దానికి నవ్వుతూ శేఖర్ “మనం వచ్చిన కేసు గురించే కాదు solve చేయాల్సిన కేసు గురించి కూడా అప్పుడే మొదలు పెట్టా” అన్నాడు ఆ తర్వాత కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు, బహదూర్ తో సెక్యూరిటీ అధికారి లు, మీడియా రాకముందే ఒక క్యాటరింగ్ వ్యాన్ వచ్చింది అప్పుడే అందులో ఒక ” కుర్రాడు కిందకి దిగి షూ తిసుకొని పారిపోవడం చూశాడు బహదూర్ “వాడు చాలా పక్కగా ఉర్దూ మాట్లాడుతూ ఉన్నాడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాళ్లు కూడా అంత స్వచ్ఛమైన ఉర్దూ మాట్లాడరు” అని చెప్పాడు దాంతో కృష్ణ వైపు చూస్తూ “get ready for a thrilling game bro” అన్నాడు అప్పుడు చంద్రిక వచ్చి “can I join in the game” అని అడిగింది దానికి శేఖర్ నవ్వుతూ సరే అన్నట్టు సైగ చేశాడు.
స్కూల్ కేసు అయిపోయిన తరువాత అందరూ కలిసి శేఖర్ ఆఫీస్ కీ వెళ్లారు అప్పుడు పొద్దున షూ మిస్ అయింది అని వచ్చిన అతని కూడా పిలిచారు ఆ తర్వాత శేఖర్ కృష్ణ నీ పిలిచి “నీ షూ ఎక్కడ మిస్ అయింది” అని అడిగాడు దానికి కృష్ణ “మార్నింగ్ బాబు నీ గుడికి తీసుకోని వెళ్లాము నేను ఎప్పుడు నా షూ జీప్ లోనే వదిలేస్తా ఆ తర్వాత గుడి నుంచి బయటకు వచ్చి శైలు బాబు నీ ఆటో ఎక్కించి తిరిగి జీప్ లోకి వెళ్లి చూస్తే షూ మిస్ అయ్యింది సెక్యూరిటీ అధికారి జీప్ లో సెక్యూరిటీ అధికారి షూ మిస్ అయింది అని అక్కడ గొడవ చేస్తే అంతగా బాగోదు అనిపించి వచ్చేశా” అని చెప్పాడు, అప్పుడు చంద్రిక “జీప్ లాక్ చేయలేదా” అని అడిగింది దానికి కృష్ణ డ్రైవర్ అక్కడే ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు డ్రైవర్ విప్పు చూస్తే పక్కనే టీ తాగడానికి వెళ్లా అని చెప్పాడు దానికి శేఖర్ సరిపోయింది అని అనుకున్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తి వైపు చూసి అడిగారు అతను ఇలా చెప్పాడు “సార్ నేను నా పాత షూ తెగిపోయాయి అని ఈ రోజు ఆఫీసు లో ఇన్స్పెక్షన్ ఉంది అని నిన్న సాయంత్రం అవి కొని ఇంటికి తెచ్చి ఉదయం ఆఫీస్ కీ బయలుదేరే సమయంలో చూస్తే తెచ్చిన కవర్ తెచ్చినటే ఉంది కానీ షూ మిస్ అయ్యింది” అన్నాడు, దాంతో శేఖర్ అటు ఇటు తిరుగుతూ ఆ షూ ఫోటో చూపించమని చెప్పాడు దాంతో కృష్ణ గూగుల్ లో ఆ ఫోటో తీసి చూపించాడు అది చూసి శేఖర్ “Friction కొత్త షూ కంపెనీ మామూలు షూ కంపెనీ లా కాకుండా వీలు 9 నుంచి 13 సైజ్ వరకు ఉండే షూ మాత్రమే తయారు చేస్తున్నారు ఎందుకంటే 11 సైజ్ వరకు తేలిక గా దొరుకుతున్నాయి కాకపోతే మిగిలిన సైజ్ అంత తేలిక కాదు ఒక వేళ కావాలి అంటే స్పెషల్ గా ఆర్డర్ ఇవ్వాలి ఆ ఖర్చు మిడిల్ క్లాస్ వాళ్లు భరించలేరు అందుకే వాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం వీలు ఈ షూ తయారు చేశారు ” అని చెప్పాడు దానికి చంద్రిక “సరే ఇది అంత పెద్ద ఇష్యూ కాదు షూ మిస్ అయితే అంత ఆలోచించాల్సీన పని ఏంటి” అని అడిగింది దానికి శేఖర్ “ఇది మామూలు షూ మిసింగ్ అయితే నేను పట్టించుకునే వాడిని కాదు కానీ అని బ్లాక్ కలర్, ఒకటే సైజ్, ఒకటే డిజైన్ దీనికి మించి ప్రిన్సిపల్ చనిపోయినప్పుడు వాడు అంత హడావిడి లో ఎడమ కాలు షూ నే తీసుకోని వెళ్లాడు అక్కడ నాకూ ఈ షూ కీ ఏదో కనెక్షన్ ఉంది అని అర్థం అయ్యింది” అని చెప్పాడు.
“అయితే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి” అని కృష్ణ అడిగాడు దాంతో శేఖర్ హాస్టల్ క్యాటరింగ్ దగ్గరి నుంచి అని చెప్పాడు అప్పటికే సాయంత్రం అయ్యింది దాంతో చంద్రిక తను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తా అని అంటే కృష్ణ, శేఖర్ కూడా తన ఇంటికి వెళ్లారు ఆ తర్వాత ఇంటికి వెళ్లాక చంద్రిక యునిఫామ్ మార్చుకోవడానికి వెళ్లింది అప్పుడు కృష్ణ తో శేఖర్ “మా బాబు నను ఐపిఎస్ చేయ్ ఐపిఎస్ చేయ్ అని దోబ్బుతుంటే పట్టించుకోలేదు ఇలాంటి కత్తి లాంటి ఫిగర్ లు కూడా ఐపిఎస్ లో ఉంటారు అని తెలిసి ఉంటే సింగిల్ అటెంప్ట్ లో క్రాక్ చేసే వాడిని” అని చెప్పాడు దానికి కృష్ణ ఒక చూపు చూసి “నిన్ను తిట్టడానికి ప్రపంచంలో బూతులు మిగలేదు ” అన్నాడు అప్పుడు చంద్రిక వచ్చి పని మనిషి నీ కాఫీ తీసుకోని రమ్మని చెప్పింది ఆ తర్వాత కృష్ణ ఇళ్లు అంతా చూసి
కృష్ణ : మీ అమ్మ నాన్న ఎక్కడ
చంద్రిక :వాళ్లు విజయవాడ లో ఉంటున్నారు అదే సొంత ఊరు కదా వాళ్ళకి అక్కడే comfort
కృష్ణ : నీకు పెళ్లి, బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరా
చంద్రిక : నిజం చెప్పాలంటే నాకూ తగిన వాడు ఇప్పటికీ దొరకలేదు అంటూ తన కురులు వెనక్కి దువ్వుతు శేఖర్ వైపు చూసింది నీకు ఇంక పెళ్లి కాలేదా అని సిగ్గు పడుతూ అడిగింది
కృష్ణ : మనోడికి పెళ్లి అయ్యింది డివోర్స్ అయ్యింది
పెళ్లి అయ్యింది అని వినేసరికి కొంచెం షాక్ అయింది కానీ డివోర్స్ అని విని మళ్లీ నవ్వింది “అవును నా తరువాత ఎన్నో అమ్మాయి నీ భార్య” అని ఓపెన్ గానే అడిగేసింది దాంతో శేఖర్ “నువ్వు చందు అని ముద్దుగా పిలిచే దానివి నేను నిన్ను చందు అని పిలిచేవాడిని గుర్తు ఉంది గా నువ్వు వెళ్లిపోయాక నను అలా ఎవరూ ముద్దుగా పిలుస్తారా అని ఎదురు చూశా నువ్వు నమ్మవు మొదటి సారి చందన నను చందు అని పిలిస్తే నాకూ తన మొహం బదులు నీ మొహం గుర్తు వచ్చింది తెలుసా ” అని అన్నాడు దానికి కృష్ణ తాగుతున్న కాఫీ ఉమ్మి దగ్గడం మొదలు పెట్టాడు, అయిన కూడా పట్టించుకోవడం మానేసి చంద్రిక చెయ్యి తన చేతిలోకి తీసుకుని “నా కొడుకు కు చంద్రకాంత్ అని నీ పేరు నా పేరు కలిపి పెట్టాలి అనుకున్నా కానీ జాతకం ప్రకారం వాడికి అ తో మొదలు అవ్వాలి అని చెప్పారు లాజిక్ గా మన పేర్లు మ్యాచ్ చేయడం కష్టం కాబట్టి పెట్టలేదు” అని చెప్పాడు దాంతో చంద్రిక కళ్లలో నీళ్లు తిరిగాయి అది చూసి కృష్ణ షాక్ అయ్యాడు అప్పుడు చంద్రిక పక్కకు వెళ్లితే కృష్ణ శేఖర్ నీ పిలిచి “ఏమన్న కలిపావా రా పులిహోర ” అన్నాడు దానికి శేఖర్ నవ్వుతూ “అయిన దానికి ఎవరు రా ఐపిఎస్ పోస్ట్ ఇచ్చింది ఏమీ చెప్పిన నమ్మేస్తుంది” అని అన్నాడు ఆ తర్వాత చంద్రిక వచ్చింది ముగ్గురు కలిసి క్యాటరింగ్ హోటల్ దగ్గరికి వెళ్లి ఎంక్వయిరీ మొదలు పెట్టారు.
“మేము పొద్దున హాస్టల్ పిల్లల కోసం టిఫిన్ తీసుకోని వెళ్లూతుంటే దారిలో మా వ్యాన్ కింద ఒక కుక్క పడింది సార్ మేము దిగి వెళ్లి చూస్తే అప్పుడే ఎవరో వ్యాన్ తీసుకోని వెళ్లారు సార్” అని చెప్పాడు ఒక వంట చేసే వ్యక్తి అప్పుడు బయట చూస్తే ఒక వ్యాన్ ఉంది దాని గురించి అడిగితే అది వేరే స్కూల్ కీ కూడా సప్లయ్ చేస్తాం దాని బండి అని చెప్పాడు ఆ తర్వాత శేఖర్ నాలుగు రోజుల నుంచి ఇక్కడ కొత్త వాళ్లు కానీ, లేక పోతే ఎవరైన తేడా గా రావడం గురించి అడిగాడు దానికి ఆ వంట మాస్టర్ “నిన్న సాయంత్రం ఒక సాయిబు కుర్రాడు వచ్చాడు సార్ మొత్తం ఉర్దూ లోనే మాట్లాడాడు తెలుగు, కానీ హైదరాబాద్ హిందీ కానీ మాట్లాడలేదు ఒక 100 మందికి బిర్యాని చేయాలి అని అన్నాడు అది అర్థం మాత్రం అర్థం అయ్యింది కానీ మేము నాన్ వెజ్ వంటలు చేయుము అని చెప్తే వెళ్లి పోయాడు సార్” అని చెప్పాడు అతను చూడడానికి ఎలా ఉన్నాడు అని అడిగాడు శేఖర్ దాంతో ఆ మాస్టర్ అతను వచ్చినప్పుడు కరెంట్ లేదు మొహం సరిగ్గా కనిపించలేదు కానీ గొంతు మాత్రం ఒక చిన్న పెద్ద కానీ గొంతు ఎత్తు అయితే ఒక ఐదున్నర అడుగులు ఉంటాడు అని చెప్పాడు మరి ముఖ్యం గా వాడు పాత బజాజ్ చేతక్ మీద వచ్చాడు అని చెప్పాడు దాంతో శేఖర్ ఆలోచిస్తూ ఉన్నాడు.
ఆ తర్వాత కృష్ణ తన informer బ్యాచ్ తో ఆ షూ డీలర్లకు సంబంధించిన వివరాలు ఆ షాప్ ల అడ్రసు అని కలెక్ట్ చేశాడు ఆ తర్వాత ముందు కృష్ణ వెళ్లిన షాప్ కి వెళ్ళారు అక్కడ cctv లో ఏమైన దోరుకుతుంది అని చూశారు కానీ ఏమీ దొరకలేదు ఆ తర్వాత ప్రిన్సిపల్ ఇంట్లో ఉన్న బిల్ ఆధారంగా వెళ్లారు అక్కడ షాప్ బయట ఒక చేతక్ బండి కనిపించింది కానీ డ్రైవర్ మొహం సరిగ్గా కనిపించడం లేదు ఆ తర్వాత కంప్లయింట్ ఇచ్చిన ఆ వ్యక్తి షాప్ కి వెళ్ళారు అక్కడ cctv లేదు కానీ వాళ్ల కాలనీ లో ట్రాఫిక్ cctv ఉంది అని చెప్పారు దాంతో ఆ ఏరియా cctv footage చూస్తే అందులో వాడి మొహంకి మాస్క్ ఉండటం వల్ల కనిపించలేదు కానీ బండి నెంబర్ దొరికింది దాంతో వాళ్లు ఆ బండి నీ ట్రాక్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు కృష్ణ, శేఖర్, చంద్రిక ముగ్గురు ఒకే కార్ లో వెళుతూ ఉండగా దారిలో ఒక ఆక్సిడేంట్ కనిపించింది ఒక కుర్రాడిని లారీ గుద్ది వెళ్లింది దిగి చూస్తే అది అదే చేతక్ బండి వాడి ఎత్తు మ్యాచ్ అయ్యింది కొన్న ఊపిరి లో ఏదో అడుగుతు ఉన్నాడు కానీ చనిపోయాడు ఆ తర్వాత వాడి షర్ట్ కీ ఉన్న బటన్ కెమెరా నుంచి శేఖర్ కీ గమనిస్తున్న ఒక వ్యక్తి తన ముందు ఉన్న చదరంగం లో ఒక సిపాయి నీ చంపి “సిపాయి పని అయిపోయింది ఇంక గుర్రాన్ని ఆట లోకి దింపాలి the game has began now my friend” అని అంటూ నవ్వడం మొదలు పెట్టాడు.