ఇంకో ఐదు మెట్లు ఎక్కితే అయిపోతుంది అనగా…
అను : బావ ఇందాక నన్ను అమ్ములు అని పిలిచావ్ ఎందుకు?
ఆదిత్య : ఏమో నువ్వలా పడిపోగానే నాకు భయం వేసింది, ఏడుపొచ్చేసి అలా పిలిచేసాను నాకూ తెలీదు..
అను : కానీ బలే అనిపించింది బావ నువ్వలా పిలిస్తే… నువ్వు అమ్ములు అనగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి, ఇందాకటి కంటే ఇది ఎక్కువ సుఖాన్ని ఇచ్చింది బావ.. మనం జీవితాంతం ఇలాగే ఉంటాంగా?
అనూని దింపి.. నీకు నాకు ఇంకా పెళ్లి కాలేదు అనూ కానీ నా దృష్టిలో ఎప్పుడైతే నీకు ముద్దు పెట్టానో అప్పుడే నిన్ను నా భార్యగా చూడటం మొదలు పెట్టాను, ఎన్ని కష్టాలొచ్చినా ఆఖరికి మనం దూరం అయిపోయినా నిన్ను వదలను ఎప్పుడూ నీకు దెగ్గరగానే ఉంటాను.
అను నుదిటి మీద ముద్దు పెట్టి నాన్నకి ఫోన్ చేసి అను భుజం పట్టుకుని చిన్నగా నడిపించాను…
ఈలోగా నేను మెట్లు ఎక్కేసాను కానీ ఒక్కటి, ప్రమాణం గుర్తొచ్చిన తరువాత ఇక అనూని చూడకుండా ఉండలేను ఎవరెవరి కోసమో అనూని దూరం పెట్టి నేను బాధ పడుతూ తనని బాధ పెడుతూ ఇక నా వల్ల కాదు వెళ్లి అనూ దెగ్గరికి వెళ్ళిపోటానికి నిశ్చయించుకున్నాను, ఈలోగా వచ్చిన పని పూర్తి చెయ్యాలి.
దర్శనం చేసుకుని కిందకి బస్సు లొ వచ్చి రూమ్ చెక్అవుట్ చేసి బండి తీసి నానస్టాప్ విజయవాడ వరకు ఎక్కడా ఆపకుండా కొట్టాను… మధ్యలో గుంటూరు వరకు రాగానే నేను బండి రెండు అలిసిపోయాము అందుకే గుంటూరులొ ఆగల్సొచింది… అక్కడ తినేసి ఒక స్లీప్ వేసి మళ్ళీ విజయవాడ మీదగా ఏలూరు దాటి రాజమండ్రి లొ ఆగాను రేపే పదిహేనో తారీకు ఈలోగా వెళ్ళిపోవాలి అని తినేసి పడుకున్నాను…
