నిన్ననే బిల్డర్లు వచ్చి కంచె వేశారు. కాసేపటి తర్వాత రైతులు జంతువులని తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. కామిని తోటలో తన పని చేసుకుంటోంది, నేను కొన్ని చెట్లని నరకాలని నిర్ణయించుకున్నాను.
మేము మూడు రోజులుగా శారీరక ప్రేమికులం అయిపోయాము, నా జీవితంలో అంత మంచి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. మేము ప్రతిరోజూ శారీరకంగా కలిసేవాళ్ళం, శృంగారంలో నాకున్న ప్రావీణ్యాన్ని కామినికి చూపించాను. ఆమె నా కోసం ప్రతి రోజూ భోజనం వండిపెట్టింది, నా బట్టలన్నీ ఉతికింది. ఆమె నా కలల రాకుమారి.
నేను బయటికి వెళ్లి అడవిలో తిరిగాను. నా కుడి చేతిలో గొడ్డలిని ఎంచుకుని, కాస్త లావుగా ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్లాను. అది మాకు నెల రోజుల కంటే ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తుందని నేను అనుకున్నాను. నేను గొడ్డలిని పైకి కిందకి విసిరి చూసాను, అది నా కుడి చేతిలో ఎంత తేలికగా ఉందో గమనించాను. నా బలాన్ని గొడ్డలి నైపుణ్యాన్ని పరీక్షించడం ఇది మొదటిసారి అవుతుంది.
నేను సులభంగా గొడ్డలిని లేపి చెట్టుకి మొదటి వేటు వేశాను. చెట్టు అప్పుడే ఊగుతోంది, నేను దానికి చేసిన లోతైన హాటుని చూసి ఆశ్చర్యపోయాను. నేను మళ్ళీ గొడ్డలిని లేపి, గొడ్డలి ని చెట్టు లోపలికి మరింతగా గట్టిగా చొప్పించాను. కొన్ని నిమిషాల తర్వాత, నేను దాని మాను యొక్క మూడింట ఒక వంతు లోతుకి నరికాను. నేను రెండో వైపుకి వెళ్లాను, ఏదో తెలియని కారణంతో మొదటి గాటు కంటే ఒక అడుగు పైన నరకాలని నాకు అనిపించింది. నేను నిటారుగా, ఏటవాలుగా నరకడం మారుస్తూ ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేశాను. ఇది నేను కత్తిని ఎలా వాడతానో అలాగే అనిపించింది. గహన నాకు ఇచ్చిన నైపుణ్యం నన్ను చాలా శక్తివంతం చేసింది.
నేను నుదుటి మీది చెమట తుడుచుకున్నాను, చెట్టు విరిగింది. నేను దాన్ని కొద్దిగా నెట్టాను, అది పెద్ద శబ్దంతో గడ్డి మీద కూలిపోయింది. నేను గొడ్డలిని నా చేతిలో పైకి కిందకి దూశాను, నా నుదురు, అరచేతుల్లో చెమట పట్టినా, నాకు అలసట యొక్క ఏ సంకేతమూ కనిపించలేదు.
నేను చెట్టు కొమ్మలని నరికే పనిని కొనసాగించాను. కొన్ని కొమ్మలు చాలా పెద్దగా ఉండటంతో వాటికి మరో వేటు వేయాల్సి వచ్చింది, అయితే నా వీపు మీద మరింత చెమట పట్టే వరకు నేను నరుకుతూ పోయాను. నా చొక్కా చాలా చెమటతో నా చర్మానికి అతుక్కుపోవడంతో దాన్ని తీసేశాను. నేను దానిని సగానికి చింపేయబోయాను, కానీ చివరికి అలా చేయొద్దని అనిపించింది. నేను నా చొక్కాని ఒక చెట్టుకి వేలాడదీసి, మిగిలిన కొమ్మలని నరికే పనికి తిరిగి వెళ్లాను, మరింత చెమట కారుతూ నా కండరాలు నొప్పిగా అనిపించే వరకు పనిచేశాను.
కామిని తోటలో కూర్చుంది, ఆమె బంగారు రంగు జుట్టు చాలా మెరిస్తూ ప్రకాశవంతంగా ఉంది. ఆమె కొన్ని కూరగాయలు నాటి విత్తనాలకి నీళ్లు పోసింది. కామిని నన్ను అప్పుడప్పుడు చూస్తోందని నాకు తెలిసింది. మా కళ్ళు కలిశాయి, ఆమె నాకు చేయి ఊపింది.
నేను నరికిన కలపని ఒక కుప్పగా వేశాను. కొన్ని వారాల పాటు సరిపోయేంత కలపని అప్పటికే నరికేశాను. ఇక్కడ అంతగా చలి లేదు, అయితే నిప్పు ముందు కూర్చోవడం చాలా శృంగారభరితంగా అనిపించింది.
కామిని నా దగ్గరికి వచ్చింది. నేను నా చెవులు మూసుకుని వున్నా తన ఉనికిని నేను ఎలాగైనా గ్రహించేవాడిని. “నిన్ను కౌగిలించుకోవాలని ఉంది, కానీ నువ్వు పూర్తిగా చెమటతో తడిసిపోయావు,” అని ఆమె తన ముద్దులొలికే గొంతుతో అంది.
నేను వెనక్కి తిరిగాను, నీలం రంగు వేసవి దుస్తుల్లో కామిని ఎప్పటిలాగే అందంగా కనిపించింది, ఆ రంగు ఆమె జుట్టు, కళ్ళ రంగుతో సరిపోలింది. మేము తరువాత పడవలో రాత్రి భోజనం చేయాలని నిర్ణయించుకున్నాము. మేము సముద్రంలో నిద్ర కూడా చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ శృంగారభరితమైన డేట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను.
“నాకు తెలుసు, అయినా చెట్టు నరకడం ఎక్కువ శ్రమ అనిపించలేదు” అని అంటూ నా ముఖం నుండి కారిన చెమట తుడుచుకున్నాను.
“నువ్వు చాలా బలంగా కనిపించావు, నిన్ను చూడటం ఒక ఆనందం. నేను పొరపాటున విత్తనాన్ని తప్పు స్థలంలో చల్లాను” అని కామిని అంది.
“మనం పేదవాళ్ళం కాదు, మనం మళ్ళీ మరికొన్ని కొనుక్కుందాం” అని ఆమెతో అన్నాను.
“త్వరలో రాత్రి భోజన సమయం అవుతుంది… బహుశా నేను నీకు స్నానం చేపించడంలో సహాయం చేయగలను,” అని ఆమె చెప్పింది.
“తప్పకుండా,” అని కామిని ముఖాన్ని పరిశీలిస్తూ అన్నాను. నన్ను దొంగచాటుగా చూసిన తర్వాత ఆమె మరింత ఉత్తేజితమైంది. “నీకు తెలుసు నేను దానికి నో చెప్పలేనని.”
“మనం వెళ్దామా ?” అని కామిని ఆత్రంగా అడిగింది, నవ్వుతూ.
