ఆదిత్య : ఇంత జరుగుతుంటే నాకు ఒక్కమాట కూడా చెప్పలేదు మీరెవ్వరు
రాజు : అత్తకి ఏమని చెప్పావు
ఆదిత్య : ఏంటి చెప్పేది, అనుని వదిలే సమస్యే లేదు.. మొహం మీదే చెప్పేసాను.
రాజు : అది, అలానే ఉండు.. నాకు కోడలిగా వస్తే అనూనె రావాలి కావాలంటే లేపుకొచ్చేయి ఏం జరుగుతుందో నేనూ చూస్తాను.. ఇంతలో మంజుల రాజు చేతిలో నుంచి ఫోన్ లాక్కుంది.
మంజుల : ఆది.. వద్దు నాన్నా, వదిలేయి..
ఆదిత్య : అమ్మా నువ్వేనా
మంజుల : లేదు నాన్నా, ఇది తెగిపోయిన వ్యవహారం ఇప్పటికే మా కంటి మీద కునుకు లేదు, నువ్వు కూడా బాధ పడుతుంటే అది చూసి తట్టుకునే శక్తి మాకు లేదు..
ఆదిత్య : అను నుంచి దూరంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానా.. మమ్మల్ని విడదీసేంత గొడవ జరగడానికి ఇందులో ఏముంది మా.. ఆస్తులు పంచుకున్నారు, విడిగా ఉంటున్నారు ఒక మాట అనుకున్నారు అంతేగా
మంజుల : మాములు మాటలు అనుకోలేదు అన్నా చెల్లెళ్లు, గొడవ మామూలుదే కానీ మాట మీద మాట పెరిగి పెరిగి పుట్టుక నుంచి మొదలయ్యి వాళ్ళ అమ్మా నాన్న చావుల దెగ్గర నుంచి దరిద్రాలు కలలో కూడా అనుకొనన్ని మాటలు ఒకరినొకరు అనుకున్నారు ఇది అస్సలు అతకని వ్యవహారం..
ఆదిత్య : కానీ అమ్మా..
మంజుల : నేను చెప్పాల్సింది చెప్పను ఇక నీ ఇష్టం.. వదిలేయి నాన్నా మీ అత్త మాట్లాడే మాటలు నేను మళ్ళీ వినదలుచుకోలేదు.
ఆదిత్య : ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావ్
మంజుల : ముందు నువ్వు అక్కడనుంచి ఇంటికి వచ్చేసేయి..
ఆదిత్య : అది నన్ను నమ్మి ఆనందంగా కాలేజీకి వెళ్ళింది, వచ్చేవరకు నేను లేనని ఇక రానని తెలిస్తే అస్సలు నన్ను నమ్ముతుందా గుండె పగిలి చేస్తుందే..
మంజుల : మరి ఏం చెయ్యను చెప్పు నాన్నా, ఇన్ని రోజులు నేను బాధ పడింది ఇలాంటి ఒక రోజు రాకూడదని, కానీ నీ జీర గోంతే నన్ను ఎక్కువగా ఏడిపిస్తుంది.. ముందు ఇక్కడికి వచ్చేయి..
ఆదిత్య : ముందు అత్తతొ మాట్లాడనీ.. అని ఫోన్ పెట్టేసి బైట నిల్చున్న అత్తని లోపలికి పిలిచాను.
ఆదిత్య : ఎందుకత్తా ఇంత పంతం.. నీకు తెలుసు కదా మేము ఒకరిని విడిచి ఇంకొకళ్ళం ఉండలేమని.. మా కంటే నీకు నీ పంతమే ఎక్కువా
సరిత : అందరం బాధ పడుతున్నాం,
ఆదిత్య : అదే ఎందుకు, ఇంత బాధ దేనికి పడటం.
సరిత : నేను వెళ్ళాలి, బస్సుకి టైం అవుతుంది.
ఆదిత్య : చాలా మారిపోయావు
సరిత : నేను నిన్ను అమెరికా వెళ్ళమన్నాను కాదన్నావ్, ఇప్పుడు ఇంకోటి అడిగాను అనుని వదిలేయ్యమని.. నా మీద నిజంగా ప్రేమ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టకు, జరిగిందేదో జరిగిపోయింది.. ఇక వదిలేయి మమ్మల్ని..
ఆదిత్య : మరి అను సంగతేంటి?