డిటెక్టివ్ 2 105

దాంతో ప్లాన్ కీ తగ్గట్లు అందరూ బయలుదేరారు దారిలో దేవి బ్యాచ్ మేట్ అందరూ కలిశారు కృష్ణ టాస్క్ ఫోర్స్ టీం లీడర్ గా వెళ్లాడు దాంతో ప్రధాని కీ దెగ్గర గా ఉండొచ్చు అని, ఇది ఇలా ఉంటే ఇక్బాల్ రజాక్ కీ స్కూల్ యునిఫామ్ ఇచ్చి వేసుకో అన్నాడు ఆ తర్వాత తన గ్యాంగ్ లో ఉన్న టేర్రరిస్టలను బ్లాక్ కాట్స్ డ్రస్ లో రెడీ అవ్వమని చెప్పాడు దాంతో నిజమైన బ్లాక్ కాట్స్ వాళ్ళని మత్తు మందు ఇచ్చి పడుకోబెట్టారు ఆ తర్వాత తన గ్యాంగ్ లో స్కూల్ బస్ డ్రైవర్ కీ టైమ్ కీ రమ్మని చెప్పి రజాక్ నీ వాడికి అప్పజేప్పాడు శేఖర్, చంద్రిక మిగిలిన మిలిటరీ ఆఫీసర్స్ అంతా కలిసి బస్తీ రోడ్డు లో ఉన్న అతి పెద్ద బిల్డింగ్స్ పైన sniper గన్స్ తో రెడీగా ఉన్నారు ఆ తర్వాత లోపల ఉన్న జావిద్ షరీఫ్ బ్యాక్ గేట్ దెగ్గర ఉన్న cctv నీ block చేసి డోర్ తెరిచి బబుల్ గమ్ తో access card అక్కడ అతికించి వెళ్లాడు ఆ శేఖర్ దెగ్గర ఉన్న టీం స్టాఫ్ క్వార్టర్స్ నుంచి ఏదో కార్ బ్యాక్ డోర్ వైపు వస్తుంది అని చూశారు అప్పుడు ఆ కార్ టైర్ కీ కాల్చి చూస్తే అందులో నుంచి కంగారు పడి కొంతమంది ఉగ్రవాదులు దిగారు దాంతో శేఖర్ ఆర్డర్ మీద వాళ్ళని కాల్చి చంపారు ఆ తర్వాత శేఖర్ లోపలికి వెళ్లడం మొదలు పెట్టాడు చంద్రిక నీ అక్కడే ఉండి చూసుకో అని చెప్పాడు, అప్పుడు ఒక స్కూల్ బస్ లోపలికి వచ్చింది దాంట్లో రజాక్ నీ చూశాడు దేవి అప్పుడు తన టీం లో ఒక్కతనీ చూసి సైగ చేశాడు అప్పుడు అతను తన దగ్గర ఉన్న బుల్లెట్ నీ రజాక్ పాంట్ లో సీక్రెట్ గా వేశాడు దాంతో చెకింగ్ దెగ్గర అలారం మొగి రజాక్ నీ దేవి సైడ్ చేశారు.

అప్పుడు జావిద్ తన టెస్ట్ మొదలు పెట్టే టైమ్ కి ఒక బ్యాచ్ వెనుక డోర్ నుంచి లోపలికి వచ్చి ఎటాక్ చేయాలి కానీ ఎవరూ రావడం లేదు అని ఇక్బాల్ వెనకు వెళుతుంటే ఇక్బాల్ ఫోన్ నీ హక్ చేశారు బయట ఉన్న మిలిటరీ ఫోర్స్ వాళ్లు బయట ఉన్న బ్యాచ్ మెసేజ్ చేసినట్లు ఇక్బాల్ కీ చేశారు తమని సెక్యూరిటీ వాళ్లు పట్టుకున్నారు అని దాంతో కంగారుగా వెళ్లాడు వాడి వెనుక బ్లాక్ కాట్స్ లో ఉన్న ఉగ్రవాదులు కూడా వెళ్లారు అప్పుడు వాళ్లు ఆ డోర్ దగ్గరికి రాగానే శేఖర్ గన్ తో ఎదురు వచ్చాడు దాంతో ఇక్బాల్ నవ్వుతూ తన మనుషులకు ఫైర్ అని ఆర్డర్ వేశాడు కానీ అంతలోనే మిలిటరీ snipers వాళ్ళని కాల్చి చంపారు అప్పుడు ఇక్బాల్ షాక్ అయ్యాడు దాంతో శేఖర్ మీద విరుచుకుపడ్డాడు వాడి బలం ముందు శేఖర్ బలం చాల లేదు దాంతో శేఖర్ నీ కొట్టి లోపలికి వెళ్ళాడు “సార్ మన మీద ఎటాక్ జరుగుతుంది వెళ్లాలి” అని అన్నాడు ఇక్బాల్ అప్పుడు ప్రధాని తన చేతిలో ఉన్న ఫోన్ చూపించాడు అందులో శేఖర్ మొన్న జావిద్ ఇంట్లో తీసిన వీడియో మరి రజాక్ షర్ట్ బటన్ లో ఉన్న కెమెరా తో వాడు రాజ్ భవన్ లో మాట్లడింది హోటల్ రూమ్ లో వాడు చేసిన ప్లాన్ అంతా డీటేల్ గా న్యూస్ లో వస్తుంది (ఒక వేళ తనకు ఏమైనా అవుతుంది అని ముందు సౌమ్యా కీ ఆ ఎవిడెన్స్ పంపి పది గంటలకు అని న్యూస్ ఛానల్ లో ప్రసారం అయ్యేలా చేశాడు శేఖర్) అది చూసి కోపం కట్టలు తెంచుకొని ఇక్బాల్ పక్కనే ఉన్న కృష్ణ గన్ తో కృష్ణ నీ కాల్చి ప్రధాని పైన గన్ పెట్టాడు.

అలా తప్పించుకోని వెళ్లాలి అని చూస్తుంటే గాలి లో ఒక పేక ముక్క ఎగురుతు వచ్చి ఇక్బాల్ మెడ పైన తెగింది అదే ముక్క తిరిగి వెళ్లి శేఖర్ చేతిలో ఆగింది (చిన్నప్పుడు గుణ మ్యాజిక్ నేర్చుకునే వాడు అప్పుడు వాడి బెస్ట్ టెక్నిక్ ఇలా పేక ముక్క నీ boomerang లాగా వాడడం అది నేర్చుకున్న శేఖర్ ఇప్పుడు ఆ పేక ముక్క కీ బ్లేడ్ అతికించి ఇక్బాల్ మీదకు వదిలాడు) తన మెడ తెగిన నొప్పి తో ప్రధాని నీ వదిలాడు ఇక్బాల్ అప్పుడు కృష్ణ లేచి తన షూ లో ఉన్న ఇంకో గన్ తో ఇక్బాల్ నీ కాల్చాడు అప్పుడే దేవి కూడా తన టీం తో వచ్చి ఫైర్ చేశారు (వాడు ఇలా చేస్తాడు అని expect చేసిన శేఖర్ థామస్ తో ఒక డమ్మి గన్స్ తెప్పించి దాని కృష్ణ టీం లో అందరికీ ఇప్పించారు) అలా ఫైనల్ టచ్ లో శేఖర్ తన పేక ముక్క నీ ఇక్బాల్ గొంతు మీదకి వదిలాడు అలా వాడు అక్కడే చచ్చాడు.

ఇక్బాల్ చనిపోయిన తరువాత తన ప్రాణాలు సిటీ నీ కాపాడినందుకు ప్రధాని శేఖర్ నీ అభినందిస్తుంటే శేఖర్ ఇది తన ఒక్కడి గెలుపు కాదు మొత్తం మా టీం గెలుపు అని చెప్పాడు, దాంతో ప్రధాని వాళ్లను అందరినీ కలిపి జనవరి 26 కీ వాళ్ల ధైర్యం కీ మెచ్చి మెడల్స్ ఇచ్చారు దాంతో పాటు శేఖర్ కీ RAW తరుపున ఉద్యోగం ఇచ్చారు కానీ శేఖర్ మాత్రం ఆ ఉద్యోగం వదులుకున్నాడు తనకు ఇలా ఫ్రీ గా ఎవరి అధికారం లేకుండా పని చేయడం ఇష్టం అని చెప్పి తనకు ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత రజాక్ కీ DRDO లోనే జూనియర్ సైంటిస్ట్ ఉద్యోగం దాంతో పాటు తను చదువుకొడానికి స్కాలర్షిప్ అని ఇచ్చారు అలా అందరూ హ్యాపీ అయ్యారు.

ఇది అంత జరిగిన తరువాత ఒక రోజు చంద్రిక వచ్చి శేఖర్ నీ తనను పెళ్లి చేసుకో అని చెప్పింది దాంతో శేఖర్ ఏదో చెప్పబోతే చంద్రిక అతని నోరు మూసి “నాకూ అంతా తెలుసు నువ్వు స్కూల్ తరువాత కాలేజీ లో అమెరికా లో నువ్వు నడిపిన రాసలీలు అని తెలుసుకున్న దాంతో పాటు చందన కీ జరిగిన దానికి నువ్వు తనకు ఇన్ని రోజులు తోడుగా ఉండి ఎందుకు వదిలేశావు అని ఆలోచిస్తుంటే నీకు వచ్చే రిస్క్ వల్ల వాళ్లు ఎక్కడ బాధపడతారు అని వాళ్ళని దూరం పెట్టావు మామూలుగా నీ గురించి తెలుసుకున్న ఏ అమ్మాయి అయిన చీ అని వదిలేసి వెళుతుంది కానీ నీ మీద నాకూ కోపం కూడా రావడం లేదు ఎందుకు అంటావ్ ఒక వేళ unconditional లవ్ అంటే ఇదే అనుకుంట మన ప్రేమ నీ గాలిపటం లా ఎంత స్వేచ్ఛగా వదిలితే అంతే తొందరగా మన దగ్గరికి వస్తుంది అలాగే మనం ప్రేమించిన వ్యక్తి కీ మన ప్రేమలో నిజాయితీ స్వేచ్ఛ ఇవ్వగలీగీతే అదే ప్రేమ కీ ఇచ్చిన గౌరవం నాకూ నీతో ఏమీ ప్రాబ్లమ్ లేదు నువ్వు మారుతావు అన్న నమ్మకం కూడా నాకూ లేదు కానీ నువ్వే కావాలి మొదటి ప్రేమ తీపి జ్ఞాపకం గా దాచుకొవాలీ అనుకున్న కానీ నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నిన్నే నాలో దాచుకుంటా” అని చెప్పి శేఖర్ మొహం తన అర చేతిలో తీసుకోని పెదవి పైన ముద్దు పెట్టింది, ఆ తర్వాత శేఖర్ చంద్రిక కళ్లలో చూస్తూ “రుక్మిణి కృష్ణుడు తో పెళ్ళి అయ్యే వరకు చూడలేదు అంట తన గురించి విని మాత్రమే ప్రేమించింది అది ఒక్కప్పటి unconditional లవ్ ఇప్పుడు అదే నీలో చూశాను ఇక నుంచి నా సంతోషం కోసం బ్రతికా నేను ప్రేమించిన అమ్మాయి లు అంత జ్ఞాపకం గా మిగిలితే నువ్వు గుండె మీద అచ్చు అయ్యావు ఇప్పటి నుంచి మన సంతోషం కోసం నీతో కలిసి ఉంటా “అని చెప్పాడు శేఖర్.