నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 3 50

ప్రభు మీరా లా మధ్య ఏర్పడిన బంధం ఇంకా వారి శరీరాలు ఆనందంతో ఏకమైనప్పుడు వారి మధ్య ఏర్పడిన అపారమైన అనుభూతి అంత తొందరగా సమసిపోలేదు అని శరత్ అర్థం చేసుకుని రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ గడిచిన కూడా మీరా మనసులో ఆ భావాలు ఇంకా ఉన్నాయని తెలుసుకుని శరత్ మనసుకు దుఃఖం కలిగింది
ఎప్పటికప్పుడు మీరా ప్రతిచర్య ప్రభువు యొక్క ఆలోచనలతో కలవరపెడుతున్నాయి ఉహించగలిగాడు

మీరా ప్రియుడి ఆలోచనలు మనసులో వచ్చినప్పుడు దానితో పాటు అపరాధ భావనలు కూడా వస్తాయి

మీరా మనసులో అపరాధ భావనను తొలగించుకోవడానికి ఆ సమయంలో శరత్ ను ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకోవడం కొసం తాపత్రయ పడడం మొదలుపెడుతుంది

కానీ శరత్ కి అది ఒక కారణమని అనిపించి ఆనందాన్ని ఇవ్వలేదు
మీరా ప్రియుడి ఆలోచనలు ఇంకా బలంగా ఉన్నాయని ఇది స్పష్టమైన సూచన అని శరత్ భావిస్తాడు

ప్రభుని మరిచిపోవడానికి మీరా చాలా సాహసోపేతమైన ప్రయత్నాలు చేస్తోందని శరత్ గ్రహించగలుగుతున్నాడు

కానీ ఇప్పటివరకు మీరా అది సాదించాలేక పోయింది

ఆ మనసులో ఆలోచన కారణంగా మీరా తన భర్తకు పిల్లలకు నిర్లక్ష్యం చేస్తోందని కాదు కానీ
తనకు సాధ్యమయ్యే అన్ని పనులు అన్ని విధాలుగా చాలా జాగ్రత్తగా చూసుకోవడం కొనసాగిస్తుంది

కానీ ఇలాంటి పనులే శరత్ మనసులో నూన్యత భావాన్ని కలిగిస్తున్నాయి
శరత్ తనవంతుగా మీరాను ఒంటరితనంతో బాధపడనివ్వడం లేదు
ఇంకామీరా చేసే పనుల మీద కోప్పడ్డం కానీ వంకలు పెట్టడం గాని చేయడంలేదు

మీరా ఇంకా ఎదో దాని కోసం ఆరాట పడుతుంది
ప్రభు ఆమెకిచ్చిన ఆనందాన్ని ఆమెకు ఇవ్వలేకపోతున్నాను అని ఆలోచించడం ప్రారంభించాడు శరత్

ఇది నెమ్మదిగా శరత్ న్యూనతా భావాన్ని కలిగించడం మొదలుపెట్టింది

మీరా తన ఆలోచనలతో మునిగిపోయింది
దర్శనం తరువాత పిల్లలు మామూలుగా గుడి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నారు
మీరా పిల్లలపై సగం నిఘా కళ్లతో చూస్తూ ఉన్నా
ఆమె కనుసన్నల్లో వారు సరిగ్గా ఉన్నప్పటికీ ఆమె మనసు మాత్రం వేరే చోట ఉంది