న్యాయం 790

ఇన్స్పెక్టర్ : నిన్న సాయంత్రం అతను నమాజ్ చేసి మసీదు నుంచి వస్తుంటే మఫ్టీ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అతని ఇంటి వరకు ఫాలో చేసి అతని అతనికి షెల్టర్ ఇచ్చిన చరణ్ నీ కలిపి అరెస్ట్ చేశాం మేడమ్

రమ్య : ఉస్మాన్ గురించి మీకు ఎలా తెలిసింది

ఇన్స్పెక్టర్ : అది మా సెక్యూరిటీ అధికారి ఇన్ఫార్మర్ ద్వారా మేడమ్

రమ్య : అవును మీరు ఎఫ్ ఐ ర్ లో ఉస్మాన్ ఉగ్రవాద సంస్థలకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాడు అని రాశారు అవునా

ఇన్స్పెక్టర్ : అవును మేడమ్ అతని లాస్ట్ 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ లు చూసి అతను ఉగ్రవాద సంస్థలకు చెందిన ప్రతినిధులకు డబ్బు సహాయం చేస్తున్నాడు అని తెలుసుకుని అరెస్ట్ చేశాము

రమ్య : అతని బ్యాంక్ స్టేట్మెంట్ అధరం గా అతని అరెస్ట్ చేశారు అంటారు నోట్ థిస్ పాయింట్ your honor ఇంతకీ ఏ బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ కలెక్ట్ చేశారు మీరు

ఇన్స్పెక్టర్ : axis bank మేడమ్

రమ్య : ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి your honor

అప్పుడు రమ్య ఉస్మాన్ కీ సంబందించిన ఒక బ్యాంక్ పాస్ బుక్ కోర్టు కీ ఇచ్చి “your honor ఉస్మాన్ అలీ భాష అనే నా క్లయింట్ గత పది సంవత్సరాల నుంచి sbi కూకట్పల్లి బ్రాంచ్ లో తప్ప మరి ఏ ఇతర sbi బ్రాంచ్ లో కానీ ఇంకో బ్యాంక్ లో కానీ అతని అకౌంటు లేదు అందుకు రుజువు కోసం అతని cbil రిపోర్ట్ కోర్టు వారికి అందజేయడం జరిగింది cbil రిపోర్ట్ ఒక వ్యక్తి ఈ రోజులో ఏ బ్యాంక్ లో తను అకౌంటు హోల్డర్ గా ఉన్నాడు అతనికి పలాన లోన్ ఇవ్వాలి అంటే అతని అకౌంటు ట్రాన్సాక్షన్స్ ప్రకారం అతని ఇయర్ ఆడిట్ చేసి minimum 700 పాయింట్స్ కానీ లేకుంటే అతనికి ఎలాంటి లోన్ మంజూరు కాదు నా క్లయింట్ కీ వచ్చే జీతం 15,000 అందులో సగం తన హౌస్ లోన్ లో జమ అవుతుంది ఇది ఇండియన్ ఇన్కం టాక్స్ వాళ్లే ఈ cbil రిపోర్ట్ ఇస్తారు ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే నా క్లయింట్ ఉస్మాన్ కీ axis bank లో అకౌంటు లేదు అనేది స్పష్టంగా ఉంది ఇంక మన ఇన్స్పెక్టర్ గారు కోర్టు కీ ఎవిడెన్స్ కింద ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ అంతా axis bank లో మేనేజర్ గా పనిచేస్తున్న ఆయన భార్య పనితనం అదే పేరు తో ఉన్న వేరే కస్టమర్ వివరాలు మార్చి దాని నా క్లయింట్ మీద తప్పుడు ఎవిడెన్స్ గా వాడారు సార్ దయ చేసి దీని పరిగణనలోకి తీసుకోవాలి అని కోరుతున్నాను your honor దాంతో పాటు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ విరాజ్ గారిని క్రాస్ examine చేయడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను ” అని చెప్పింది రమ్య దానికి రాజ్, ప్రభాకర్ తో పాటు జడ్జ్ మనోహర్ కూడా షాక్ అయ్యారు.

రమ్య, రాజ్ నీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి రమ్మని చెప్పేసరీకి అందరూ షాక్ అయ్యారు అప్పుడు జడ్జ్ గారు “డిఫెన్స్ లాయర్ గారు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విరాజ్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి సరైన కారణం ఏమిటో కోర్టు వారికి వివరించిండి” అని అడిగారు దాంతో రమ్య “your honor లాయర్ విరాజ్ గారి వాదనలు విన్న అనంతరం నాకూ ఆయన మరిచి పోయిన కొన్ని విషయాలు గుర్తు చేయాలని అనిపించింది అంతే కాకుండా ఆయన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని నా అభిప్రాయం దానికి కోర్టు వారు లాయర్ గారు ఒప్పుకుంటేనే నేను proceed అవుతాను” అని చెప్పింది దాంతో అప్పుడే ఒంటి గంట సమయం అయినట్లు గడియారం గంట కొట్టడం తో జడ్జ్ గారు వాదన నీ లంచ్ తర్వాత వాయిదా వేశారు దాంతో అందరూ బయటకు వెళ్లారు అప్పుడు రాజ్, రమ్య నీ పక్కకు లాకుని వెళ్లి “ఎమైంది నీకు అసలు ఎందుకు ఎవరో కొత్త మనిషి నీ చూసినట్లు చూస్తూన్నావు అసలు నువ్వు నన్ను ఇలా దూరం పెడుతుంటే నా గుండె కోసినట్టు ఉంది నువ్వు లేని ఈ 8 సంవత్సరాల జీవితం 8 యుగాలుగా ఉంది ఇంక ఈ ఎడబాటు నా వల్ల కాదు నేను నీ కోసం ఇంతలా తప్పిస్తూంటే నీకు అర్థం కావడం లేదా” అని కంట్లో నీరు కారుతున్న విషయం కూడా గుర్తించకుండా తన ప్రేమను బాధ రూపంలో చెప్పాడు విరాజ్, తన బాధ చూసి రమ్య గుండె కూడా కరిగింది కానీ తన గతం తాలూకు చేదు అనుభవాలు కళ్ల ముందు కనిపించే సరికి తన లో నుంచి వస్తున్న తన ప్రేమ సందేశాన్ని కూడా అణిచి పెట్టి తన కంట్లో నీరు కూడా రాకుండా తనను తాను అదుపు చేసుకుని రాజ్ నీ పక్కకు తోసి బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ అద్దం ముందు గొంతు నుంచి తన స్వరం కూడా వినిపించకుండా అరుస్తూ, తన మనసులోని వేదన నీ కంటి నీరు ఆకారం లో బయటకు వదిలింది రెండు నిమిషాల తర్వాత తన మొహం మీద నీళ్లు చల్లుకొని మళ్లీ తన గంభీరమైన మొహం లోకి వచ్చి కోర్టు హాల్ లోకి వెళ్ళింది.

రమ్య కోరికను జడ్జ్ గారు ఆమోదించి విరాజ్ నీ క్రాస్ ఎగ్జామిన్ కోసం పిలిచారు విరాజ్ తన లాయర్ కోట్ విప్పి బోనులోకీ వెళ్లాడు.

రమ్య : సార్ మీరు ఎక్కడ లా చేశారు

రాజ్ : kvl లా ఇన్స్టిట్యూట్ జలంధర్ పంజాబ్

రమ్య : మీ నాన్నగారు ఏమీ చేసేవారు

రాజ్ : crpf లో కమాండర్ గా పని చేసేవారు

రమ్య : point to be noted your honor మరి మీకు ప్రభుత్వం ఒక జవాను కు ఇచ్చే గన్ కీ ఒక ఉగ్రవాద సంస్థ వాడే గన్ కీ తేడా తెలియద అని అడిగింది దాంతో రాజ్ ఎలాంటి జవాబు చెప్పలేక పోయాడు అప్పుడు మళ్లీ రమ్య అవును మీరు హ్యూమన్ రైట్స్ లాయర్ అయ్యి ఉండి ఒక రేప్ అండ్ మర్డర్ కేసు ఎందుకు వాదించాలి అనుకున్నారు అని అడిగింది