బంగ్లా – Part 1 354

ఇద్దరు సాయం పట్టి శవాన్ని పక్కకి దొర్లించారు.
చూస్తే ఆ శవం గోపన్నది.
కళ్ళు తేలేసి ఉందా శవం.
వాళ్ళ ఇంట్లో చెబుదాం అని వాళ్ళ ఇంటికి వెళ్లారు.
బయట నిలబడి ఎంత పిలిచినా ఎవరూ పలకడంలేదు.
లోపలికి వెళ్తే తలుపులు తెరిచి ఉన్నాయి.
తలుపు తీసిన వాళ్లకి ఎదురుగా ఇంకొక రెండు శవాలు దర్శనమిచ్చాయ్.
ఒకటి గోపన్న భార్య కళావతి శవం, పక్కనే 5 సంవత్సరాల కూతురూ నిర్జీవంగా పడి ఉన్నారు.
వాళ్లకి ఏమి చెయ్యాలో కాళ్లు చేతులూ ఆడటం లేదు.
అందరూ ఆ వూరి మునసబు దగ్గరికి పరిగెత్తారు.
అక్కడికి చేరుకున్న ఊరి పెద్దలు ఇది తమకి తేలే వ్యవహారం కాదని పోలీసులకి ఉప్పందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి పూర్తి స్థాయిలో చేరుకున్నారు.
ఫోరెన్సిక్ నిపుణులు, జాగిలాలూ, పోలీసుల హడావుడితో అక్కడంతా గందరగోళంగా తయారయ్యింది.
ఊరు మొత్తం అక్కడే గుమిగూడారు.
పోలీసులు తమకి కావలిసిన సమాచారం సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం శవాలను ఆస్పత్రికి తరలించారు.
ఇంత జరిగిన ఆ వూరి పేరు పోతవరం.
అసలు ఈ చావుల వెనకాల నిజం ఏమిటి?
దానికి గల కారణాలు ఏంటి?
అసలు ఆ ఊర్లో ఏం జరిగింది?
గోపన్న 16 సంవత్సరాల యువకుడు.
కొండల్లో రాళ్ళు కొట్టే పనికి వెళతాడు.
ఆ వయసులో కాయకష్టం చేసిన బలమైన నల్లని శరీరంతో దిట్టంగా ఆబోతులా ఉంటాడు.
తల్లీ తండ్రీ కూడా రోజు కూలీలే.
తల్లి మాట జవదాటి ఎరగడు.
రెండు సంవత్సరాలుగా తను ఆ పనికి వెళుతున్నాడు.
ఇంకొక రెండు సంవత్సరాలు గడిచాయి.
గోపన్నకి అన్ని అలవాట్లు మొదలయ్యాయి.
కల్లు మత్తులో ఉండే సుఖం అతన్ని బానిస చేసుకుంది.
పగలు ఇంటి నుంచి వెళ్ళి తాగే అతను రాత్రి కొంపకి చేరుకునేటప్పుడు తెచ్చుకునే కల్లు ముంతతో ముగుస్తుంది.
కానీ పనిలో ఉన్నప్పుడు మాత్రం దాని జోలికి వెళ్ళడు.
ఇంతలో పప్పకొట్టుళ్ళూ మొదలెట్టాడు.
రోజులో ఒక చిలక సంగతి అయినా చూడవలిసిందే.
కూడా పనికి వచ్చే ఆడవాళ్ళు, ఊర్లో ఖామందుల పెళ్ళాలు ఇలా చాలా ఖాతాలు ఉన్నాయి.
కానీ ఎప్పుడూ వేశ్య దగ్గరికి మాత్రం వెళ్ళేవాడు కాదు.
ఇన్ని తెలిసినా తల్లి తండ్రులు మాత్రం ఎందుకులే అడగటం అని వదిలేసేవారు.
రోజులు గడుస్తున్నాయి.