డిటెక్టివ్ 2 117

డిసెంబర్ 7 న ఏమీ చేయబోతున్నారు అని కృష్ణ, చంద్రిక, శేఖర్ ముగ్గురు ఆలోచన లో పడ్డారు అప్పుడు ఆ రోజు ఏమీ స్పెషల్స్ ఉన్నాయి అని మొత్తం చెక్ చేయడం కోసం వాళ్లు కంట్రోల్ రూమ్ కీ వెళ్లారు కమిషనర్ ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టి ఫ్యామిలీ తో పాటు ట్రిప్ కీ వెళ్లాడు దాంతో చంద్రిక సస్పెండ్ గురించి ఎవరికీ తెలియదు దాంతో వాళ్ళకి రూట్ క్లియర్ అయింది అప్పుడు డిసెంబర్ 7th ఏమీ స్పెషల్స్ ఉన్నాయి అని తెలుసుకుంటు ఉంటే ఆ రోజు DRDO లో అటామిక్ అండ్ న్యూక్లియర్ ప్రొఫెసర్ జావిద్ షరీఫ్ తయారు చేసిన ఒక అటామిక్ హైడ్రో ఎలక్ట్రిక్ missile టెస్ట్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు దాంతో శేఖర్ మొత్తం ప్లాన్ అర్థం అయ్యింది, ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ కీ కాశ్మీర్ మీద ఉన్న కొద్ది పాటి పట్టు కూడా పోయింది దాంతో ఇంక కాశ్మీర్ కోసం ఏదో పెద్దగా చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అదే సమయంలో 370 రద్దు అప్పుడు అనాధ అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశారు అందులో రజాక్ కూడా ఉన్నాడు వాడు 15 సంవత్సరాల వయసు లోనే ప్రపంచ సైంటిస్ట్ ఎవరికి చేతకాని ఒక కొత్త రకమైన హార్డ్ వేర్ టెక్నాలజీ సృష్టించాడు ఆ టెక్నాలజీ వాడి DRDO లోని ఆ missile నీ అక్కడే బ్లాస్ట్ చేస్తే దేశం మొత్తం ఆ కేసు మీద బిజీ అవుతుంది దాంతో ఎవరూ కాశ్మీర్ నీ పట్టించుకోరు అప్పుడు రక్షణ కోసం బార్డర్ లో ఉన్న సైన్యం కూడా బలహీనం గా ఉంటుంది అప్పుడు కాశ్మీర్ నీ హస్తగతం చేసుకోవడం సులభం అవుతుంది అని జమాత్ మహమ్మద్ లష్కరే ప్లాన్ కాబట్టి ఎలాగైనా ఇది ఆపాలని శేఖర్ డిసైడ్ అయ్యాడు కాకపోతే ఇంత పెద్ద టాస్క్ చేయడానికి వీలకు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు.

అప్పుడే చంద్రిక పని మనిషి ఫోన్ చేసింది “మేడమ్ ఆ పిల్లగాడు పారిపోయిండు” అని చెప్పింది దాంతో చంద్రిక ఇదే విషయం శేఖర్ కీ చెప్పింది, కానీ శేఖర్ మాత్రం ఏమీ రియాక్షన్ లేకుండా “అవునా” అని చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉంటే కృష్ణ వైపు చూసి “ఏంటి ఏమీ రియాక్షన్ లేదు వాడి నుంచి” అని అడిగింది దానికి కృష్ణ “వాడు రియాక్షన్ ఇవ్వడం లేదు అంటే వాడి యాక్షన్ ఎక్కడో మొదలు అయ్యి ఉంటుంది” అని చెప్పాడు అప్పుడు ఇద్దరిని రమ్మని చెప్పాడు శేఖర్ అప్పుడు చంద్రిక ఎక్కడికి అని అడిగింది దానికి శేఖర్ “నీ మృదువైన చేతికి గల గల సౌందర్యం పెంచడానికి చూడి బజార్ కీ వెళ్లి గాజులు కొందాం ” అన్నాడు అప్పుడు చంద్రిక కీ అర్థం అయ్యింది రజాక్ చూడి బజార్ లో ఉన్నాడు అని దాంతో ముగ్గురు శేఖర్ దగ్గర ఉన్న GPS ట్రాకర్ ద్వారా అక్కడికి వెళ్లారు అప్పుడు ఆ ట్రాకర్ వాళ్ళని ప్రొఫెసర్ జావిద్ షరీఫ్ ఇంటికి తీసుకు వెళ్లింది దాంతో చంద్రిక, కృష్ణ ఇద్దరిని బయట నుంచి కవర్ చేసి ఫోర్స్ నీ పిలవమని చెప్పి లోపలికి వెళ్ళాడు శేఖర్ ఆ తర్వాత లోపలికి వెళ్లి అక్కడ పడి ఉన్న ఒక ప్లాట్ broucher నీ తీసుకోని డోర్ బెల్ కొట్టాడు అప్పుడు ఆ ప్రొఫెసర్ భార్య బయటకు వచ్చింది ఆమె కళ్ళల్లో ఏదో భయం తెలుస్తుంది శేఖర్ మాట్లాడే ముందే ఆమె మాకు ఏమీ వద్దు అని తలుపు వేసింది ఆ తర్వాత శేఖర్ ఇంట్లోకి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా తన కాలి కింద ఉన్న టైల్స్ ఒక్కోటీ ఒక్కో శబ్దం చేస్తూ ఉన్నాయి దాంతో ఆ ఇంటికి అండర్ గ్రౌండ్ ఉంది అని అర్థం అయ్యింది శేఖర్ కీ వెంటనే దానికి బేస్ ఎక్కడ అని వెతుక్కుంటూ వెళితే ఒకడు అండర్ గ్రౌండ్ లో నుంచి బయటకు ఫోన్ మాట్లాడానికి వచ్చాడు.