ఆదిత్య : అమ్ములు.. నీ నుంచి దూరంగా ఉన్న ఇన్ని రోజులు నీకు చెప్పాలనుకున్న ఒకే ఒక్క మాట సారీ బంగారం.
అను : నాకోసం నువ్వు ఎప్పటికైనా వస్తావని తెలుసు బావ, కానీ నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావో అది మాత్రం నాకు చెప్పాల్సిందే.
ఆదిత్య : చెప్తాను, అని గట్టిగా వాటేసుకున్నాను.. సారీ బంగారం.. నిజంగా
అను : సరే సరే వచ్చేసావుగా ఏడవకు.. నన్ను ఏడపిస్తావ్ నువ్వు ఏడుస్తావ్.. అని కళ్ళు తుడిచింది.
ఆదిత్య : నా లైఫ్ ఇంతక ముందులా లేదు, ఎప్పుడు ఎవడు వచ్చి ఏసేస్తాడో తెలీదు.
అను : ఏంట్రా ఏదో ఇప్పుడే నీకు ప్రపోస్ చేసినట్టు చెపుతున్నావ్, చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను, ఉంటాను.. చావైనా నీతోనే అని నీకు తెలుసు కదా, ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను.. అస్సలు నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకు వెళ్లిపోయావో చెప్పు.. అంత దారుణంగా నన్ను వదిలేయ్యడానికి కారణం ఎవరు?
ఆదిత్య : అత్త వల్ల
అను : అమ్మ.. వల్ల, ఎందుకు?
ఆదిత్య : అనుని కూర్చోబెట్టాను.. నీకు గుర్తుందా మీ నాయనమ్మ వచ్చి మన దెగ్గర పది రోజులు ఉంది.
అను : అవును
ఆదిత్య : నాకు తరవాత అమ్మ చెప్పింది, ఒక రోజు మనం ఇద్దరం బైటికి వెళ్ళాక నాన్న మావయ్య మీద అరిచాడట, కారణం మావయ్య నాన్నకి చెప్పకుండా ఎవరితోనో చేతులు కలిపాడట వాళ్ళ దెగ్గర చౌక మెటీరియల్ తీసుకునేసరికి మనకి లాస్ వచ్చిందట.. నాన్న చూసుకోలేదట.. మావయ్య నాన్నకి చెపితే తిడతాడని చెప్పలేదట అది ఇంకో వ్యాపారం మీద ప్రభావం చూపించేసరికి నాన్న రికార్డ్స్ మొత్తం తిరగేస్తే అప్పుడు మావయ్య చేసినదాని గురించి తెలుసుకుని ఇంటికి వచ్చాక మావయ్య మీద అరిచాడట.. మరి ఏమైందో ఏమో అప్పటి నుంచి ఇంట్లో ముభవంగా ఉండేవారు.. నీకు గుర్తుండే ఉంటుంది.. అమ్మ మీ నాయనమ్మ హస్తం ఉండే ఉంటుంది అని అంది.
అను : అవును.. కానీ..
ఆదిత్య : ఇంకా అయిపోలేదు విను పూర్తిగా, మనల్ని హైదరాబాద్ లో రెంట్ కి ఉంచారు కదా కాలేజీలో జాయిన్ చేసాక, మన ఇద్దరిది కాపురం అయిపోయింది దాని వల్ల మీ నాయనమ్మ మావయ్యకి బాగా నూరిపోసింది. ఇంకోటేంటంటే మనల్ని అత్తయ్య ఎప్పుడు అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వమని బలవంతం చేసేది కదా
అను : అవును అమ్మ పోలేక మనల్ని వెళ్ళమనేది.. కానీ మనం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం దానికి అమ్మతొ పాటు ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు కదా
ఆదిత్య : పైకి ఒప్పుకుంది, కానీ లోపల చాలా బాధ పడింది.. మొండిది కదా దానికి తోడు నాన్న కూడా అమెరికా వద్దు ఒక్కగానోక్క వారసులు అందులో నన్ను నిన్ను వదిలి ఉండలేనని నాన్న కచ్చితంగా చెప్పేసరికి అత్తకి కోపం వచ్చిందట..
ఆ తరువాత కొన్ని రోజులకి మావయ్య నాన్నని పట్టుకుని డైరెక్టగా ఆస్తి పంపకాలు చేస్తే ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుందాం అని అన్నాడట, నాన్న అత్తయ్య మొహం చూస్తే అత్త ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి నాన్నకి ఇంకా కోపం వచ్చి ఆస్తి పంచేసాడు.. అత్తకి నాన్నకి మాటలు తగ్గాయాని చెప్పింది అమ్మ.. నాన్న కూడా చాలా బాధ పడ్డాడట.
అందుకే సెలవలకి మనం ఇక్కడే ఉంటాం మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి అంటే ఒప్పుకున్నారు కానీ ఆ తరువాత అది చాలా ముదిరింది.
అలా కొన్ని రోజులకి మావయ్య మాట మీద అత్తయ్య వాళ్లు మన ఇంటి నుంచి వెళ్ళిపోయి మీ నాయనమ్మ దెగ్గర చేరారు, మీ నాయనమ్మ నీ అత్త కొడుకు రమేష్ ఉన్నాడుగా వాడు అమెరికాలోనే సెటిల్ అవుతాడు వాడు కూడా డాక్టర్ అనేసరికి అత్తకి పంతం పుట్టిందో , మీ నాయనమ్మ మాటల్లో పడిందో ఏమో మాతో అస్సలు మాట్లాడడమే మానేసింది.
తరువాత ఎప్పుడో మన పెళ్లి విషయంలో నాన్న అత్తయ్య చాలా పెద్దగానే గొడవ పడ్డారని అమ్మ నాకు తరవాత చెప్పింది ఆ తరువాతే అనుకుంటా ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది.