పెద్దమ్మ Part 24

“THIS PROPERTY BELONGS TO KAVYA & MAHI ” ……
What …… ” కావ్య & మహి ” , కావ్యా & అవంతిక అని ఉండాలికదా అన్నయ్యా …..
ఏదీ చెల్లెళ్ళూ …….” కావ్య & మహి ” ……. , అవునుకదా ” కావ్య & అవంతిక ” అని ఉండాలికదా చెల్లెళ్ళూ – తమ్ముడూ …… , రిజిస్టర్ అయ్యిందన్న సంతోషంలో మీ డాడీ కూడా చూసి ఉండరు .
హాసిని : ఉండండి అన్నయ్యా …… డాడీ ని ఇప్పుడే పిలుస్తాను అంటూ మొబైల్ అందుకుని కాల్ చేసి , డాడీ ….. వన్ మినిట్ లో ” కావ్యక్క & దేవత మహి ” దేవాలయం దగ్గరకు రావాలి .

వన్ మినిట్ లోపే వచ్చేస్తాను బంగారు తల్లీ అంటూ పరుగునవచ్చారు విశ్వ సర్ , తల్లులూ …… మీరు రాంగ్ గా చెప్పారు ” కావ్యక్క & దేవత మహి ” అని మీ దేవత పేరు అవంతిక కదా ……
చెల్లెళ్లు : ఎవరు రాంగో ఈ డాక్యుమెంట్స్ చూసి చెప్పండి డాడీ – అంకుల్ …….
విశ్వ సర్ : చెప్పేస్తాను నాకేమైనా భయమా …… , This property belongs to
” కావ్య & అవ …… మహి ” – నుదుటిపై చెమటలు పట్టేసాయి – తప్పు ఎక్కడ జరిగిందో ఏమిటో తల్లులూ తల్లులూ …… అలా కోపంగా చూడకండి నిజంగా భయమేస్తోంది .
సిటీని గడగడలాడించే గ్రేట్ & డైనమిక్ కమిషనర్ గారికి చెల్లెళ్లు అంటే భయం అంటూ నాకైతే నవ్వు వచ్చేసింది – నన్ను చూసి చెల్లెళ్లు సంతోషంతో నవ్వుకుని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు – డాడీ ….. అన్నయ్య నవ్వుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి మీరు సేఫ్ .
విశ్వ సర్ : హమ్మయ్యా …… , పెద్ద మిస్టేక్ జరిగింది – మహేష్ sorry sor …..
సర్ సర్ సర్ …… అంటూ ఆపి , ముందు చెల్లెళ్లకు భయపడకుండా కూర్చోండి అంటూ వాటర్ బాటిల్ తెచ్చిచ్చాము .
విశ్వ సర్ : అధికాదు బుజ్జిహీరో …… , నువ్వు అడిగిన ఒకేఒక పనిని కూడా సరిగ్గా చెయ్యలేకపోయాను .
సర్ సర్ ప్లీజ్ ప్లీజ్ మిస్టేక్ జరిగింది – రేపు ఆఫీస్ తెరుచుకోగానే మార్పించరూ ……
విశ్వ సర్ : రిజిస్టర్ ఆఫీస్ ఓపెన్ అయిన మరుక్షణమే నేనే స్వయంగా వెళ్లి మార్పిస్తాను బుజ్జిహీరో ……. , ఇక్కడే ఉంటే మరింత భయం వేస్తుంది వెళతాను మీరు లోపలికివెళ్లి చూడండి – లోపలికి రావాలని ఉంది కానీ మీరు రానివ్వరు కదా …….
చెల్లెళ్లు : ఫస్ట్ కావ్యక్క – దేవతనే అడుగుపెట్టాలి డాడీ …… , మెమెందుకు వెళుతున్నాము అంటే బిల్డింగ్ లో అక్కయ్య – దేవతకు తగినట్లుగా ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యడానికి ……
విశ్వ సర్ : ఆర్కిటెక్ట్ మరియు పనివాళ్లను పిలిపించనా తల్లులూ ……
చెల్లెళ్లు : అయ్యో డాడీ – అంకుల్ ….. అన్నయ్య – మేము ఉండగా ఆర్కిటెక్ట్ ఎందుకు ? , పెద్దమ్మను తలుచుకున్నామంటే అలా చిటికెలో మారిపోతుంది – ముందు మీరు మిస్టేక్ కరెక్ట్ చేసేపనిలో ఉండండి .
విశ్వ సర్ : కరెక్ట్ చెయ్యాలి అంటే ఉదయం వరకూ ఆగాలి – ఉదయం వరకూ తల్లులు ….. నన్ను ర్యాగింగ్ చేసేస్తారేమో అంటూ చెల్లెళ్ళవైపు భయభయంగా చూస్తూ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లిపోయారు .

లవ్ యు డాడీ – అంకుల్ అంటూ నవ్వుతున్న చెల్లెళ్లతోపాటు నవ్వుకుని , చెల్లెళ్ళూ – తమ్ముడూ …… ఓపెన్ చెయ్యండి .
అక్కయ్య – దేవత తరుపున ఈ చెల్లెళ్లు అంటూ తాళంతో డోర్స్ పూర్తిగా తెరిచి , అన్నయ్యా అన్నయ్యా అంటూ నా చేతులను అందుకుని లోపలికి పిలుచుకునివెళ్లారు .
రాజభవనంలా ఉన్న హాల్ మధ్యలోకివెళ్లి కన్నార్పకుండా సంతోషంతో చుట్టూ చూస్తున్నాము .
అన్నయ్యా అన్నయ్యా …… సూపర్ హిందీ డబ్బింగ్ సీరియల్స్ లో బిల్డింగ్ లా ఉంది అంటూ హత్తుకున్నారు సంతోషంతో …..
చెల్లెళ్ళూ ….. అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాను .
చెల్లెళ్లు : అంటే అంటే అదీ అదీ అమ్మావాళ్ళు సీరియల్స్ చూసేటప్పుడు మూవీ లలోకంటే సీరియల్స్ లోనే సూపర్ బిల్డింగ్స్ ఉన్నాయి అని మాట్లాడుకోవడంతో చూసాములే మాకు కూడా అలానే అనిపించింది – మా అన్నయ్య వలన ఇప్పుడు ఏకంగా అంతకంటే అద్భుతమైన బిల్డింగ్ లో అడుగుపెట్టాము అంటూ సిగ్గుపడుతూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లకు నచ్చితే అక్కయ్య – దేవతకు ఖచ్చితంగా నచ్చుతుంది .
చెల్లెళ్లు : బిల్డింగ్ చూశారంటే అక్కయ్య – దేవత ….. మమ్మల్ని లాగేసి మా అన్నయ్యను ముద్దులలో తడిపేస్తారు , అంత అద్భుతంగా ఉంది అన్నయ్యా ……
చెల్లెళ్ళూ …… మరి మరింత అద్భుతంగా మార్చేద్దామా ? .
చెల్లెళ్లు : ఓహ్ ఎస్ అన్నయ్యా అన్నయ్యా …… , అంతకంటే ముందు అన్నీ ఫ్లోర్స్ చూద్దాము .
లవ్ టు చెల్లెళ్ళూ ……. , స్టెప్స్ or లిఫ్ట్ ? .
చెల్లెళ్లు : లిఫ్ట్ లో లిఫ్ట్ లో …….
Ok ……
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ….. వన్ మినిట్ అంటూ మెయిన్ గేట్ మరియు మెయిన్ డోర్ క్లోజ్ చేసి వచ్చారు , అక్కయ్య – దేవత కంటే ముందు ఎవ్వరూ రాకూడదు కదా ……
చెల్లెళ్ళూ …… అందుకోసం నేనున్నానుకదా ……
చెల్లెళ్లు : మా అన్నయ్య బుజ్జిదేవుడు – బుజ్జిదేవుడితో ……
మా చెల్లెళ్లు ఆర్డర్ వేస్తే ఏమైనా చేస్తాను లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టి , ఫస్ట్ ఫ్లోర్ లోని హాల్ – రూమ్స్ – బాల్కనీ చూసి సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము .

అన్నయ్యా అన్నయ్యా …… స్విమ్మింగ్ పూల్ wow wow , కాంపౌండ్ లో ఒకటి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఒకటి అన్నమాట సూపర్ ……
నిజమేనన్నమాట నేను తొలిసారిగా ఇక్కడకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మురళి – వినోద్ …… ఈ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్పారు , బ్యూటిఫుల్ కదా చెల్లెళ్ళూ ….. మీరు – అక్కయ్య – దేవత ప్రతీసారీ స్విమ్మింగ్ చెయ్యడానికి కిందవరకూ వెళ్లాల్సిన అవసరం లేదు – స్విమ్మింగ్ చేస్తూ సిటీ మరియు సముద్రాన్ని చూడొచ్చు అంటూ సంతోషంతో ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : సూపర్ – మా అన్నయ్యకూడా …….
అది దేవత అనుమతి మీద ఆధారపడి ఉంటుంది చెల్లెళ్ళూ …… , సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి ఈ ఫ్లోర్లోనే మీరు – అక్కయ్య – దేవత ఉండబోతున్నారు , అదిగో ఎదురుగా ఉన్న మూడు గదులలో మధ్యలోనిది మా ముద్దుల చెల్లెళ్లకోసం – చెరొకవైపు అక్కయ్య దేవత కోసం .
చెల్లెళ్లు : ఆ మూడుగదులలో ఆ రోజుకు మా అన్నయ్యకు ఏ గది ఇష్టమైతే ఆ గదిలో ఉంటారు .
అదికూడా దేవత అనుమతి మీదనే ఆధారపడి ఉంటుంది చెల్లెళ్ళూ …..
చెల్లెళ్లు : ఏమిటన్నయ్యా ప్రతీదానికీ దేవత అనుమతి అంటున్నారు – ఒక విషయం తెలుసా ……. మీరే మా అన్నయ్యే , బుజ్జిదేవుడు అని తెలిసిన క్షణం , మిమ్మల్ని తప్ప వేరొకరిని లోపలికి కూడా అడుగుపెట్టనివ్వరేమో …… , అంత అంతులేని ప్రేమను హృదయమంతా నింపేసుకుంటున్నారు పాపం – బయటకు వచ్చినప్పుడు మా అన్నయ్యను కలవగలమో లేదో …… ప్రతీదానికీ దేవత అనుమతి తీసుకోవాలేమో అంటూ సంతోషంతో నవ్వుకున్నాము .
నిజమా చెల్లెళ్ళూ …… , దేవత అంత ప్రేమను కురిపిస్తారా ? .
చెల్లెళ్లు : మా అన్నయ్య …… మాపై కురిపిస్తున్న ప్రేమకంటే కొద్దిగా కొద్దిగా ఇంతే ఇంత తక్కువ అంటూ నవ్వుతున్నారు – లేదు అన్నయ్యా ….. ఇన్నిరోజులూ దాచుకున్న విశ్వమంతప్రేమను చూయిస్తారు అంత ప్రాణం బుజ్జిదేవుడు అంటే – మన దేవతను లక్షల్లో కోట్లలో ఉన్న అనాధపిల్లల దేవతను చేశారు మరి ….. అంతకు అంత రుణం తీర్చుకుంటారులే ప్రేమను పంచి మాకెలా తెలుసు అనుకుంటున్నారా ? , అక్కయ్య – బామ్మలు – మమ్మీలు చెప్పారులే …… , అన్నయ్యా అన్నయ్యా …… ఈ చెల్లెళ్లను మరిచిపోకూడదు మరి ……
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ …… మిమ్మల్నీ అంటూ స్టెప్స్ ద్వారా మరింత పైకి పరుగులుతీసాము – చెల్లెళ్ళూ …… జాగ్రత్త .
అన్నయ్యా ….. మీరుకూడా జాగ్రత్త అంటూ థర్డ్ ఫ్లోర్ చూసి టాప్ చేరుకున్నాము .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *