ఆది – Part 3 242

సరిత : గుడ్ నైట్ బంగారం.

ఆదిత్య : గుడ్ నైట్.

లైట్ ఆపి డోర్ దెగ్గరికేసి వెళ్ళిపోయింది, రాత్రంతా రూం నుంచి బైటికి, లోపలికి ఒక పది సార్లు తిరిగుంటాను, తెల్లారి ఎగ్జామ్స్ లేచి రెడీ అయ్యాను బండి ఎక్కి స్టార్ట్ చేసాను అను వచ్చి మెలకుండా వెనక కూర్చుంది.

మంజుల : అనూ బ్యాగ్ మధ్యలో పెట్టి కూర్చో

ఆదిత్య : (నాకు సర్రున కాలింది) ఎందుకు నువ్వొచ్చి మధ్యలో కూర్చోవే సరిపోద్ది.

మంజుల : రేయి వచ్చానంటే తన్నులు పడతాయి.. మూసుకుని పొ.

బండి ముందుకు పోనిచ్చాను, అను గట్టిగా వాటేసుకుంది పక్కకి ఆపి బండి దిగాను అస్సలు నన్ను వదలటం లేదు బలవంతంగా తన తల ఎత్తాను కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.

ఆదిత్య : అమ్ములు ఇటు చూడు, ఏడవకు నేనేదో ఒకటి చేస్తాగా అలా ఏడిస్తే ఎలాగే, చూడు కళ్ళ కింద నల్లగా అస్సలు నిద్ర పొవట్లేదా నువ్వు.. పదా వెళదాం చూడు రోడ్డు మీద అందరూ మనల్నే చూస్తున్నారు పదా అని బుజ్జగించి మళ్ళీ బండి ఎక్కించి కాలేజీకి వెళ్లిపోయాను.

ఇంట్లో..

సరిత : వదినా వదిలేయ్యకూడదు చూడు ఇద్దరి మొహాలు ఎలా మాడిపోయాయో.

రాజు : అవునే, చూడు అస్సలు నా కోడలు నవ్వి ఇవ్వాల్టికి మూడు రోజులు.

మంజుల : ఆ ఇలాగే వెనకేసుకు రండి, ఇప్పుడు వాళ్ళకి అంత వయసేం అవ్వలేదు, వాళ్లే అర్ధం చేసుకుంటారు మీరు కామ్ గా ఉన్నోళ్ళని రెచ్చగొట్టకండి.. అని లోపలికి వెళ్ళిపోయింది.

ఎగ్జామ్ రాసి బైటికి వచ్చేసరికి అనూ నాకోసం ఎదురుచూస్తుంది. బండి తీసాను.

అను : బావ, ఇంకెన్ని రోజులు ఇలాగా

ఆదిత్య : వారంలోపు నిన్ను నన్ను వాళ్లే కలపక పోతే.. చూడు నువ్వే చూస్తావుగా

అను గట్టిగా వాటేసుకుంది చిన్నగా తనతో మాటలు కలిపాను డల్ గానే ఉంది నాకంటే ఎక్కువ బాధ పడుతున్నట్టుంది, ఇద్దరం బైట ఐస్ క్రీం తినేసి ఇంటికి వెళ్లిపోయాం. ఇంటికి వెళ్ళగానే అమ్మ ఎదురు వచ్చి మమ్మల్నే చూస్తుంది, కోపంగా చూసాను.

మంజుల : ఏది చేసినా మీకోసమే అని అర్ధం చేసుకోండి ఆ మూర్ఖుడికి చెప్పినా అర్ధం కాదు నువ్వైనా అర్ధం చేసుకోవే ఎప్పటికైనా మీ పెళ్లి జరగక మానేనా చెప్పండి అప్పుడు అస్సలు మీ దెగ్గరికి కూడా రాను నేను.

ఈ సోది వినలేక లోపలికి వెళ్ళిపోయాను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే బ్రహ్మాండమైన ఆలోచన ఒకటి తట్టింది మంజులా కాసుకోవే నీ సంగతి చెప్తా ఇవ్వాల్టి నుంచి.

సరిత : ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసారు?

అను ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది, అత్త పిలిచినా పలకలేదు. అత్త నన్ను చూసింది.

ఆదిత్య : బానే రాసాను అత్తా, ఆకలేస్తుంది ముందు అన్నం పెట్టు.

సరిత : ఫ్రెష్ అయ్యి రా, ఈలోగా వడ్డిస్తాను దాన్ని కూడా పిలు.

ఆదిత్య : అలాగే.. అని ఫ్రిడ్జ్ లో వాటర్ తాగి చిన్న ఐస్ క్యూబ్ తీసుకుని అత్తయ్య వాళ్ల రూంకి వెళ్లి అనుని చూసాను ముభావంగా కూర్చుని ఆలోచిస్తుంది.. వెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టాను.

1 Comment

  1. హలో పబ్లిషార్ నివ్వు ఎం స్టోరీస్ పెడుతున్నావు.. సెక్స్ స్టోరీస్ టైటిల్ పెట్టుక్కని లవదా లో స్టోరీస్ పోస్ట్ చేస్తున్నావు

Comments are closed.