ఆది – Part 4 132

నేను అను ఇద్దరం ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాము, సౌండ్ వస్తుందని చూస్తే ఇంట్లో ఏదో కార్పెంటర్ వర్క్ జరుగుతుంది. వెళ్లి చూసేసరికి అందరూ హాల్లోనే కూర్చున్నారు.

మేము మామూలుగానే వెళ్లి పక్కన కూర్చుని పలకరించాము.

మంజుల : రేపటి నుంచి హాలిడేస్ కదా ఇక మమ్మల్ని ఫుల్లుగా టార్చర్ చెయ్యడానికి ఏమేమి ప్లాన్స్ వేసుకున్నారు.

అను : అలా ఏం లేదే.. ఏ బావా

ఆదిత్య : ఏం మాట్లాడుతున్నవే పిచ్చి లేసిందా, దా నాకు కధలు చెప్పుదూ నిద్ర వస్తుంది పడుకుందాం.

రాజు : రేయి ఆది మా వల్ల కాదురా ఇంక, మీ రూంలో మీరు ఉండండి మా రూంలో మేముంటాం.

ఆదిత్య : ఏంటమ్మా అంతేనా, నాకు ఇష్టం లేదే

మంజుల : ఓవరాక్షన్ చెయ్యకింక, అయినా ఈ నాలుగు రోజులే తరువాత మీ ఇద్దరిలో ఒకరు హాస్టల్లో ఉండాలి, ఎవరు ఉంటారో ఎవరు హాస్టల్ కి వెళతారో మీరే నిర్ణయించుకొండి.

అను కోపంగా లేచి నిల్చుది.. అందరూ అను వైపు చూసారు.

అను : నేనే పోతాను హాస్టల్కి ఇప్పుడే పంపించేయ్యండి.. అని లేచింది ఏడుపు మొహం పెట్టుకుని.

రాజు : రేయి అందరూ కలిసి నా తల్లిని ఏడిపిస్తున్నారా, ఊరికే అన్నాంరా నువ్వు నీ బావతోనే ఉండు సరేనా, నా బంగారం కదూ ఇలా ఏడిస్తే అస్సలు బాలేదు, వారం రోజుల నుంచి నీ నవ్వు మొహం కనిపించకపోయేసరికి నాకు ఒక్క పని కూడా సరిగ్గా అవ్వట్లేదు అన్ని చికాకు చికాకుగా ఉంటున్నాయి, అందరికీ చెప్తున్నా వినండి నా తల్లిని ఏడిపిస్తే ఊరుకోను చెప్తున్నా. ఇక పో నీ బట్టలు పుస్తకాలని తీసుకుని నీ రూంలోనే ఉండుపో.

మంజుల : వీడ్ని చూడండి, ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు సంబరంగా ఉంది అయ్యగారికి, దున్నపోతా మొత్తానికి వీళ్ళ పంతం నెగ్గించుకున్నారు.

సరిత : నేను ముందే చెప్పా, వద్దు వదినా అని నువ్వు నా మాట వింటే కదా

ఆదిత్య : మా మంచి అత్తయ్య.. అని వాటేసుకున్నాను.. అను ఆనందంగా లోపలికి వెళ్ళింది బట్టలు పుస్తకాలు ఆదిత్య రూంలో పెట్టుకోడానికి. మావయ్య నాన్నలు బైటికి వెళ్లిపోయారు నవ్వుకుంటూ.

సరిత : రేయి అల్లుడు, జాగ్రత్త ఇద్దరు కొంపలు మునిగే పని చేసి మాకు చెడ్డ పేరు తేవద్దు, తల దించుకునేలా అస్సలు చేయొద్దు.

ఆదిత్య : అలాగేలే..

మంజుల : ఈ ఆంబోతుకి కాదు చెప్పాల్సింది, దానికి చెప్పు జాగ్రత్తలు.. ముందు ఆ టీ షర్ట్లు, జీన్స్ మానిపించి సుబ్బరంగా చుడిధార్ కుట్టించు.

ఆదిత్య : టీ షర్ట్లు జీన్స్ ఏ బాగుంటాయె.. చుడిధార్లు అయితే…

సరిత : అయితే..

ఆదిత్య : అయితే.. అమ్మా రాత్రికి ఏం కూరా..

మంజుల : వీడ్ని పట్టుకొని నువ్వు చిన్న పిల్లాడన్నావు..

సరిత : రేయి నాకు భయంగా ఉందిరా, నాకెందుకొ హాస్టల్ ఆప్షన్ బెటర్ అనిపిస్తుంది.

వెంటనే అమ్మని అత్తయ్యని వాటేసుకున్నాను.

మంజుల : చూడు ఇక కాకా పడతాడు..

ఆదిత్య : అమ్మా, అత్తయ్య నిజంగా అను ఈవారం నా పక్కన లేకపోతే నాకస్సలు పిచ్చి లేచిందే, మీరు ముందే మమ్మల్ని కొంచెం దూరంగా ఉంచాల్సింది, అను నా పక్కన లేకుండా నేనస్సలు ఉండలేను..

సరిత ఆదిత్య మొహం పైకి ఎత్తి “రేయి ఏడుస్తున్నావా, లేదు నాన్నా మీరిద్దరు కలిసి ఉంటే అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది చెప్పు, చూడు వదినా అందరం కలిసి ఏడిపించేసాము, చిన్నప్పుడు పాలకి కూడా ఎప్పుడు ఏడవలేదు నా అల్లుడు.. అలాంటిది వాడి కంట్లో నీళ్లు తెప్పించాము..” అని చీర కొంగుతో ఆదిత్య కళ్ళు తుడిచింది.. మంజుల కూడా ఆదిత్య తల నిమిరింది, అనురాధని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసి.

ఇంతలో అను కోపంగా ఆదిత్య ముందుకు వచ్చి “బావా వీళ్ళు మన రూం డోర్ తీయించేస్తున్నారు, అందుకే మనం ఒకే రూంలో ఉండడానికి ఒప్పుకున్నారు” అని అంది.

నేను అత్త వైపు చూసాను, సరిత నవ్వుతూ “సారీ.. మీ అమ్మని అడుగు నాకేం సంబంధం లేదు” అంది. అమ్మని చూస్తే కిచెన్ లోకి వెళ్ళిపోయింది లేచి అమ్మ వెనకాల వెళ్ళాను. అను అత్తయ్యతొ పొట్లాడుతుంది. లోపలికి వెళ్లి అమ్మ పక్కన నిల్చుని కోపంగా చూసాను..