ఆ వాట్స్అప్ చాట్ చదువడం మొదలెట్టిన
ఆనంద్ కి వొల్లంత చమటలు కారుతున్నాయి కాళ్లు వణుకుతున్నాయి
చేతులు ఫోన్ బరువు కూడా మోయలేక బండను మోస్తున్న ఫీలింగ్ కలిగింది ఆనంద్ కు
అలాగే వెనక్కి జాగల పడి నేల చేరాడు మెదడంతా మొద్దుబారిపోయింది తను చదువుతుంది నిజమో కాదో అర్థం కావడం లేదు
కానీ కంటి ముందు ప్రత్యక్ష సాక్ష్యాలు అవి అబద్ధం కాదని ఖచ్చితంగా నిరూపించగలుగుతున్నాయి
ఈ షాక్ నుండి తెలుసుకోవడానికి ఆనంద్ కు
పది హేను నిమిషాలు పట్టింది
తేరుకున్న అని అనుకున్నాడు కానీ కాళ్లు వణకడం చేతులు లాగడం గుండె బెదరడం ఇంకా తగ్గలేదు
అదురుతున్న గుండె వేగంగా పరిగెత్తడం అతనికి తెలుస్తుంది
నిస్సహాయంగా అక్కడి చాట్ మెసేజ్ ఒక్కోటి చదువుతూ గుండెలు పగిలేలా లోలోపలే బాధపడుతున్నారు
నిన్న రాత్రి చాట్ చదువుతూ సరిగ్గా పదకొండు
35 నిమిషాలకు మొదలైంది వారి వాట్సాప్ కాల్ సంభాషణలు
హాయ్ జాను
హాయ్
పడుకున్నావా
ఇంకా లేదు
ఏం ఏమైంది
ఏం లేదు ఊరికే నిద్ర రావడం లేదు
సరే కానీ ఏం చేస్తున్నాం
