న్యాయం 790

ఆ తర్వాత రమ్య, చెర్రీ ఇద్దరు మధు రూమ్ కి వెళ్ళారు ఏమైనా క్లూ దొరుకుతుంది ఏమో అని రూమ్ లో తన బట్టలు, బుక్స్ తప్ప ఇంక ఏమీ లేదు దాంతో రమ్య బాగా పరిశీలన గా చూస్తే ఒక షెల్ప్ మీద “Never open it” అని రాసి ఉంది దాంతో ఆ షెల్ప్ తెరిచి చూస్తే ఒక టెన్నీస్ బ్యాట్ కొన్ని మెడల్స్ ఉన్నాయి అంతే కాకుండా ఒక బాగ్ ఉంది అందులో “సెరినా విలియమ్స్, సానియా మీర్జా లాంటి టెన్నిస్ స్టార్స్ పోస్టర్లు ఉన్నాయి దాంతో వాళ్ళకి అర్థం అయ్యింది ఏంటి అంటే మధు కూడా ఒక టెన్నిస్ ప్లేయర్ అని అప్పుడు అక్కడ ఉన్న ఒక సర్టిఫికేట్ తీసి చూసింది రమ్య దాంట్లో “బెస్ట్ ప్లేయర్ మధుమతి సిన్హా క్లబ్” అని ఉంది ఊటీ లో ఆ క్లబ్ హౌస్ ఉంది ఇంకో సర్టిఫికేట్ లో బెస్ట్ డబుల్స్ ప్లేయర్స్ మధుమతి, విద్య అని ఉంది అప్పుడు ఆ బాగ్ లో ఇంకా చాలా ఫోటో లు ఉన్నాయి అందులో తను టెన్నిస్ ఆడిన ఫొటోలు తన ఫ్రెండ్ విద్య తో కలిసి ఉన్న ఫోటోలను చూసిన తర్వాత రమ్య ఊటీ వెళ్లాలి అని డిసైడ్ అయ్యింది.

పాట్నా వెళ్లిన తర్వాత రాజ్, మనోహర్ ఇద్దరు అక్కడ ఉన్న ధోభీ సంఘం వాళ్ల దగ్గరికి వెళ్లి బుగ్గా ఫోటో చూపించి అతని గురించి ఎంక్వయిరీ చేశారు కానీ అక్కడ అతను వాళ్ల సంఘం లో మెంబర్ కాదు అని చెప్పారు పైగా ఎప్పుడు చూడలేదు అని చెప్పారు ఆ తర్వాత కావాలి అని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లాడు రాజ్ బుగ్గా ఫోటో చూపించి వాడు తన డ్రైవర్ అని తన ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు అని కంప్లయింట్ ఇచ్చాడు దానికి కానిస్టేబుల్ నవ్వి “వీడిని ఎలా పనిలో పెట్టుకున్నారు సార్ ఈ పాట్నా సిటీ లోనే నెంబర్ వన్ pickpocket గాడు వీడు నాకూ ఒక వెయ్యి కొట్టండి సాయంత్రానికి మీ డబ్బు మీ దగ్గర ఉంటుంది” అన్నాడు కానిస్టేబుల్ దాంతో రాజ్ మనోహర్ కీ సైగ చేశాడు దానికి మనోహర్ ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి ఎక్కడ దొరుకుతాడు అని అడిగాడు దాంతో ఆ కానిస్టేబుల్ చోర్ బజార్ అని చెప్పాడు, దాంతో ఇద్దరు కలిసి చోర్ బజార్ లో ఎంక్వయిరీ మొదలు పెట్టారు కానీ ఎవరూ తెలియదు అని చెప్తున్నారు కానీ బుగ్గా గురించి వాళ్లు చేస్తున్న ఎంక్వయిరీ గురించి అప్పటికే ప్రభాకర్ కీ మెసేజ్ వెళ్లింది దాంతో ప్రభాకర్ తన బ్యాచ్ మేట్ అయిన పాట్నా సిటీ కమిషనర్ కీ ఫోన్ చేసి రాజ్, మనోహర్ గురించి చెప్పాడు అప్పుడు ఆ కమిషనర్ అక్కడ ఉన్న గ్యాంగ్ వాళ్ళకి రాజ్, మనోహర్ నీ చంపేస్తే 3 లక్షలు ఇస్తా అని ఆఫర్ పెట్టాడు దాంతో మార్కెట్ లో గ్యాంగ్ లు వాళ్ల వెంట పడ్డారు రాజ్ అందరినీ కొట్టి మొత్తానికి ఆ బుగ్గా గాడి ఫ్రెండ్ నీ పట్టుకుని వాడిని తనతో పాటు తీసుకోని వెళ్లాడు మనోహర్ వాడిని కోట్టబోతే ఆపి వాడికి 10 లక్షల చెక్ ఇచ్చి నిజం చెప్పమని అడిగితే అప్పుడు వాడు బుగ్గా జీవిత చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు “బుగ్గా కొన్ని సంవత్సరాల క్రితం వరకు pickpocket చేసేవాడు ఒక రోజు లోకల్ బస్ లో ఒక బాగ్ కొట్టేశాడు ఇంటికి వచ్చి చూస్తే అందులో డ్రగ్స్ ఉన్నాయి అప్పుడు సిటీ కమిషనర్ గా ఉన్న ప్రభాకర్ ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించి బీహార్ లో సిండికేట్ నడుపుతున్నాడు అందుకే బుగ్గా నీ పట్టుకుని జైలు లో పెట్టారు అక్కడే బుగ్గా బట్టలు ఉతికడం, ఇస్త్రీ చేయడం నేర్చుకున్నాడు ఆ తర్వాత వాడు రిలీస్ అయ్యే రోజు ప్రభాకర్ వాడిని తనతో పాటు ఊటీ కీ తీసుకోని వెళ్లి అక్కడ వాడికి ఒక ఇస్త్రీ బండి ఇచ్చి వాడితో డ్రగ్స్ బిజినెస్ మొదలు పెట్టాడు ఈ డ్రగ్స్ లో వచ్చిన డబ్బుతో ప్రభాకర్ ఊటీ లో ఒక టెన్నిస్ క్లబ్ పెట్టాడు ” ఇలా మొత్తం జరిగింది తెలుసుకున్న రాజ్, మనోహర్ వాడిని వదిలేశారు కానీ వాడిని కార్ లో ఫాలో చేసి ఆక్సిడెంట్ చేసి హాస్పిటల్ లో పడేసి వెళ్లిపోయారు.

పాట్నా లో జరిగింది తెలుసుకున్న రమ్య తను, చెర్రీ ఊటీ వెళ్లుతున్నాం మిగిలిన విషయాలు కనుక్కొని వస్తా అని చెప్పింది రమ్య ఆ తర్వాత అప్పుడే తనకు CBI లో ఉన్న తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది అతను ఆ రోజు మనోహర్ మీద ఎటాక్ జరిగిన రోజు ప్రభాకర్ ఎవరికో ఫోన్ చేశాడు అని చెప్పాడు అవతలి ఫోన్ నీ ట్రాక్ చేయడం కుదరలేదు అని అది స్మార్ట్ ఫోన్ కాదు పాత నోకియా కంపెనీ ఫోన్ అని చెప్పాడు పోనీ ఆ నెంబర్ నీ హాకింగ్ చేసి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అది ప్రభాకర్ నెంబర్ తోనే sim clowning చేసి ప్రైవేట్ నెంబర్ కింద వాడుతున్నారు అని చెప్తాడు, ఇది అంత విన్న రమ్య కీ అనుమానం వస్తుంది ఆ కిల్లర్ తమ వెంట పడుతున్నాడు ఏమో అని దాంతో కార్ నీ ఆపు అని డ్రైవర్ తో చెప్పి చెర్రీ, డ్రైవర్ నీ బయటకు దుక్కేమని చెప్పింది రమ్య అప్పుడు రమ్య కార్ మీదకు ఒక లారీ వేగంగా వచ్చి గుద్దింది రమ్య చనిపోయిన విషయం ఆ కిల్లర్ ప్రభాకర్ కీ మెసేజ్ చేసి చెప్పాడు.

రమ్య చనిపోవడంతో చెర్రీ ఆ లారీని వెంబడించి వెళ్లాడు కానీ వాడు ఎస్కేప్ అయ్యాడు దాంతో చెర్రీ రాజ్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పాడు రాజ్ షాక్ లో ఉన్నాడు తనకి ఏమీ అర్థం కాలేదు రమ్య చనిపోయింది అని తెలియగానే తన బ్రైన్ పని చేయడం ఆపేసింది ఈ విషయం చెప్పడానికి మౌనిక దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అక్కడ మౌనిక స్మార్ట్ వాచ్ లో రెండు పల్స్ రేట్ చూపిస్తూంది ఏంటి అని చూస్తే అందులో రమ్య పల్స్ రేట్ కూడా చూపిస్తూ ఉంది దాంతో మల్లికా నీ అడిగాడు అప్పుడు మల్లికా “అక్క మౌనిక హెల్త్ గురించి అలాగే తనకు ఎప్పుడైనా ఏమైనా అయితే మౌనిక కీ తెలియాలి అని అలా రెండు పల్స్ రేట్ ఇద్దరికి ఎప్పుడు తెలుస్తూ ఉండాలి అని అక్క అలా డిజైన్ చేయించి స్పెషల్ గా లండన్ నుంచి రెండు వాచీలు తెప్పించింది” అని చెప్పింది దాంతో రాజ్ ఆలోచిస్తూ ఉంటే సడన్ గా రమ్య నుంచి ఫోన్ వచ్చింది హడావిడి గా ఎత్తాడు “హలో రమ్య ” అని అడిగాడు దానికి రమ్య “రాజ్ నేను సేఫ్ గా ఉన్న కాకపోతే కొంచెం చెయ్యి విరిగింది హాస్పిటల్ కి వెళ్లుతున్న చెర్రీ నాకూ చెప్పాడు అందుకే నీకు ఒక మాట చెప్పాలి అని ఫోన్ చేశా నువ్వు ఎక్కడ ఆవేశపడుతావు అని నేను మళ్లీ ఫోన్ చేసే వరకు ఏమీ చెయ్యెద్దు” అని I love you చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత చెర్రీ వైపు చూసి “Dr గోపీనాథ్ టి ఎస్టేట్ రోడ్” అని చెప్పి పడుకుంది చెర్రీ ఆ అడ్రస్ కీ వెళ్లమని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చిన అతని తో చెప్పాడు అక్కడికి వెళ్లిన తర్వాత ఒక అతను కార్ రీపేర్ చేస్తూ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్లి చెర్రీ డాక్టర్ నీ కలవాలీ అన్నాడు అప్పుడు అతను నేనే డాక్టర్ అని పేషెంట్ నీ చూడడానికి వచ్చి రమ్య నీ చూసి షాక్ వెంటనే తనని లోపలికి తీసుకోని వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు చెర్రీ తో తన ఫోన్ తీసుకోని డాక్టర్ తులసి కీ ఫోన్ చేసి ఇవ్వు అన్నాడు చెర్రీ ఆ డాక్టర్ కీ ఫోన్ చేసి గోపి కీ ఇచ్చాడు గోపి తనకి కావాల్సిన మెడికల్ equipment ఇంక మెడిసిన్ కూడా చెప్పి తీసుకోని రమ్మని చెప్పాడు.