అక్కయ్య : నొప్పివేసిందా తమ్ముడూ ……
ఊహూ ఊహూ ….. హాయిగా ఉంది .
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దులు కురిపించారు . తమ్ముడూ …… ఈరోజుకు తప్పించుకున్నావు రేపటికి మాకోరిక తీర్చాలి – చూడు అంటూ మొబైల్ ను నావైపుకు చూయించీ చూయించనట్లు తిప్పి , పెద్దమ్మ వాయించేస్తోంది మెసేజ్ లతో …… నా చిన్న కోరిక కూడా తీర్చలేవా చిట్టితల్లీ అంటూ ……. – పెద్దమ్మా …… నాకోరిక కూడా కదా రేపు ఖచ్చితంగా తీరుస్తాడులేఅని నచ్చచెప్పాను .
రేపా …… అంటూ భయంతో అక్కయ్యను కౌగిలించుకున్నాను .
అక్కయ్య : కొడతారని భయమా తమ్ముడూ …… , దేవత దెబ్బలు నీకు ఇష్టమే కదా …….
అవును ఇష్టమేకదా …….
అక్కయ్య : ఇష్టమే ఇష్టమే యాహూ …… , గుడికి వెళ్లాలికాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను లేకపోయుంటే జ్వరం కాదు ఏకంగా టైఫాయిడ్ వచ్చేలా ముద్దులే ముద్దులు అంటూ నవ్వుకుంటూ నన్ను హత్తుకునే కిందకు పిలుచుకునివచ్చారు .
అన్నయ్యా – అక్కయ్యా వచ్చారా ? , చూడండి బామ్మలు రాము అంటున్నారు .
అలా ఎలా కుదురుతుంది అందరమూ కలిసి వెళదామనికదా అనుకున్నాము .
బామ్మలు : అదికాదు బుజ్జిహీరో …… మీరు గుడికి వెళ్లి వచ్చేలోపు డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాము – సమయానికి తిని హాయిగా నిద్రపోవచ్చు .
అక్కయ్య : ఆలస్యం అయినా ఏమీ పర్లేదు బామ్మలూ …..
అవునవును ……
బామ్మలు : మేము గుడికివచ్చి ఏమని మొక్కుకోవాలి చెప్పండి – మా ప్రాణమైనవాళ్ళు సంతోషమే మా సంతోషం – మీకు వంట చేసిపెట్టడంలోనే మాకు సంతోషం …….
అక్కయ్య : వచ్చాక అందరమూ కలిసి చకచకా ప్రిపేర్ చెయ్యవచ్చులే బామ్మలూ …… , తమ్ముడూ చెప్పు ……
మాకవన్నీ తెలియదు బామ్మలూ …… , మీరు వస్తేనే మేముకూడా వెళ్ళేది అంతే , ఇది ఫైనల్ అంటూ అక్కయ్య – చెల్లి చేతులను అందుకుని సోఫాలో కూర్చున్నాను .
లవ్ యు తమ్ముడూ – లవ్ యు అన్నయ్యా …… ఇలాచెబితేనేకానీ వినరు బామ్మలు …….
బామ్మలు : సరే బుజ్జిహీరో వస్తాము .
లవ్ యు లవ్ యు బామ్మలూ అంటూ లేచి సంతోషంతో హత్తుకున్నాము .
బామ్మలు : మీ సంతోషమేకదా మా సంతోషం ……
చెల్లెళ్లు : అక్కయ్యా – అన్నయ్యా ….. దేవత – బామ్మలు ఇక్కడ రెడీ అవుతారు , రండి మనం ఆ ఇంటిలో రెడీ అవుదాము అంటూ పిలుచుకునివెళ్లారు .
వేరువేరుగదులలో ఫ్రెష్ అయ్యి , బెడ్స్ పైగల డ్రెస్సెస్ వేసుకుని కింద హాల్లోకివచ్చాము . అప్పటికే దేవత – మిస్సెస్ కమిషనర్ రెడీ అయ్యి పూజాసామాగ్రితో వచ్చేసారు .
Wow ……. దేవత పట్టుచీరలో – అక్కయ్య లంగావోణీలో – చెల్లెళ్లను పరికిణీలలో చూసి బ్యూటిఫుల్ అంటూనే ఎవరిని చూడాలో తెలియక తల గోక్కోవడం చూసి ……
అందరూ నవ్వుకున్నారు . హాసిని …… విశ్వ సర్ కు కాల్ చేసి డాడీ గుడికి వెళుతున్నాము – ok డాడీ ……
మిస్సెస్ కమిషనర్ : తల్లీ …… మీ డాడీ ఏమన్నారు ? .
హాసిని : మీ అన్నయ్య తోడుగా ఉంటే నాకేమి భయం హ్యాపీగా వెళ్ళిరండి అన్నారు.
దేవత : మీ అన్నయ్య బుజ్జిహీరో మాత్రమే , బుజ్జిదేవుడు కాదని మీ డాడీ కి చెప్పు బుజ్జితల్లీ …….
చెల్లెళ్లు : డాడీ వచ్చాక చెబుతాము దేవతా అంటూ నావైపు కన్నుకొట్టారు – బుజ్జ్జిదేవుడంటే ఎంత ప్రాణమో …… సో సో సో హ్యాపీ దేవతా అంటూ నా చేతిని చుట్టేసి దేవత వైపుకు …….
దేవత : నో నో నో చెప్పానుకదా పడుకునేంతవరకూ …… , చెల్లీ ….. నీ తమ్ముడిని నావైపుకు పంపించకుండా గట్టిగా పట్టేసుకో ……
అక్కయ్య : దేవతే స్వయంగా చెప్పాక అంతకంటే అదృష్టమా – లవ్ యు sooooo మచ్ అక్కయ్యా అంటూనే నా చేతిని గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లెళ్లు : Ok ok దేవతా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టివెళ్లి దేవతను చుట్టేశారు – దేవతా …… సాయంత్రం నుండీ అడుగుదామనుకుని అడగలేదు ఎందుకలా ? .
దేవత : రాజేశ్వరి – మల్లీశ్వరి వాళ్ళు మనకోసం ఎంతోసేపటి నుండి ఎదురుచూస్తున్నారు పదండి పదండి అంటూ మాట మార్చేశారు .
అలాగే అంటూ చిరునవ్వులు చిందిస్తూ బయటకువెళ్లి మినీ బస్సులో బయలుదేరాము .
నా చేతిని రెండు చేతులతో పెనవేసి ముద్దులుపెడుతూ …… , తమ్ముడూ ….. పట్టుచీరలో నీ ప్రియమైన దేవత ఎలా ఉంది .
అచ్చం దేవతలానే ఉంది అక్కయ్యా – గుడికి వెళ్ళాక కుంకుమ బొట్టు పెడితే ……
అక్కయ్య : Wow బ్యూటిఫుల్ ఊహించుకుంటేనే దేవత కళ్ళ ముందు కనిపిస్తోంది తమ్ముడూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు – అక్కయ్యా …… వినిపించిందా ? .
వినిపించిందా దేవతా దేవతా ….. అంటూ చెల్లెళ్లు , దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : వినిపించిందిలే అంటూ మురిసిపోతున్నారు – ఈ మాటలు నా బుజ్జిదేవుడు అని ఉంటే మరింత సంతోషం కలిగేది ఆఅహ్హ్హ్ ….. ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో అంటూ చెల్లెళ్ళ చేతులను హృదయంపై హత్తుకుని ఫీల్ అవుతున్నారు .
చెల్లెళ్లు : సంతోషంతో నవ్వుకుని అన్నయ్యా వినిపించాయా దేవత మాటలు …….
దేవత : ఏ అన్నయ్యకు చెబుతున్నారు ? .
చెల్లెళ్లు : ఇంకెవరికి దేవతా …… , మీ మనసంతా నిండిపోయిన అన్నయ్యనే అడుగుతున్నాము .
దేవత : మనసు మాత్రమే కాదు చెల్లెళ్ళూ ……. హృదయం – వొళ్ళంతా నిండిపోయాడు మీ బుజ్జిదేవుడు అన్నయ్య , ఇప్పుడు గుడికి వెళుతున్న ముఖ్యమైన కారణం కూడా ఆ అమ్మవారిని గట్టిగా అడగడానికే , మా బుజ్జిదేవుడి అనుగ్రహ అదృష్టం ఎప్పుడు అని …….
చెల్లెళ్లు : కాస్త గట్టిగా అడగండి దేవతా …….
దేవత : కాస్త ఏమిటి పూర్తి గట్టిగా ఆడిగేస్తాను – అమ్మను అడగడంలో తప్పేలేదు కదా …… లేకపోతే ఎన్నిరోజులని ఆగాలి – ఎన్ని మొక్కులుంటే అన్ని మొక్కులూ మొక్కుకుంటాను – అప్పుడు ఎందుకు అనుగ్రహించరో చూస్తాను .
అక్కయ్య : మా అక్కయ్య కోరిక వెంటనే తీరాలని 101 కొబ్బరికాయలు కొట్టబోతున్నాను అమ్మా …….
అక్కయ్యా అక్కయ్యా ……. మీ సుకుమారమైన చేతులతో అనిమాత్రం మొక్కుకోకండి – అమ్మా దుర్గమ్మ తల్లీ …… అక్కయ్య తరుపున నేను – విక్రమ్ కొడతాము ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ …….
చెల్లెళ్లు : అన్నయ్యా …… మేముకూడా , పెద్దమ్మను తలుచుకున్నాము అంటే వంద ఏమిటి వెయ్యి లక్ష అయినా కొట్టేస్తాము .
దేవత : లవ్ యు చెల్లీ …… , బుజ్జిహీరో …… సరైన సమయానికి నీ పేరుని సార్థకం చేసుకుంటావు గుడ్ గుడ్ – చెల్లెళ్ళూ ….. లవ్ యు అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
యాహూ దేవత గుడ్ గుడ్ అన్నారు అంటూ అక్కయ్య చేతులను వదలకుండానే లేచి డాన్స్ చేస్తున్నాను .
మల్లీశ్వరి గారూ స్లో స్లో స్లో గా పోనివ్వండి అంటూ అక్కయ్య దేవత చెల్లెళ్లు మిస్సెస్ కమిషనర్ బామ్మలు కేకలువేశారు .
అక్కయ్య : అక్కయ్యా …… మీరుకూడా ? .
దేవత : గుడ్ గుడ్ అన్నది నేనేకదా అంటూ సిగ్గుపడ్డారు .
చెల్లెళ్లు …… దేవత బుగ్గలపై ముద్దులుపెట్టివచ్చి , నాతోపాటు చిందులేస్తున్నారు .
బస్సు అంతా నవ్వులే నవ్వులు – అంతలో గుడి రావడంతో అందరమూ కిందకుదిగాము .
గుడి భక్తులతో కిటకిటలాడుతుండటం చూసి ఆశ్చర్యపోయాము .
జేబుల్లో వెతుకుతుండటం చూసి బుజ్జిహీరో ….. మీ అక్కయ్య మొక్కుకోసం డబ్బు కావాలా ? అని అడుగుతూనే బామ్మ జాకెట్ లోపలనుండి డబ్బు తీసి నాకు అందించబోయి నో టచింగ్ నో టచింగ్ అంటూ చెల్లెళ్లకు ఇచ్చారు .
చెల్లెళ్లు : ఎందుకో ఏమో అన్నయ్యను దగ్గరకే రానివ్వడం లేదు దేవత .
చెల్లెళ్లు : పడుకునేంతవరకెలే చెల్లెళ్ళూ బాధపడకండి .
చెల్లెళ్లు : అయితే ok , బామ్మలూ …… ఎంతడబ్బు దాచుకున్నారు అక్కడ అంటూ నవ్వుకుంటున్నారు .
మిస్సెస్ కమిషనర్ : మాలాంటివాళ్లకు అదే safest ప్లేస్ కదా తల్లులూ …… అంటూ దేవత – అక్కయ్యతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : నవ్వుతూనే అన్నయ్యా రండి 101 టెంకాయలు కొందాము అంటూ చేతిని అందుకున్నారు .
నా చేతిని పట్టుకున్న అక్కయ్య చేతిని బామ్మ చేతికి అందించి గుడి బయట ఉన్న టెంకాయల కొట్టు దగ్గరికివెళ్లాము .
చెల్లెళ్లు : అంటీ ….. 101 టెంకాయలు కావాలి మొక్కుకోసం అంటూ డబ్బు అందించారు .
అంటీ : మొక్కుకా అంటూ డబ్బు అందుకుని కౌంట్ చేసి మిగిలినది వెనక్కు ఇచ్చేసారు – పిల్లలూ …… లోపల గుడిలో మీరు మొక్కుబడి తీర్చుకునే ప్లేస్ కు వెళ్ళండి మా అబ్బాయితో పంపిస్తాను – మీరు క్యూ లో లోపలికి వెళ్ళేలోపు మొత్తం టెంకాయలు అక్కడ వుంటాయి , ఉదయం వరకూ టెర్రరిస్టుల భయంతో ఖాళీగా ఉన్న దేవాలయం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడిపోతోంది – గత కొన్నిరోజులుగా భక్తులురాక వ్యాపారం లేక చాలా ఇబ్బందిపడ్డాము – ఎవరో మహేష్ ఆట మీ వయసున్న చిన్న పిల్లాడు టీవీలో మాట్లాడటం చూసి ఇంతమంది దైర్యంగా బయటకువచ్చారు – అంతా అమ్మవారి దయ ……
చెల్లెళ్లు : నావైపు చూసి ఆనందిస్తూ చుట్టేసి , అమ్మవారి కనుసన్నల్లో మా అన్నయ్య వల్లనే ఇదంతా అంటూ ముద్దులుపెడుతూ హుషారుగా అందరి దగ్గరికి చేరుకున్నాము .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… ఎందుకు ఇంత సంతోషం .
చెల్లెళ్లు : చెప్పబోయి వద్దులే దేవతా అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టినవాళ్ళం అవుతాము అంటూ నవ్వుకుంటూ క్యూ లోకి పిలుచుకునివెళ్లారు .
రాజేశ్వరీ – మల్లీశ్వరీ ….. మీరూ రండి .
క్యూ లైన్లో కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు – ఒక్కసారిగా ఇంతమంది భక్తులు – అంతా టీవీలో చూసిన ఆ పిల్లాడు మహేష్ వల్లనే మహేష్ వల్లనే – ఎంత బాగా మాట్లాడాడు , చిన్నపిల్లాడు అయినా సిటీ అందరిలో ధైర్యాన్ని నింపాడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు .
అక్కయ్య – బామ్మలు – మిస్సెస్ కమిషనర్ …… సంతోషంతో ముద్దుల వర్షమే కురిపించారు . తల్లులూ ….. ఇందుకేనా మీ దేవతకు చెప్పనిది అంటూ నవ్వుకుంటున్నారు .
అక్కయ్య అయితే ప్రాణంలా హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
దేవత : నేనేమీ బాధపడటం లేదులే – బుజ్జిహీరో మంచిపనే చేసాడు అని అప్పుడే అభినందించాను , కానీ ఈ అల్లరి పిల్లాడిని బుజ్జిదేవుడితో మాత్రం పోల్చకండి …..
చెల్లెళ్లు : బుజ్జిదేవుడు శిఖరం – బుజ్జిహీరో చిన్న కొండ కదా దేవతా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ……
బామ్మ : కానీ ఇక్కడ అలా అనిపించడం లేదు బుజ్జితల్లీ ….. చూడు శిఖరంలా పొగిడేస్తున్నారు . బుజ్జిహీరో – బుజ్జిదేవుడు ఒక్కటే అని ఇక ఒప్పుకోవాల్సినదే …..
దేవత : నో నో నో నెవర్ అంటే నెవర్ బుజ్జిదేవుడు ఎక్కడ – ఈ బుజ్జిహీరో ఎక్కడ అంటూ చిరుకోపంతో నావైపు చూస్తున్నారు .
బామ్మ : బుజ్జితల్లీ …… పవిత్రమైన గుడిలో ఇలా కోప్పడకూడదు అంటూ కొట్టబోయి …… నేను నో నో నో అనడంతో ఆగిపోయారు .
దేవత : అమ్మా దుర్గమ్మా క్షమించు క్షమించు అంటూ లెంపలేసుకుంటున్నారు .
పర్లేదు మేడం – మీ కోపం నాకు చాలా చాలా ఇష్టమేకదా …..
దేవత : అదిగో ఇంతలోనే అల్లరి మొదలెట్టేసాడు – ఉదయం నుండీ చేసిన అల్లరికే నాకు ……
చెల్లెళ్లు : మీకు మీకు …… ? .
దేవత : ఏమీలేదు ఏమీలేదు చెల్లెళ్ళూ …… , ఇంతకూ మొక్కుబడి టెంకాయలు ఎక్కడ ? .
చెల్లెళ్లు : మొక్కుబడి తీర్చుకునే ప్లేస్ దగ్గర రెడీగా ఉంటాయని చెప్పారు – అదిగో అక్కడ ఉన్నాయి దేవతా అంటూ అమ్మవారి ద్వజస్థంభం దగ్గరికి భక్తుల మధ్యనే చేరుకున్నాము .
