నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 3 50

ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది బాబాయ్ గారు అని ప్రేమగా అడిగాడు శరత్ ప్రభు తండ్రిని

ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను అంటూ బలహీనమైన స్వరంతో బదులిచ్చాడు ప్రభు తండ్రి
ప్రభు తండ్రి వారి వైపు చూసి ఒక నిస్తేజమైన నవ్వు నవ్వాడు

ప్రభు తండ్రి అర్థవంతంగా తన భార్యవైపు చూశాడు వైపు చూసాడు

ఆమె వెంటనే మీరా బుజ్జి పిల్లలు అందరూ రండి హాల్ లోకి వెళ్లి కాఫీ తాగుదామని అందరిని తీసుకెళ్ళింది

ప్రభు తండ్రి శరత్ ను తన దగ్గరగా పక్కనే కూర్చోమని సైగ చేశాడు శరత్ చేతులు పట్టుకోడానికి చేతులు ఎత్తాడు శరత్ చేతులు ముందుకు చాచి ప్రభు తండ్రి చేతులు పట్టుకున్నాడు

బాబు శరత్ నేను నిన్ను చూసినప్పుడల్లా నేను నేరపు తాలూకు శిక్షణ అనుభవిస్తున్నాను అని అనిపిస్తుంది
నా కుటుంబం నీకు చాలా అన్యాయం చేసింది అని మెల్లగా బాధపడుతూ అన్నాడు

అది గతం బాబాయ్ గారు ఇప్పుడు ఎందుకు వాటి గురించి

లేదు బాబు నువ్వు అలా అనకూడదు ఎందుకంటే నువ్వు మంచి వాడివి ఎదుటి వారిని గౌరవించే వ్యక్తివి కాబట్టి అలా అంటున్నాం నీ భార్యను కూడా నిందించావచ్చు కానీ మొత్తం తప్పు నా కొడుకు మీదనే ఉంది

పర్వాలేదు బాబాయ్ గారు కనీసం ఈ పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని చూడటానికి ప్రభువును అనుమతించండి

లేదు…. అని ప్రభు తండ్రి అరిచి బిగ్గరగా దగ్గటం మొదలుపెట్టాడు

శరత్ అతను తాగటానికి కొంచం మంచినీళ్లు ఇచ్చాడు దగ్గు విన్నా ప్రభు తల్లి లోపలికి రాబోయింది ప్రభు తండ్రి చేతితో సైగ చేస్తూ బయటికి వెళ్లామని చెప్పాడు

నాకు కొడుకు లేడు వాడి ముఖాన్ని మళ్ళీ నేను చూడలని అనుకొవడం లేదు వాడు ఎలాంటి అవమానాన్ని తెచ్చాడు కుటుంబానికి