ఆది – Part 4 157

సరిత : ఎక్కడికి?

అను : బావ దెగ్గరికి

సరిత : కాళ్ళు విరుగుతాయి, మాట వినకపోతే

అను : దేక్కుంటూ పోతాను, బావని వదిలి ఉండే ప్రసక్తే లేదు.. నేను వెళుతున్నా

రవి : ఏయ్ చెపితే అర్ధం కావట్లేదా, గారాబం చేసి చెడదెంగారు అంతా కలిసి.. ఇది నీ మావయ్య ఇల్లు కాదు నాది.. నేను చెప్పినట్టే జరగాలి.

అను : బూతులు వినేసరికి భయం వేసింది కానీ తగ్గలేదు, ముందు నేను బావతో మాట్లాడాలి

సరిత : మాట్లాడుకో

అను : స్విచ్ ఆఫ్ వస్తుంది, అత్తకి చేస్తాను.. హలో అత్తా బావ ఎక్కడా

మంజుల : ఏమో నాకు తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎటు వెళ్ళాడో మీ అమ్మ చెప్పలేదా.. పొద్దున వాడిని కలిసింది తననే అడుగు అని ఏడుస్తూ పెట్టేసింది.

అను : ఏం చెప్పి పంపించావ్

సరిత : నేనేం చెప్పలేదు, అందరం విడిపోయాం అని చెప్పాను, ఇప్పుడు నిన్ను వదిలేసి పోయాడు ఇంకెందుకు.. ఇక మూసుకుని లోపలికి పో.

అను : అబద్ధం

సరిత : అయితే వెళ్లి వెతుక్కో.. ఎక్కడున్నాడో నిన్ను వదిలేస్తున్నానని చెప్పి మరి వెళ్ళిపోయాడు.

అను : నీకు చెప్పాడా?

సరిత : అవును..

అను : నువ్వు అబద్ధం చెప్తున్నావ్, వాడు ఎప్పటికి అలా చెయ్యడు..

సరిత : ఇక నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే కాలేజీలో చదువుకో, బెంగుళూరు అన్నిటికి బానే ఉంటుంది..

అను : నేను ఇక్కడ ఉండను, బావ లేకపోతే మీరెవ్వరు నాకు అవసరం లేదు, నన్ను అక్కడే హాస్టల్లో జాయిన్ చెయ్యండి.. ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను.

సరిత : కుదరదు.. నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే.

ఇంతలో జయమ్మ కలిపించుకుని “అది చెప్పినట్టే చెయ్యండి కొంత కాలం దానికి కూడా అలవాటు పడుతుంది, మరీ బెట్టు చేస్తే చేతికి అందకుండా పోతుంది” అని చిన్నగా అంటూనే అను దెగ్గరికి వెళ్లి “అనూ.. నీ ఇష్ట ప్రకారమే చేద్దువు ముందు ఏమైనా తిందువు పదా మొహం కడుక్కో.. చూడు ఏడ్చి ఏడ్చి మొహం ఎలా కందిపోయిందో”

అను : నువ్వు నా దెగ్గరికి రాకు, పచ్చగా ఉండే కాపురాలు నువ్వు అడుగు పెట్టగానే సర్వనాశనం అయ్యాయి.. అనగానే అను చెంప మీద్ద గట్టిగా పడింది రవి చెయ్యి..

జయమ్మ అందరి ముందు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుని దానికి ఆజ్యం పొసేసింది.. చూసారా ఎలా పెంచారో మీరు.. ఇదంతా ఆ మొగుడు పెళ్ళాల మహత్యం.. అదే నా సంరక్షణలో పెరిగుంటే ఇలా ఉండేదా, నా కింద పెరిగిన రమేష్ ఎప్పుడైనా ఇలా ప్రవర్తించడం మీరు చూసారా ఎంత మంచివాడు.

రవి : అను ఇదే ఆఖరి మాట.. వింటావా బలవంతంగా లోపలేసి గొళ్ళెం పెట్టమంటావా

అను ఏడుస్తూ కళ్ళు తుడుచుకుని బ్యాగ్ తీసుకుని ఇంటి బైట నిల్చుంది, కోపంగా