లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 3 88

“నువ్వు చెప్పేది కరెక్టే కానీ……..నా లిస్ట్ ఇస్తే…….నీ ఆలోచనలు మారొచ్చు…….నువ్వు సొంతగా ఒక లిస్ట్ ఇస్తే…….అప్పుడు నీ మనసులో నిజంగా ఎం కోరికలు ఏమున్నాయి అని నాకు తెలుస్తుంది”

“కానీ నా లిస్ట్ తయారు చేయటానికి టైం పడుతుంది సంజు”

“awww…..చాల క్యూట్ పేస్ పెట్టి అడుగుతున్నావు స్వీటీ……కానీ నా జవాబు మారదు”

“ప్లీస్…….”

“P L E A S E”

“సంజు…..నేను ప్లీజ్ స్పెల్లింగ్ అడగట్లేదు…….ఆ లిస్ట్ చూపించమని అడుగుతున్నాను…..ప్లీస్ సంజు”

ఒక అరా నిమిషం నిశ్శబ్దం.

“సరే…….అయితే ఒక పనిచేద్దాం……..ఒక గేమ్ ఆడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పింది ఫైనల్ అవుతుంది ఓకేనా ??”

“సరే……..ఏంటి ఆ గేమ్ ??”

“కానీ ఒక అరగంట గంట పడుతుంది ఆడటానికి…….ఓకేనా ??”

“అరగంట ?? చిన్న గేమ్స్ ఏమి లెవా సంజు??”

“అవసరం ఎవరిది దింట్లో ??”

“ఏంటి ??”

“లిస్ట్ కావలిసింది ఎవరికీ ??”

“నాకు”

“లిస్ట్ ఎవరి దగ్గర ఉంది ??”

“నీ దగ్గర”

“మరి ఇక్కడ అవసరం ఎవరిది ??”

“నాది”

“మరి ఎవరి మాట ఎవరు వినాలి ఇప్పుడు”

స్వీటీ నన్ను కొట్టింది. నేను నవ్వాను.

“ఛి……నువ్వు కావాలని ఇలా చేస్తున్నావ్ సంజు …….నన్ను టీస్ చేయటానికి”

“లేదు నిజంగా చెప్తున్నాను…….నువ్వు గెలిస్తే……..నీకు వెంటనే ఆ లిస్ట్ ఇచ్చేస్తాను……..”

“నిజమే కదా ??”

“నీ మీద ఒట్టు స్వీటీ”

“నా మీద వొద్దు, నీ పై నువ్వు వేసుకో”

“సరే నా మీద ఒట్టు ఓకేనా ??”

“hmmmm……సరే”

1 Comment

  1. No new updates but dam worst stories are being posted 30,30 bits though we commented admn will not take into consider. Good stories will not continue further.

Comments are closed.