మాలతి : హలో ఎవరు?
ఆదిత్య : తనకీ ట్రీట్మెంట్ చేసింది నేనే…. 1.5ml magnesium సెలైన్ లో ఇవ్వండి సరిపోతుంది.
మాలతి : మీరు చెప్పినంత మాత్రాన నేను అలా చెయ్యలేను ముందు డాక్టర్ తొ మాట్లాడాలి… అని ఫోన్ రాముకి ఇచ్చి స్వప్న దెగ్గరికి వెళ్ళింది.
స్వప్న : హలో మేడం నిన్న జాయిన్ అయిన పేషెంట్ కి ఫీడ్స్ వచ్చింది, ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు.
అనురాధ : నాకు ఫోన్ చేసారుగా ఏం చెయ్యాలో మీకు తెలుసు….1.5ml magnesium సెలైన్ కి ఇవ్వండి సరిపోతుంది…
స్వప్న : అలాగే…
రాము ఆదిత్యకి ఫోన్ చేసాడు..
ఆదిత్య : చెప్పు రాము… ఇప్పుడెలా ఉంది.
రాము : అంతా ఓకే అన్నా థాంక్స్..
ఆదిత్య : పర్లేదు..
రాము : అన్నా నీ పేరేంటి?
ఆదిత్య : ఎందుకురా నీకు నా ఊరు పేరు చెప్పను, అన్నా అని పిలుస్తున్నావ్ కదా అలానే పిలు..
రాము : అలాగే..
ఆదిత్య : రాము నాకొక హెల్ప్ చేస్తావా?
రాము : చెప్పన్నా నీకోసం ఏమైనా చేస్తాను.
ఆదిత్య : అంతొద్దులే కానీ అక్కడ అనురాధ అనే డాక్టర్ ఉంటుంది తన ఫోటో తీసి పంపిస్తావా?
రాము : ఓస్ అంతేనా నిమిషాల్లో పని అయిపోద్ది, కాకపోతే ఇంకా డాక్టర్ రాలేదు… రాగానే పంపిస్తా..
ఆదిత్య : ఈ విషయం..
రాము : ఎవ్వరికీ తెలియనివ్వను..
ఆదిత్య : థాంక్స్..
రాము : అన్నా అనురాధ మేడం మీకు… అంటే నాకు వదిన అవుద్దా..
ఆదిత్య : అవును కానీ విడిపోయాం.
రాము : నేను కలుపుతా కదా మీ ఇద్దరినీ…నాకొదిలేయ్ నేను చూసుకుంటా
ఆదిత్య : నీకో దండంరా బాబు, అలాంటి పనులు చేసి శాశ్వతంగా దూరం చెయ్యకు చెప్పింది చెయ్ చాలు.
రాము : అలాగే…
అనురాధ ఎందుకైనా మంచిది అని హాస్పిటల్ కి వెళ్ళింది…
అనురాధ : ఇప్పుడు ఎలా ఉంది.
స్వప్న : బానే ఉన్నాడు…
మాలతి : కానీ మీరు చెప్పక ముందే తను అదే చెప్పాడు, నేనే వినిపించుకోలేదు.
