(హైదరాబాద్ సాయంత్రం 5:30)
ఒక కాలనీ మొత్తం మీడియా, సెక్యూరిటీ ఆఫీసర్ల హడావిడి తో ఉంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక అమ్మాయి శవం అంబులెన్స్ లో ఎక్కిస్తూ ఇంకో అబ్బాయి నీ సెక్యూరిటీ అధికారి జీప్ ఎక్కిస్తున్నారు అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ల కథనం ప్రకారం మీడియా వాళ్ళు అంతా ఒకే మాదిరిగా న్యూస్ చెప్పడం మొదలు పెట్టారు “చెర్రీ అలియాస్ చరణ్ అనే యువకుడు మధుమతి అనే యువతి నీ ఒంటరిగా ఇంట్లో ఉండగా బలవంతంగా లోపలికి వెళ్లి దారుణంగా రేప్ చేసి హత్య చేశాడు” అని న్యూస్ చానెల్స్ ప్రచారం జరుగుతోంది చెర్రీ నీ సెక్యూరిటీ అధికారి కస్టడీ లో చాలా torture చేశారు అప్పుడు ఇనస్పెక్టర్ కీ ఒక ఫోన్ వచ్చింది అది వచ్చిన తర్వాత ఆ ఇనస్పెక్టర్ ఒక తెల్ల కాగితం పైన చెర్రీ సంతకం బలవంతంగా తీసుకోని ఆ పేపర్ లో చెర్రీ తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు అన్నట్లు చేశారు ఆ తర్వాత వాడిని మరుసటి రోజు కోర్టు లో అప్పగించారు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని మహిళా సంఘాలు చెర్రీ కీ ఉరి శిక్ష అమలు చేయాలని కోరారు దాని కోసం కొవ్వొత్తి ర్యాలీలు నిర్వహించారు.
(6 గంటల ముందు ఢిల్లీ)
ఢిల్లీ హైకోర్టు లో తన క్యాబిన్ లో కూర్చుని ఉంది లాయర్ రమ్య తన ఎదురుగా ఉన్న తన క్లయింట్ చెప్తున్న మాట తన చెవికి వెళ్లడం లేదు తన తల లో “హెల్ప్ హెల్ప్ అక్క అక్క” అని తన గతం తాలూకు జ్ఞాపకాలు తన మెదడు నీ తొలిచేస్తున్నాయి రమ్య వాళ్ల మాట వినడం లేదు అని అర్థం అయిన తన అసిస్టెంట్ మనోహర్ వెంటనే తన చేత్తో రమ్య టేబుల్ మీద కొట్టి ఆ క్లయింట్ ఫైల్ నీ వాళ్ల ఇద్దరి మధ్య అడ్డం పెట్టి క్లయింట్ నీ డైవర్ట్ చేశాడు మనోహర్ దాంతో రమ్య హడావిడి గా బాత్రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చుకున్ని తన కోట్ నుంచి టాబ్లేట్స్ తీసుకోని కొంచెం కుదుట పడింది ఆ తర్వాత తన మొహం మీద నీళు పోసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చింది తను బయటికి రాగానే చాలా వేగంగా గన్ లో నుంచి తూటా వదిలినట్టు తన అసిస్టెంట్ కీ ఆర్డర్స్ వేస్తోంది “మనో మెడికల్ బిల్స్ అన్ని సరిగా ఉన్నాయి లేనిది చూసుకో, మనం చెప్పిన గవర్నమెంట్ certified డాక్టర్ వచ్చారా, అవతలి క్లయింట్స్ కీ నోటీసులు పంపించారా, తరువాత హియరింగ్ మనదే కాబట్టి క్విక్ గేట్ రెడీ, మిష్టర్ మెహతా మీకు నిన్న చెప్పిన విషయాలు గుర్తు ఉన్నాయి కదా అవతలి లాయర్ ఎంత confuse చేసిన మీరు మీ జవాబు మాత్రమే ఇవ్వాలి ” అని తన పాటికి తను ఆర్డర్ వేస్తూ కోర్టు హాల్ కీ బయలుదేరింది రమ్య.
ఢిల్లీ లోనే టాప్ లాయర్ తను ఎలాంటి కేసు అయిన సింగిల్ హియరింగ్ లో ముగించడం తన ప్రతిభ అంతే కాకుండా తను ఎప్పుడు తప్పు చేసిన వారి వైపు నుంచే వాదిస్తుంది కారణం డబ్బు తనకు ఎంత ఎక్కువ ఫీజు ఇస్తే అంత స్ట్రాంగ్ గా తప్పుడు సాక్షులను సృష్టించి అంతే తొందరగా కేసు ముగిస్తుంది ఇలా ఇప్పుడు తన దగ్గరకు వచ్చిన క్లయింట్ ఒక బిల్డర్ తను ఈ మధ్య కట్టిన స్లమ్ క్లియరెన్స్ కీ సంబంధించిన ఒక బిల్డింగ్ కూలిపోయింది తన దగ్గర పని చేసే ఇంజనీర్ ఆ బిల్డింగ్ లో సిమెంట్ quality, బాగలేక అంతే కాకుండా ఆ బిల్డింగ్ తాలూకు ఫండ్స్ లోకల్ ఎంఎల్ఏ తో కలిసి మెహతా నొక్కేసి quality లేని మెటీరియల్ తో బిల్డింగ్ కట్టారు లక్కీ గా ఆ బిల్డింగ్ లో ఇంకా ఎవరూ చేరలేదు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు ఈ బిల్డింగ్ కట్టడం లో జరిగిన అవకతవకలపై ఆ ఇంజనీర్ కంప్లయింట్ ఇస్తే అతని చంపేశాడు అందుకే రమ్య కీ 8 కోట్లు ఫీజు డిసైడ్ చేసి కేసు వాదించమని అడిగాడు దాంతో రమ్య కూడా ఒప్పుకుంది.
కోర్టు మొదలు అయ్యింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిల్డింగ్ కట్టడం లో జరిగిన అవకతవకలపై రిపోర్ట్ లు కోర్టు కీ ఇస్తున్నారు మెహతా కీ చెమట కారుతుంది ఏమీ జరుగుతోంది అని భయం మొదలైంది కానీ రమ్య ప్రశాంతంగా కూర్చుని ఉంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నలకు మెహతా తడబాటు లేకుండా మనోహర్ చెప్పిన ప్రతి మాట అక్షరం పొల్లు పోకుండా చెప్తున్నాడు, ఆ తర్వాత రమ్య వాదించడం మొదలు పెట్టింది “your honor పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి నా క్లయింట్ పెద్ద స్కామ్ చేశారు అని అంటున్నారు కానీ నిజానికి ఈ స్కామ్ చేసింది నా క్లయింట్ దెగ్గర పని చేసిన ఇంజనీర్ సురేష్ అతనే ఈ టెండర్ ప్రపోజల్ తెచ్చాడు పైగా అతను చనిపోవడానికి రెండు రోజుల ముందు దుబాయ్ నుంచి ఒక offshore అకౌంటు ద్వారా అతని అకౌంటు లో 10 కోట్ల రూపాయల డబ్బు జమ చేయబడింది అది అతని సంతకం మీదే 50 లక్షల రూపాయలు చెక్ ద్వారా విత్ డ్రా చేశారు, పైగా ఇంజనీర్ సురేష్ చనిపోయిన రోజు ఉదయం నుంచి నా క్లయింట్ appendix ఆపరేషన్ మీద aims లో చేరి చికిత్స పొందుతూ ఉన్నారు దానికి సంబంధించిన x ray, మెడికల్ రిపోర్ట్ లు, అని కోర్టు వారికి సమర్పించడం జరిగింది సర్జరీ చేసిన డాక్టర్ నీ కూడా సాక్ష్యం గా ప్రవేశ పెడుతున్నాం అప్పుడు డాక్టర్ కూడా రమ్య చెప్పినట్టు చేశాడు ” అలా ఎటు చూసినా సాక్ష్యం, ఆధారాలు అని మెహతా కీ అనుకూలంగా ఉండటం వల్ల అతని కోర్టు విడుదల చేసింది.
మెహతా సంతోషంగా వచ్చి రమ్య కీ ఫీజు కింద 8 కోట్లు ఇచ్చి వెళ్లిపోయాడు ఆ తర్వాత రమ్య మనోహర్ నీ పిలిచి “ఆ బాగ్ లో 8 ఉంది నువ్వు 2 తీసుకోని నాకూ మూడు ఉంచి మిగిలిన డబ్బు లో ఒక కోటి ఆ చనిపోయిన సురేష్ ఫ్యామిలీ కీ ఇవ్వు బయట ఉన్న ci నీ లోపలికి పిలిచి ఒక 50 లక్షలు ఇవ్వు ఆ మెహతా డ్రైవర్ కీ సాయంత్రం హాస్పిటల్ కు వెళ్లి మిగిలిన 50 ఇవ్వు ఇంక ఆ మిగిలిన కోటి ఎక్కడ ఇవ్వాలి అన్నది నీకు తెలుసుగా” అని చెప్పి తన ఇంటికి బయలుదేరింది రమ్య ఒక గంట తరువాత న్యూస్ లో మెహతా కార్ కీ ఆక్సిడేంట్ అయ్యింది అని వచ్చింది మెహతా చనిపోయాడు అతని డ్రైవర్ బ్రతికాడు అని వచ్చింది అంతకు ముందే ci కీ డబ్బు ఇవ్వడం తో కార్ లోని టెక్నికల్ లోపం వల్ల ఆక్సిడేంట్ జరిగింది అని కేసు కొట్టేశాడు అలా అన్యాయం నీ గెలిపించి తిరిగి న్యాయం చేయడం రమ్య స్టయిల్.
ఇలా ఎందుకు చేస్తోంది అంటే తన చెల్లి (సవితి చెల్లి) కీ చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం లో వెన్నుముక దెబ్బ తిని తనకు కాలు, చేతులు, నోరు కూడా పనిచేయడం లేదు తన ప్రాణాలను నిలబెట్టాలి అంటే క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి దాంతో మధ్య తరగతి కుటుంబం కీ చెందిన వాళ్లు అంత ఖరీదైన వైద్యం ఇవ్వలేక పోయారు అందుకే తన మెడికల్ ట్రీట్మెంట్ కోసం వాళ్ల నాన్న బస్ లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆక్సిడేంట్ కింద కేసు నమోదు అయితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కానీ ఆ డబ్బు మొత్తం తన సవితి తల్లి లాగేసుకుంది అప్పుడే డిసైడ్ అయ్యింది రమ్య తన సొంత చెల్లి కాకపోయిన తన వల్ల ఇలా జరిగిందని తన చెల్లి బాధ్యత తానే తీసుకుని ఇప్పుడు సిటీ లోనే పెద్ద కాస్ట్లీ క్రిమినల్ లాయర్ అయ్యింది.
మరుసటి రోజు ఉదయం తను తన హాలు లో టివి చూస్తూ thread mill మీద పరిగెత్తుతూ ఉంది అప్పుడే
టివి లో చెర్రీ కేసు గురించి న్యూస్ రావడం మొదలు అయ్యింది అది చూస్తూ ఉంటే తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ లో ఎమర్జెన్సీ అని వస్తే హడావిడిగా తన చెల్లి మౌనిక బెడ్ రూమ్ లోకి వెళ్ళింది అక్కడ తన చెల్లి బెడ్ మీద నుంచి కింద పడితే తనని లేపి మంచం పైన పడుకోబెట్టింది అప్పుడు “మల్లికా” అని అరిచింది రమ్య దాంతో మౌనిక కోసం పెట్టిన కేర్ టేకర్ మల్లికా కంగారు గా వచ్చింది అప్పుడు రమ్య తనని లాగి కొట్టింది “చెల్లి కంటే ముఖ్యమైన పని ఏంటి నీకు” అని కోపంగా అరిచింది రమ్య దాంతో మల్లికా “సారీ అక్క అమ్మ కీ serious గా ఉంది అని ఫోన్ వచ్చింది అందుకే ఫోన్ మాట్లాడుతూ ఉన్న” అని చెప్పి ఏడ్వడం మొదలు పెట్టింది దాంతో అప్పుడే మనోహర్ నుంచి ఫోన్ వస్తే రమ్య మల్లికా కీ సారీ చెప్పి ఫోన్ మాట్లాడానికి వెళ్లింది “సీనియర్ మనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ex ఐపిఎస్ ఆఫీసర్ ప్రభాకర్ సిన్హా ఆయన నిన్న జరిగిన రేప్ కేసులో ఆయన తరుపున వాదించాలి అని అడిగారు ఎమ్ చేద్దాం” అని అడిగాడు మనోహర్ దాంతో రమ్య హైదరాబాద్ వెళ్లాలి అని డిసైడ్ అయ్యింది మల్లికా నీ కూడా వాళ్ల అమ్మ కూడా హైదరాబాద్ లోనే ఉండటం తో తనకు షెడ్యూల్ మార్చి తనతో పాటు హైదరాబాద్ కీ తీసుకుని వెళ్లింది అప్పుడు మనోహర్ నీ ప్రభాకర్ దగ్గరికి పంపి తను చెర్రీ నీ కలవడం కోసం జైలు కీ వెళ్లింది.
సాయంత్రం మీడియా వాళ్లను పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టింది రమ్య ప్రభాకర్ ఇంట్లో టివి లో చూస్తూ ఉన్నాడు అప్పుడు మీడియా ముందు “నేను ఈ కేసు లో చెర్రీ తరుపున వాదిస్తున్నా” అని చెప్పింది రమ్య అది విని ప్రభాకర్ షాక్ అయ్యాడు.