెల్లటి రంగులో, నేరేడుపండ్ల లాంటి కళ్ళు, సూటైన ముక్కు, అందంగా ఉండే చెవులు, మంచి రంగులో మిరపకాయ ల్లాంటి పెదాలు అన్నాను. ఓయ్ ఇక చాలు ఇంతలా అబ్జెర్వ్ చేసావ్ అనుకోలేదు. నిన్నెందుకు పిలిచా అంటే ఆ స్వాతి మేడం నే మీద కంప్లైంట్ చేయబోతే నిన్న ఆపాను. ఆవిడకి ఒక సారీ చెప్పి ఇష్యూ సెటిల్ చేస్కో. ఇక పైన రేణుకతో తిరగకు. అది లాస్ట్ ఇయర్ మొత్తం ఇలాగె పిఛ్చి వేషాలు వేసి డిటైన్ అయింది. దానికి మగ పిఛ్చి ఎక్కువ. సో జాగ్రత్త, ఈవెనింగ్ బస్టాండ్ లో వెయిట్ చేయి కలిసి వెళ్దాం అంది. సరే అని చెప్పి వచ్చేసా.

ఆ రోజు సాయంత్రం ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను. తను వచ్చింది, వచ్చి రాగానే ఇక్కడ దగ్గర్లో నే మీ అన్నయ్య ఉన్నాడు, ఈ రోజు మన ఊరు బైక్ పైనే వెళ్లొచ్చు అంది. నేను సరే అన్నాను. ఇద్దరం కలిసి లాలాచెర్వు స్టాప్ దగ్గర బస్సు దిగాము. తను వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది. అతను బైక్ పై వచ్చాడు. నన్ను అదోలా చూస్తూ వీడేవడు అన్నాడు, ఆమె మా చిన్న మామయ్య కొడుకు మన పక్కఊరే, మన పెళ్ళికి అరటి గెలలు సప్లై చేసారు గా ఆ మామయ్య అంది, ఓహ్ వాడా సర్లే బండి ఎక్కు అన్నాడు, సునీత మాత్రం వీడు కూడా మనతో పాటే వస్తాడు ప్లీజ్ అంటోంది. వాడు నీకేమన్న పిచ్చా వాడేవడినో మనతో రమ్మంటున్నావ్ అని కసురుతున్నాడు. అప్పటిదాకా ఓపిగ్గా ఉన్న నేను, ఇక కోపం తన్నుకొచ్చి ఒదిన నేను వెళ్లిపోతాను, మీరు వెళ్ళండి అని వచేస్తున్నాను. తను వెంటనే వాళ్ళ ఆయనతో వాడు కూడా మనతో వస్తున్నాడు, వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసే ఫామిలీ అన్నది, దానికి వాడు సర్లే తగలడమను అంటూ నన్ను మరింత రెచ్చగొట్టాడు. సునీత మద్యలో సైడ్ కి కూర్చుంది. నేను వెనకాల రెండువైపులా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను. తను ఏదేదో చెప్తుంది, మా ఇద్దరితోను మాట్లాడుతుంది.

Updated: February 4, 2023 — 1:18 pm