ఆది – Part 4 163

జయమ్మ : తల్లీ.. నేనేమనలేదే ఇదంతా నావల్లే, ఇంట్లోకి రావే.. సరిత నువ్వైనా చెప్పవే

అను : చెప్పాను కదా ఇంట్లో ఉండే సమస్యే లేదు, ఈ ఇంట్లో మంచినీళ్లు కూడా ముట్టుకోను నేను హాస్టల్ కి వెళ్లిపోతున్నా, మీరంతా నాకు దూరంగా ఉండండి.. అని బైటికి నడిచింది..

జయమ్మ వెంటనే ఫోన్ అందుకుని రమేష్ కి కాల్ చేసి “అరేయ్.. అనురాధ ఒక్కటే హాస్టల్ కి వెళుతుంది అక్కడి దాకా వదిలేసిరా” అని ఫోన్ పెట్టేసి వెంటనే రవి చెయ్యి పట్టుకుని ఏడవటం మొదలు పెట్టింది..

రవి : ఊరుకో అమ్మా, నువ్వు చెప్పినట్టే దానికి కొంచెం టైం ఇస్తే అదే సెట్ అవుతుంది.. నేను వెళ్లి హాస్టల్ దాకా దింపి వస్తాను.

జయమ్మ : వద్దులేరా మళ్ళీ నిన్ను చూస్తే కోపంలో ఎగురుతుంది, నీ అల్లుడు రమేష్ ఉన్నాడు వాడికి ఫోన్ చేసి తోడుగా వెళ్ళమని చెప్పు..