ఆది – Part 4 163

సరిత : నేను చూసుకుంటాను

ఆదిత్య : నీ మొహం చూసుకుంటావ్..

సరిత : తిట్టు నీ అయ్య తిట్టాడు, నువ్వు కూడా బూతులు తిట్టు మా దెగ్గర డబ్బులు లేవనే కదా.. ఇన్ని రోజులు మమ్మల్ని పనోళ్ళలా వాడుకున్నారు ఇప్పుడు వదిలించుకున్నారు.

ఆదిత్య : అస్సలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధం అవుతుందా, నువ్వు దూరం చేసుకుని మాట్లాడతావేంటి.. ముందా ఏడుపు ఆపు నువ్వేడుస్తుంటే నా వల్ల కావట్లేదు.. ఇప్పుడేంటి నీకు ఆస్తి కావాలా అంతేనా, ఆస్తి మొత్తం నీ పేరున రాస్తే ఇదివరకులా మాతో ఉంటావా

సరిత : నేనేం అడుక్కుతినే దాన్ని కాదు, ఎవరి కాళ్ళ మీద పడి అడుక్కు తినాల్సిన అవసరం అంత కంటే లేదు అని కోపంగా కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయింది.

ఆదిత్య : ఆగు నేను వదిలిపెడతాను

సరిత : అవసరం లేదు అనుని వదిలేయి చాలు..

ఆదిత్య : మతి లేని పనులు చేస్తున్నావ్ అత్తా, దీని వల్ల నువ్వు సంతోషంగా ఉంటాననుకుంటున్నావో లేదా మీ అన్న మీద కక్ష సాధింపో నాకు తెలీదు కానీ అందరం బాధ పడతాం..

అత్త నా మాట పట్టించుకోలేదు.. నాకేం అర్ధము కాలేదు.. వెంటనే అమ్మకి ఫోన్ చేసాను..

మంజుల : ఏమైంది?

ఆదిత్య : అనుని తీసుకుని ఇంటికి వచ్చేస్తాను ఏం జరిగితే అది జరుగుద్ది.

మంజుల : ఇంకా పెద్ద గొడవ అయిపోద్ది నాన్నా.. బైట వాళ్లు అయితే తిట్టుకున్నా కొట్టుకున్నా కొన్ని రోజులకి పోద్ది.. కానీ ఇది చాలా సెన్సిటివ్.. నువ్వు చేసే పని వల్ల అన్నా చెల్లెళ్ళు శాశ్వతంగా దూరం అయిపోతే అప్పుడు.. కొన్ని రోజులకి ఈ కోపాలు అన్ని చల్లారి పోతాయి అనుని నీ నుంచి ఎవ్వరు లాగేసుకోరు ఒక వేళ అనుని వేరే వాడికి ఇచ్చి చెయ్యాలని చూస్తే నేనే వెళ్లి నా కోడలిని తెచ్చుకుంటాను.. ముందైతే నువ్వు వచ్చేయి.. అందరం కలిసి ఆ పసిదాన్ని ఏడపిస్తున్నాం.

ఆదిత్య : లేదు.. నేను ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరిగితే అది అనుతొ పాటే.. తప్పు మీ వైపు కూడా ఉంది ఇంట్లో ఉన్న ఆడపిల్లని బైటకి పంపించేసాడు.. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఇంట్లో లక్ష్మి బైటికి పోతే మళ్ళీ రాదని ఆయనకి తెలియదా.. అంత కోపం దేనికి.. అందరూ అనుభవించాలి నా అనుని ఏడిపించే అందరూ ఎడవండి.. ఆయనే చెప్తుంటాడు కదా నా కోడలు నవ్వితేనే నాకు ప్రశాంతం అని.. అంతా అయిపోయాక ఇవన్నీ అనవసరం.. ఉంటా బై.

మంజుల : ఎక్కడికి వెళతావ్ రా

ఆదిత్య : ఏడవకు.. నేనేం చావను కొన్ని రోజులు దూరంగా ఎటైనా వెళతాను అంతే.. అని ఫోన్ పెట్టేసాను.. అదీ జరిగింది..

అను ఏడుస్తూ గట్టిగా వాటేసుకుంది.. అంతే గాడంగా ముద్దు పెట్టుకున్నాను..

అను : నాకు తెలుసు ఇదే జరిగి ఉంటుందని నేను ఊహించాను.. ఆరోజు మధ్యాహ్నం నువ్వు కాలేజీకి వచ్చి నాతో మాట్లాడావ్ గుర్తుందా నాకు అప్పుడే అనుమానం వచ్చింది నువ్వు పని ఉందని వెళ్లిపోయావ్.. ఇక నేను అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాను.. ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ సాయంత్రం వరకు టెన్షన్ గానే కూర్చున్నా అప్పుడె నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చేసాడు ఆయన కోపం చూసి ఏం మాట్లాడలేదు కానీ ఇంటికి వచ్చాక అమ్మ చెప్పింది గొడవలు అని విడిపోయాం అని.. అమ్మతో గొడవేసుకున్నాను..