పెళ్ళైన అమ్మాయి – Part 5 563

అలా ఆలోచనలలో మునిగిపోయిన పూజ.. “హే..have it ..” అన్న మహీ మాటతో ఈ లోకంలోకి వచ్చింది..రెండు చేతుల్లోనూ చెరో గ్లాస్ లో..ఆరెంజ్ జ్యూస్ తో నిలబడి వున్నాడు.. ఆమె కి ఒక గ్లాస్ అందించి మరలా సోఫా లో కూర్చుంటూ.. “పూజా.. నువ్వు తెలుగు అమ్మాయివే కదా? కాని హిందీ చాలా ఫ్లూఎంట్ గా మాట్లాడుతున్నావ్..ఎలా? I am surprised ” అన్నాడు.. ఆమె చిరునవ్వు నవ్వి.. “మేము తెలుగు వాళ్ళమే అయినా నేను పెరిగింది అంతా నార్త్ లోనే.. నాకు తెలుగు కంటే హిందినే బాగా వచ్చు..తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.. అక్కడే వుంటే నేను తెలుగు మర్చిపోతానేమో అని మా అమ్మమ్మా వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు…” అంది. వెంటనే అప్రయత్నంగా “nice blend ” అన్నాడు..అని మరలా.. “i mean a nice telugu girl speaking nice hindi ” అన్నాడు..ఇద్దరూ నవ్వుకున్నారు.. అలా మాట్లాడుకుంటూ హిందీ సినిమాల గురించి..మ్యూజిక్ ఆల్బమ్స్ గురించి..బుక్స్..ఆధర్స్…. పూజ ఇంటర్ లో సబ్జెక్ట్స్…. మహీ ఇంజినీరింగ్ బ్రాంచ్…ఇవి.. అవి..అన్ని హిందీ లోనే మాట్లాడుకున్నారు..ఎంతలా లీనమైపోయారంటే చేతికి అందేంత దూరంలో ఉన్న పూజ లేత పరువాల గురించి మహీ..మహీ కవ్వించే మగతనపు అందం గురించి పూజ..అస్సలు ఆలోచించలేదు.. అలా ఎంత టైం గడిచిందో కూడా చూడలేదు..ఒక 40..45 నిమిషాలు గడిచిన తరువాత..పూజకి పవిత్ర ఇంకా బయటకి రాలేదన్న విషయం గుర్తొచ్చింది.. అదే విషయం మహీ కి చెబితే “ఒహ్హ్..yeh నేను కూడా మర్చిపోయాను..” అంటూ లేచి బెడ్ రూమ్ డోర్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టాడు..పూజ కూడా కంగారుగా వెళ్లి మహీ పక్కనే నిలబడింది.. అలా ఒకరికొకరు దగ్గరగా నిలబడడంతో.. మహీ బాడి స్ప్రే నుండి వచ్చే ఒక రకమైన మగ మదపు మత్తు వాసన పూజకి ఒక్క క్షణం కలవరం కలిగించింది..మహీ కూడా అదే పరిస్తితి..పూజ శరీరం..జుట్టు లో నుండి వచ్చే సువాసన కొన్ని క్షణాలు మహీని వివసుడిని చేసింది..మరుక్షణం అనుకోకుండానే..ఇద్దరి కళ్ళు లిప్తకాలం పాటు కలుసుకున్నాయి.. ఆ నిమిషంలో పూజ కళ్ళలోని అమాయకత్వం..మహీ కి ముచ్చటగా అనిపించింది..వెనువెంటనే పూజ కళ్ళు కిందకు వాలిపోయాయి..తడిగా మెరుస్తున్న ఆమె అధరాలు మరింత ఎరుపెక్కినట్టుగా కనిపిస్తున్నాయి…. ఈలోగా పవిత్ర తలుపు తీసి.. “సారీ మహీ..ఒక్కక్షణం అలసటగా అనిపించి అల పడుకున్నాను..కాని నిద్ర పట్టేసింది.. రాత్రి అంతా ట్రావెల్ చేసి వచ్ఛాను కదా..” అంది సంజాయిషీ గా.. “ఎం పరవాలేదు..నీ ఫ్రెండ్ నేను చాల విషయాలు మాట్లాడుకున్నాం..ఈ లోపున.. she is fun to talk to ” అంటూ సోఫా వైపుకి నడిచాడు.. వెంటనే పవిత్ర అక్కడ ఉన్న ఖాళి గ్లాసెస్ చూసి ..పూజ ని చూసి కను బొమ్మలు ఎగరేసి నర్మగర్భంగా చిన్న నవ్వు నవ్వింది.. “సో..మొత్తానికి హిందీ వాళ్ళు ఒక్కటి అయ్యారన్న మాట..” అంది..ఆ మాటకి ముగ్గురూ నవ్వుకున్నారు..2,3 నిమిషాలు ఉన్న తరువాత..”పవీ..ఇక వెళ్దామా?” అన్న పూజ మాటతో..ఇద్దరు మహీ నుండి సెలవు తీసుకుని బయటకు వచ్చి కారిడార్ లో లిఫ్ట్ దగ్గరకు నడవసాగారు.. వాళ్లకి బాయ్ చెబుదామని డోర్ దగ్గర నిలబడ్డ మహీ కళ్ళు వెంటనే వెళ్తున్న పూజ నే చూడసాగాయి..సరైన పొడవుతో..స్లెండర్ బాడీ తో ఉన్న పూజ అందాన్ని కొంచం ఎత్తుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ..నడుస్తుంటే వయ్యారంగా ఊగుతున్న ఆమె పిరుదులు మరింతగా పెంచుతున్నాయి..నల్లటి ఆమె జడ నాగుపాములా ఊగుతూ ఆమె పిరుదులను తాకుతుంటే చూసి “fabulous ” అనుకున్నాడు.. వెంటనే ఏదో స్పురణకు వచ్చినవాడిలా “పూజ..1 మినిట్ ” అంటూ వాళ్ళ వైపు వేగంగా వెళ్ళాడు.. ఆగి ప్రస్నార్ధకంగా చోస్తున్న వాళ్ళతో ” మీరు ఎక్కడికి వెళ్తున్నారు? 2 మినిట్స్ ఆగండి..నేను మిమ్మల్ని కార్ లో డ్రాప్ చేస్తాను” అన్నాడు.. పవిత్ర సంతోషంతో ఏదో అనేంత లోపునే పూజ ” అయ్యో..నో ప్రాబ్లం మహీ.. మేము వెళ్తాము..దగ్గేరే కదా” అనేసింది… అప్పుడు మహీ కళ్ళలో కనపడిన నిరుత్సాహం పవిత్ర దృష్టిని దాటిపోలేదు.. ఇక చేసేదేమీ లేక “సరే..బాయ్ గర్ల్స్..” అని వాళ్ళు లిఫ్ట్ లోనికి వెళ్ళేవరకు అలానే నిలబడ్డాడు.. లోనికి వెళ్ళినట్టే వెళ్ళిన పవిత్ర “ఒక్క నిమిషం ఆగవే..” అని చెప్పి మరలా మహీ దగ్గరకు వచ్చింది.. కొంచం నెమ్మదిగా “మహీ..నాదొక రిక్వెస్ట్…మేము ఇక్కడికి వచ్చినట్టు కిరణ్ కి చెప్పొద్దూ… ప్లీజ్..తను లేనప్పుడు నేను ఇలా రావడం తనకు ఇష్టం ఉండకపోవచ్చు..ప్లీజ్..” అంది.. “వాడికి నా మీద అంత అనుమానమా అని అడగబోయి తమాయించుకుని..”sure ..నో ప్రాబ్లం..నువ్వేం వర్రీ కాకు..” అన్నాడు.. థాంక్స్ మహీ అని చెప్పి మళ్లీ పరుగు లాంటి నడకతో లిఫ్ట్ లో దూరింది.

వాళ్ళు వెళ్ళాక లోనికి వచ్చిన మహీ కి టీపాయి పై పడి ఉన్న “A Walk To remember ” బుక్ కనిపించి అతనిలో ఏదో అపరాధ భావన కలిగింది.. “పాపం..పూజ ఎంత ఆశగా అడిగింది..ఇస్తే ఏమయ్యేది?” అనుకున్నాడు.. పూజ అందమైన కళ్ళు..స్వచ్చమైన నవ్వు కాళ్ళ ముందు కనిపించాయి..వెంటనే బుక్ తీసుకుని కిందకు వెళ్లి ఆమె చేతిలో పెట్టి సారీ చెప్పాలి అన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు.. “ఒక గంట ముందు వరకూ ఎవరో తెలియని అమ్మాయి మీద ఏంటి తనకు ఇంత ఇది.. ఆమె అందమా? కాకపోవచ్చు..పూజ అందగత్తె..అందులో సందేహం లేదు..కాని అంతకంటే అందమైన వాళ్ళు తనను కావాలి అనుకున్నారు ఇంతకు ముందు..అలాంటివాళ్ళు ఇద్దరినీ తను కొన్ని పరిస్తితులలో అనుభవించాడు కూడా…కాని పూజ ని చూస్తుంటే ఆ కసి..కోరికా కలగడంలేదు..బహుసా ఆమె అమాయకత్వం..నడవడిక..ఆమె ఇంటలిజెన్స్ తనని కట్టిపడెస్తున్నాయెమొ… “is it love at first sight ?” అనుకుని..”ఛి ఛి..లవ్ కాదు ఏం కాదు.. ఈ మధ్య ఎవరితోనూ ఇంతలా మాట్లాడలేదు కదా? అందుకే పూజ తో మాట్లాడేసరికి ఇలాంటి భావనలు వస్తున్నాయేమో అనుకున్నాడు.. మరొకపక్క కిందకు వెళ్ళిన తరువాత పవిత్ర పూజతో “ఎలా ఉన్నాడే మహీ?” అంది..పూజ ఒక సెకండ్ సాలోచనగా చూసి ” he is nice ” అంది.. “నైస్ ఆ? అంతేనా?” అంటే “ఇంకేం వుంటుందే? సరే క్యూట్ గా కూడా వున్నాడు సరేనా?” అంటూ నవ్వింది.. “అవును..అందుకే కదా..నన్ను లోపలకి వెళ్ళనిచ్చి డ్రింక్స్ కూడా తాగేశారు..” అని.. “పూజ..నీకొకటి తెలుసా? మహీ ఎవరితోనూ ఇలా మాట్లాడడు.. అంతెందుకు ఇన్నిసార్లు వెళ్ళినా నాతోనే ఎప్పుడూ మాట్లాడలేదు.. ఈ రోజు నీ వల్లే నాతొ కూడా బాగా మాట్లాడాడు..” అంది.. పూజ ఏం మాట్లాడలేదు.. కాని పూజకి కూడా మహీ కంపెనీ చాలా బాగా అనిపించింది.. ఇప్పటివరకు..తనకు తెలిసిన మగాళ్ళు “కిరణ్ అయితేనేం ..రాజేష్ అయితేనేం..చూపులతోనే తన అందాలను తాగెస్తారు.. ఇక ఆ ధియేటర్ వాడు అయితే ఏకంగా అనుభవించడానికే చూసాడు.. కాని మాట్లాడుతున్నంత సేపు మహీ కళ్ళల్లో ఆ కోరిక అనే భావం కనిపించలేదు.. చెప్పాలంటే తన తాత గారి తో, తండ్రి తో వున్నప్పుడు ఎంత భద్రతా భావం కలుగుతుందో అలా అనిపించింది మహీ సాంగత్యం.. he is something special ” అనుకుంది. పూజ మొహం లో దోబుచులాడుతున్న ఆనందం చూసి పవిత్ర తన ప్లాన్ బాగా సాగుతుంది అనుకుంది. చెప్పాలంటే మహీ కంటే..పూజ కంటే కూడా ఎక్కువ సంతోషం గా వున్నది పవిత్ర.. కాని ఆమెకి కిరణ్ గుర్తొచ్చి ఒక్క క్షణం గుండెలో ఏదో భయం అనిపించింది.. కిరణ్ కి తెలియకుండా ఇంత చేస్తుంది..రేపు కిరణ్ కి తనే పూజని తీసుకుని మహీ దగ్గరకు వెళ్ళిందన్న విషయం తెలిస్తే ఏమంటాడో..మహీ చెప్పకపోవచ్చు. అయినా తన జాగ్రత్త లో తనుంటే మంచిది .. కిరణ్ కి ఎలాగోలా మహీ, పూజ ల పరిచయం విషయం చెప్పెస్తేనే మంచింది..అనుకుంది..

ఆ రోజు రాత్రి వైజాగ్ ఫోన్ చేసి కాసేపు మాట్లాడాక..”నేను అర్జెంట్ పనుండి విజయవాడ వచ్చాను కిరణ్..అమ్మ వాళ్ళు ఎందుకో రమ్మన్నారు..” అంది.. ” ఏంటి..పెళ్లి సంబంధం ఏమైనా చూసారా? ఎప్పుడూ చేసుకుంటున్నావ్?” అన్న కిరణ్ తో.. కొంచం కోపం గా ” నీ అల్లరికి హద్దు ఉండదా? అలా వేరేవాళ్ళను పెళ్లి చేసుకోవలసి వస్తే నా శవమె వుంటుంది..” అంది కొంచం ఎమోషనల్ గా.. ఆ మాటకు తనకి వచ్చిన చిరాకును వినపడనీయకుండా ” హే..సరదాకి అన్నాను..కూల్ బేబీ..” అన్నాడు.. నిజానికి కిరణ్ కి పవిత్ర అంటే ప్రేమేం లేదు.. అమ్మాయిలతో ఆడుకోవడం అతనికి కొత్తేం కాదు..

6 Comments

  1. Innallaki vochinda e part

  2. Super..గా రాస్తున్నారు. నిజంగా క్యారెక్టర్ ని ఎక్కడ తక్కువ చెయ్యకుండా.. పరిస్థితితుల ప్రభావం వల్ల జరిగే మార్పులు భలే రంజింప చేస్తూ.. పూజ ను బాగా ఎలిమినేట్ చేసి రాస్తున్న మీకు ???

  3. Next part revealed ఎప్పుడు ప్లీజ్ త్వరగా పెట్టండి ప్లీజ్ ???

  4. Super..గా రాస్తున్నారు. నిజంగా క్యారెక్టర్ ని ఎక్కడ తక్కువ చెయ్యకుండా.. పరిస్థితితుల ప్రభావం వల్ల జరిగే మార్పులు భలే రంజింప చేస్తూ.. పూజ ను బాగా ఎలిమినేట్ చేసి రాస్తున్న మీకు ???..Next part.. 6..కాస్త త్వరగా upload చేయండి ?

  5. Very beautyfull story.

Comments are closed.