అనురాధ : వినాల్సింది… ఆపరేషన్ చేసినవాడికి ఆ మాత్రం తెలీదా…
పన్నెండింటి వరకు తిరుపతి చేరుకున్నాను రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి తిరుపతి మెట్లు ఎక్కుదామని మొదటి మెట్టు మీద కాలు పెట్టాను……..
మొదటి మెట్టు ఎక్కుతుండగా అనూ నేను మా వాళ్ల నుంచి తప్పించుకోడానికి వేసిన ప్లాన్స్ గుర్తొచ్చాయి.
మావయ్య : పదండి పదండి ఇప్పటికే లేట్ అయ్యింది త్వరగా ఎక్కాలి..
సరిత : వస్తున్నాం అండి ఎందుకు అంత తొందర.
అందరం సెవెన్ సీటర్ కార్ ఎక్కి కూర్చున్నాం తిరుపతి వరకు సగం మావయ్య నడిపితే మిగతా సగం నాన్న నడిపారు..
ముందు రెండు సీట్లు నాన్న, మావయ్య
మధ్యలో అమ్మా, అత్తయ్య.
చివరిగా నేను అనూ..
ఆదిత్య : నాన్న నాకు ఇవ్వచ్చుగా డ్రైవింగ్, కొంచెం సేపు నేనూ డ్రైవ్ చేస్తా…
అను : అప్పుడు గాని డైరెక్ట్ గా దేవుడి దెగ్గరికే వెళ్ళిపోము.
అందరూ నవ్వారు..
“ఎందుకే నీకు” అని నసిగాను… “మరీ నాతో ఉండరా అంటే ముందుకు వెళ్తా అంటావ్, కూర్చో” అని గోనిగింది.
సరిత : తిట్టుకోకండి, మెలకుండా కూర్చోండి..
తిరుపతి చేరుకునే సరికి రాత్రి అయ్యింది, పైన రూమ్స్ కాళీ లేకపోయే సరికి కిందే తీసుకున్నాం, ఇవ్వాళ అనూ నాతో పడుకోలేదుగా నాకస్సలు దాని స్పర్శ లేకుండా నిద్ర పట్టలేదు… అటు ఇటు మెసులుతూనే ఉన్నా..
పొద్దున్నే ఐదింటికే లేచి అందరం బైలుదేరాం, మెట్లు దెగ్గరికి వస్తుండగా అనూని గిల్లాను.
అను : మావయ్య నేను మెట్లు ఎక్కి వస్తా..
నాన్న : వద్దమ్మా ఎక్కలేవు..
అను : లేదు మావయ్య మా ఫ్రెండ్ చెప్పింది పొద్దున్నే మంచు, జింకలు అన్నీ కనిపిస్తాయట ప్లీజ్ మావయ్య.
నాన్న : ఏమంటారు అందరూ మెట్లు ఎక్కుతారా?
సరిత : వామ్మో మా వల్ల కాదు మమ్మల్ని వదిలెయ్యండి కావాలంటే మీరు వెళ్ళండి.
నాన్న : ఏరా నువ్వు?
మావయ్య : ఈ పొట్ట ఏసుకుని ఎక్కగలనా బావా?
నాన్న : ఎక్కురా ఆ కొండ ఎక్కుతే ఈ కొండ తగ్గుద్ది.
సరే మీరు ఇక్కడే ఉండండి నేనెళ్ళి చూసి వస్తా, రేయ్ రండి ఇద్దరు.
ఆదిత్య : నేను రాను.
నాన్న : రా నీతో ఒక మాట చెప్తా..
బండి దిగి “ఏంటి నాన్నా?”
నాన్న : ఇద్దరు మెలకుండా మెట్లు ఎక్కండి ఎక్కువ బెట్టు చేస్తే దొరికిపోతారు ఆ తరువాత మీ ప్లాన్ ఫెయిల్ అవుద్ది.
ఆదిత్య : అయోమయంగా గట్టిగా నవ్వుతూ “ఏం ప్లాన్ ఏం ఫెయిల్ నాకేం అర్ధం కావట్లా?”
నాన్న : అనూ.. వాడు దొరికిపోయాడు ఇక నువ్వే.. మీరిద్దరు కలిసిపోయారు కదా…
