ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుతూ వెళ్లారు.. పేషెంట్ ని చెక్ చేసి బండేజ్ కట్ చేసి వేసిన కుట్లు చూసి నవ్వు పోయి ఆశ్చర్యం వేసింది.
అనురాధ : ఎవరు ట్రీట్మెంట్ చేసింది?
రాము : ఏమైంది మేడం ఏమైనా ప్రాబ్లెమా?
అనురాధ : లేదు అంతా ఆలరైట్ కానీ ఈ కుట్ల పద్ధతి ఇక్కడిది కాదు కొరియాలో వేస్తారు ఇలా అందుకే అడిగాను, ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కి వయసు ఒక యాభై నుంచి అరవై మధ్యలో ఉంటుందా?
స్వప్న : దేనికి డాక్టర్ అతని వయసుతో మనకి పనేంటి?
అనురాధ : లేదు ఇండియాలో ఈ పద్ధతిలో కుట్లు వేసేవారు ఒక్కరే ఉన్నారు ద గ్రేట్ రామనాధం గారు, ఆయనేమైనా చేశారేమో అని అడిగాను.
రాము : లేదు మేడం అన్న చాలా యంగ్, హీరోలా ఉంటాడు అన్న… మేడం అన్న కుట్లు వేస్తున్నప్పుడు ఫుల్లుగా తాగి ఉన్నాడు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేస్తారా?
అనురాధ ఆశ్చర్యంగా : తాగి కుట్లు వేసాడా, ఇంత డెలికేట్ సర్జరీని తాగి చేశాడా?
మాలతి ఎందుకైనా మంచిది ఒక సారి స్కాన్ చేసి లోపల లీకేజీ ఉందొ లేదో కంఫర్మ్ చేయండి.
రాము : అవును మేడం అన్న ఆపరేషన్ చేసినప్పుడు మీ దెగ్గరున్న లాంటి ఏక్విప్మెంట్ కూడా లేదు చీకటిలో ట్యూబ్ లైట్ కింద ఆపరేషన్ చేసాడు, మకైతే అసలు రక్తంలో ఏం కనిపించలేదు అన్న ఎలా చేసాడో మరీ.
రాము చెప్పిన దానికి మాలతి, స్వప్న షాకింగ్ గా చూసారు..
స్వప్న : మేడం తను చెప్పింది నిజమేనా? అలా జరుగుతుందా అస్సలు..
అనురాధ : నాకు మాత్రం ఏం తెలుసు నేను ఇదే ఫస్ట్ టైం ఇది వినడం.
మాలతి : అంతా ఓకే మేడం ఎవరీథింగ్ ఈస్ ఫైన్.. సెలైన్ ఎక్కించాను.. త్వరలోనే స్పృహ రావొచ్చు..
అనురాధ : విన్నావుగా ఇక నిశ్చింతగా ఉండు, తనకీ ఎటువంటి ప్రమాదము లేదు, ఇంతకీ మీ హీరో అన్న పేరేంటి?
రాము : అడగలేదు మేడం తనని ఎటాక్ చెయ్యడానికి వెళ్తే తనే కొట్టాడు, మేము స్టూడెంట్స్ అని కాలేజీ ఫీ కట్టడానికి ఈ పని ఒప్పుకున్నాం అని చెప్తే ట్రీట్మెంట్ చేసి ఫీ కట్టాడనికి డబ్బులు కూడా ఇచ్చాడు.
అనురాధ : గ్రేట్.. ఏమయ్యా మీ కోసం అంత చేస్తే కనీసం పేరు తెలుసుకోకుండా వచ్చేసావా?
రాము : మా అన్నయ్య టెన్షన్ లో పడి అది కాక కిడ్నాప్ అయిన అమ్మాయిలని ఎవరిళ్ళకి వాళ్ళని పంపించే పనిలో పడి మర్చిపోయాను.
అనురాధ : ఏంటి కిడ్నాపా?
రాము : అదేం లేదు మేడం ఏదో వచ్చేసింది వదిలెయ్యండి.
అనురాధ : మొత్తం చెప్పకపోతే సెక్యూరిటీ ఆఫీసర్లని పిలుస్తా అప్పుడు మీ హీరో అన్నని కూడా బొక్కలో వేస్తారు.
రాము జరిగింది అంతా చెప్పాడు…రాము చెప్పింది అంతా విని తన కేబిన్ లోకి వచ్చి కూర్చుని అలోచించింది…ఒక తాగుబోతోడు అంత మందిని కొట్టడమే కాకుండా ఒక డెలికేట్ ఆపరేషన్ అదీ చీకట్లో సరైన ఏక్విప్మెంట్ లేకుండా బార్ లో చేశాడా నమ్మబుద్ధి కావట్లేదు..
వెనకే వచ్చిన నర్సులు ఇద్దరు దీని గురించే మాట్లాడుకుంటూ వచ్చి అనురాధ ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు.
అనురాధ : ఇంకా మాలతి పెళ్లి ఎప్పుడు?
మాలతి : అది మేడం నేనే చెపుదామనుకున్నాను కానీ ఇంతలో..
అనురాధ : పర్లేదు ఎనీవే కంగ్రాట్స్.. పార్టీ ఎక్కడో చెప్తే వచ్చేస్తాం, ఏమంటావ్ స్వప్న..
స్వప్న : అంతే… మీరెలా అంటే అలా..
