ఆది – Part 4 163

ఆదిత్య : మా మీద అస్సలు నమ్మకం లేనట్టుంది.

మంజుల : చూడు నాన్నా, ఈ ఇంట్లో అందరికంటే నా మనస్సాక్షి కంటే ఎక్కువగా నిన్నే నమ్ముతాను, కానీ ఇది కరెక్ట్ కాదు. అను నువ్వు ఏకమవుతే నాకంటే సంతోషించే వాళ్లు ఈ భూమ్మీద మరొకరు ఉండరు కానీ ఇలా ఉంటే అత్తయ్య ఏమనుకుంటుంది.. నీ మీద ఎంత ప్రేమున్నా అనురాధ తన కన్న కూతురు కదా..

ఆదిత్య : కానీ అత్తయ్యకి ఇష్టమే కదా.

మంజుల : అవును అత్తయ్యంటే మన మనిషి ఏమనుకోదు, మరి నీ రవి మావయ్య, తను కూడా అలా అనుకుంటాడని నేను అనుకోవట్లేదు.. ఏ తండ్రి పెళ్లి కాక ముందే ఇలాంటి నిర్ణయం తీసుకోడు, మనల్ని చూసి మౌనంగా ఉంటున్నాడంతే.. ఇవన్నీ నీకు చెప్పకూడదనే అనుకున్నాను కానీ నువ్వు నీ ప్రేమలో పడి ఇవన్నీ అర్ధం చేసుకోవట్లేదు.. నీకు కావాల్సిందే కాకుండా అన్ని ఆలోచించు నేను చేసేది తప్పా ఒప్పా అని నీకే అర్ధమవుతుంది.

ఆదిత్య : కొంత నిట్టూర్చినా అమ్మ చెప్పిన దాంట్లో వంద శాతం నిజం ఇంది.. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను ఇవేమి ఆలోచించలేదు అందరినీ బాధ పెట్టాను, సరే నువ్వు అనుకున్నట్టే చెయ్యి ఇద్దరం కొంచెం దూరంగానే ఉంటాంలే మా పెళ్ళైయ్యే వరకు.

మంజుల : అందరూ ఒప్పుకున్నారుగా, ఒకే రూంలో ఉండండి పరవాలేదు కానీ అందరి ముందు మాత్రం జాగ్రత్త… ప్రేమగానే ఉండండి కానీ కొంచెం డిస్టెన్స్ మైంటైన్ చెయ్యండి. ఇక డోర్ సంగతికి వస్తే నీకొక సీక్రెట్ చెప్పనా… అని నా చెవి దెగ్గరికి వచ్చి.. రాత్రి రెండున్నర నుంచి పొద్దున్న నాలుగున్నర వరకు ఏ మనిషి నిద్ర లేవడు, ప్రశాంతంగా పడుకునే టైం అది.. నేనేం చెప్తున్నానో అర్ధం అవుతుందా.

నేను నవ్వాను.. అమ్మని కౌగిలించుకుని సిగ్గు పడుతూ..

మంజుల : జాగ్రత్త తొందర పడకు.. ముఖ్యంగా ఈ వయసులో ఉన్న అమ్మాయిలకి కోరికలు ఎక్కువగా ఉంటాయి.. మీకు ఇంకా చాలా టైం ఉంది ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరిగితేనే ఒక అందం చందం.. జీవితానికి ఆనందం.. ఇది జ్ఞాపకం పెట్టుకో.

ఆదిత్య : అమ్మా.. రియల్లీ లవ్ యు మా.. నువ్వు చాలా గ్రేట్.

మంజుల : ఇక పో.. ఈ పొగడ్తలు, ఈ ముచ్చట్లు నీ పెళ్ళాంతొ పెట్టుకో. అని రెండు కప్పుల బూస్ట్ అందించింది.

…………………………………………………………………

సరిత : ఏంటే కంట్లో నుంచి పట పటా కారాయి కన్నీళ్లు, వాడంటే అంత ఇష్టమా..

అను : హహ..

సరిత : చెప్పూ…

అను : ఏమో తెలీదు, కానీ మీరు కావాలా బావ కావాలా అంటే అలోచించకుండా బావతో వెళ్లిపోయేంత ఇష్టం..

సరిత : అబ్బో.. అంటే వాడికోసం మమ్మల్ని వదిలేస్తావా

అను : కానీ నువ్వు నన్ను వదలవు, నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు.. థాంక్స్ మా..

సరిత : దేనికి?

అను : అన్నిటికి..

సరిత : సరే సరే.. అదిగో వస్తున్నాడు చూడు.

అను లేచి ఆదిత్య చేతిలో ఉన్న కప్ అందుకుని కూర్చుంది.

ఆదిత్య : ఇంకా అత్తా, ఈ సారి హాలిడేస్ కి ఎక్కడికి వెళదాం.

సరిత : అవును మర్చిపోయా, ఈ సారి హాలిడేస్ కి మనం వెళ్ళటం లేదు, ఊరి నుంచి మా అత్త వస్తుంది.

ఆదిత్య : ఎవరు?