న్యాయం 790

కార్ లో హోటల్ కీ తిరిగి వెళుతూ ఉంటే రమ్య కీ ఇందాక జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది “వాడు ఇంకా నన్ను అంతే పిచ్చిగా లవ్ చేస్తూన్నాడా ఇన్ని రోజులు వాడిని అనవసరం గా బాధ పెట్టా కానీ నేను వాడి దగ్గర నిజం దాచాడానికి కారణం వాడి ఆవేశం అందుకే వాడిని వదిలి ఉండాలేను అని తెలిసిన కూడా అదే బాధ లో ఈ 8 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న నాకూ ఒక తోడు అవసరం అన్న విషయం కూడా మరిచా” అని రాజ్ నీ బాధ పెట్టినందుకు తను బాధ పడుతుంది, అప్పుడు మనోహర్ “అబ్బాయిలు 3 టైపు ఉంటారు మొదటి టైపు చిల్లర వేషాలు వేస్తూ అమ్మాయిలని ఏడిపిస్తు వాళ్ల జీవితం నాశనం చేసే కీచకులు, రెండో టైపు నమ్మి వచ్చిన అమ్మాయికి గుండెల్లో గుడి కట్టి, ఒక్కోసారి ఆ అమ్మాయి ప్రేమ తనకు అందదు అని తెలిసి దూరం నుంచి మౌనంగా ప్రేమిస్తూ ఉంటారు మూడో టైపు వీలకు ఓపిక ఎక్కువ ఛీ కొట్టిన అమ్మాయి తో ఎస్ చెప్పించే వరకు దండయాత్ర చేస్తూనే ఉంటారు చెర్రీ, విరాజ్ సార్ రెండో టైప్ నేను మూడో టైప్ ” అని చెప్పాడు దానికి రమ్య నవ్వింది చాలా రోజుల తర్వాత మొదటి సారి రమ్య మొహం లో సంతోషం చూశాడు మనోహర్ కానీ అది ఎక్కువ సేపు లేదు వాళ్లు హోటల్ కీ తిరిగి వెళ్లి టివి పెడితే అందులో ఉస్మాన్, చెర్రీ నీ terrorists అని చెప్పి అరెస్ట్ చేశారు అని న్యూస్ వచ్చింది అది చూసి రమ్య మనోహర్ షాక్ అయ్యారు.

టీవీ లో చెర్రీ ఉస్మాన్ మీద వస్తున్న న్యూస్ చూసి రమ్య మనోహర్ ఇద్దరు షాక్ అయ్యారు ఒక సమస్య పరిష్కారం అయ్యింది అనుకునే లోపు ఇంకో సమస్య వస్తోంది ఏంటి అని ఆలోచిస్తే అప్పుడే ప్రభాకర్ నుంచి రమ్య కీ ఫోన్ వచ్చింది “ఏంటి మేడమ్ న్యూస్ చూశార మొదటి రెండు మ్యాచ్ లు మీరు గెలిచారు మూడో ఆటకు అయిన నేను సిద్ధంగా ఉండాలి కదా అందుకే ఈ మ్యాచ్ లో డైరెక్ట్ సిక్స్ కొట్టా” అని పొగరు గా నవ్వుతూ అన్నాడు ఇది విన్న రమ్య “నాకూ నీ లాగా మొత్తం guards పెట్టుకొని ఆట ఆడటం రాదు నేను నువ్వు వేసే తరువాత ఎత్తు కూడా ముందే పసిగట్టి నీ ఆట కు చెక్ పెట్టే రకం” అని చెప్పి ఫోన్ పెట్టేసి కోపం లో తన ముందు ఉన్న ఫ్లవర్ వాజ్ నీ విసిరేసి గట్టిగా అరిచింది రమ్య, మనోహర్ నీ పంపి ఉస్మాన్ కీ సంబంధించిన వివరాలు అని కనుక్కొని రమ్మని చెప్పింది ఆ తర్వాత షవర్ కింద స్నానం చేస్తూ ఆలోచిస్తూ ఉంది రమ్య అసలు ఏమీ జరిగింది అని అప్పుడు సాయంత్రం క్యాంటీన్ లో తను చెర్రీ తో మాట్లాడుతూ ఉంటే తన పక్క నుంచి వెళ్ళుతున్న ఒక కానిస్టేబుల్ తన ఫోన్ లో ఉస్మాన్ ఫోటో తీయడం గుర్తుకు వచ్చింది వెంటనే రమ్య బయటకు వచ్చి తన పాత ఫ్రెండ్ ఒకరు CBI లో పని చేస్తున్నాడు అతనికి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రాకేష్ ఫోన్ కీ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది అతను ఆ ఫోన్ నెంబర్ ద్వారా అతనికి ఆ రోజు ఉదయం నుంచి వచ్చిన ఫోన్లు what’s app మెసేజ్ లు అని రాకేష్ ఫోన్ నెంబర్ ద్వారా అతని ఫోన్ imi నెంబర్ పట్టుకొని మొత్తం ఫోన్ డాటా హాకింగ్ చేసి ఆ వివరాలు అని రమ్య కీ పంపించాడు అప్పుడు రమ్య రాకేష్ కీ కానిస్టేబుల్ కీ సంబంధించిన what’s app చాట్ మొత్తం కలెక్ట్ చేసింది ఈలోగా మనోహర్ ఉస్మాన్ కీ సంబంధించిన మొత్తం అని వివరాలు రమ్య కీ పంపించాడు.

మరుసటి రోజు మనోహర్ వెళ్లి ఉస్మాన్, చెర్రీ ఇద్దరికి బైల్ కోసం సంతకం తీసుకుని వాళ్ళని సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్కడ ఎప్పుడు ఎలా అరెస్ట్ చేశారు లాంటి వివరాలు సేకరించాడు ఆ తర్వాత రెండు రోజులకు వాళ్ళని కోర్టు లో అప్పగించారు సెక్యూరిటీ అధికారి వాళ్లు ఈ సారి పకడ్బందీగా అన్ని సాక్ష్యాలు కరెక్ట్ గా కలెక్ట్ చేసి పెట్టారు దాంతో వాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఉస్మాన్ a1 అతనికి ఆశ్రయం ఇచ్చినందుకు చెర్రీ నీ a2 గా పెట్టారు అందుకు ఉస్మాన్ మీద సెక్షన్ 135 ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం అందించినందుకు, సెక్షన్ 136a ఉగ్రవాద సంస్థలకు యువత నీ చేరుస్తున్నాడు అని ఇలా నాలుగు ఐదు సెక్షన్ల కింద ఉస్మాన్ నీ అరెస్ట్ చేశారు అప్పుడు రాజ్ చెర్రీ నీ క్రాస్ క్వశ్చన్ కీ పిలిచారు

రాజ్ : మిష్టర్ చరణ్ మీరు టెన్నిస్ చాంపియన్ కదా ఎన్ని టోర్నమెంట్స్ లో ఆడారు

చెర్రీ : దాదాపు ఒక పన్నెండు దాక ఆడాను సార్

రాజ్ : మీకు ఉస్మాన్ ఎన్ని సంవత్సరాలుగా తెలుసు

చెర్రీ : ఉస్మాన్ భాయ్ నాకూ ఎనిమిది సంవత్సరాలుగా తెలుసు సార్ నా టెన్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను భాయ్ దగ్గరే కోచింగ్ తీసుకుంటున్నా

రాజ్ : ఉస్మాన్ భాయ్ ఏంటి

చెర్రీ : అంటే ఆయన నాకూ అన్న లాంటి వాడు అందుకే భాయ్ అని పిలుస్తా

రాజ్ : వావ్ your honor unity in diversity మన దేశ నినాదం దాని ఇలా కళ్ల ముందు చూస్తూ ఉంటే గర్వంగా ఉంది సరే మిష్టర్ చరణ్ మీరు ఉస్మాన్ నీ సోదర భావంతో చూస్తున్నారు కానీ అది గౌరవం తో వచ్చిందా లేదా అతను రేపిన విద్వాంసక ప్రసంగం వల్ల వచ్చిందా

చెర్రీ : సార్ ఉస్మాన్ భాయ్ ఈ దేశం అంటే గౌరవం ఎక్కువ ఎప్పటికైనా నను నేషనల్ టీం కీ పంపాలి అని నేను ఇండియా కోసం మేడల్ గెలవాలి అని కళలు కన్నాడు

దానికి రాజ్ వెంటనే ఒక ఫోటో తీసి చూపించాడు అది చూసి షాక్ అయ్యాడు చెర్రీ అది తన ఫేస్బుక్ అకౌంటు లో చాలా పాత ఫోటో తను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో నేషనల్ మీట్ కోసం ధర్మశాల వెళ్లినప్పుడు దిగిన ఫోటో అది అందులో ఉస్మాన్ తో పాటు చెర్రీ కూడా గన్ తో దిగిన ఫోటో అది అప్పుడు చెర్రీ రమ్య వైపు చూశాడు దానికి రమ్య పర్లేదు చెప్పు అన్నట్టు సైగ చేసింది అది గమనించిన రాజ్ “వావ్ రమ్య నీ క్లయింట్ కీ హింట్ ఇస్తున్నావు” అని అన్నాడు దానికి రమ్య “I object your honor మిష్టర్ విరాజ్ నీ తన మాటలను అదుపు లో ఉంచుకుని మాట్లాడమని చెప్పండి నేను అతని భార్య నీ కాదు ఇది ఏమీ పార్క్ కాదు నన్ను ఏకవచనం లో పిలవడానికి” అని అరిచింది దానికి జడ్జ్ గారు రాజ్ వైపు చూసి ఏంటి ఇది అన్నట్టు సైగ చేశాడు దానికి రాజ్ క్షమాపణలు కోరాడు, ఆ తర్వాత రాజ్ మళ్లీ చెర్రీ నీ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు చెర్రీ “సార్ నేను నేషనల్ మీట్ కోసం ధర్మశాల కీ వెళ్లినప్పుడు అక్కడ ఉస్మాన్ భాయ్ ఫ్రెండ్ ఒక్కరూ బార్డర్ సెక్యూరిటీ లో పని చేస్తున్నారు ఆయన కీ సంబంధించిన గన్ అది దాంతో మేము సరదాగా ఫోటో దిగాము అంతే ఒకవేళ నేను నిజంగా ఒక terrorist organizations కీ పని చేస్తున్నట్లు అయితే ఎందుకు అలాంటి ఫోటో ఫేస్బుక్ లో పెడతాను” అని అడిగాడు అప్పుడు రాజ్ ఏదో ప్రశ్న వేయడానికి ముందే రమ్య “your honor మన పిపి గారు ఇచ్చిన ఫోటో evidence నీ సరిగా చూడండి ఉస్మాన్ పట్టుకున్న గన్ మీద బలిదాన్ సింబల్ ఉంది అది ఒక సైనికుడు ఆత్మ త్యాగం కోసం మన భరత దేశ సైనిక దళాల యొక్క చిహ్నం అది దాని బట్టి నా క్లయింట్ చెప్పేది నిజం అని దాని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను” అని చెప్పింది దాంతో రాజ్ ఒక్క సారి ఆ ఫోటో చూసి “సూపర్ బేబీ” అని అన్నాడు దానికి రమ్య లేచే లోపే జడ్జ్ గారు “మిష్టర్ విరాజ్ ఏంటి ఇది” అని అడిగారు దానికి రాజ్ కూడా సారీ చెప్పాడు.

ఆ తర్వాత రమ్య లేచి ఉస్మాన్ నీ అరెస్ట్ చేసిన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ నీ క్వశ్చన్ చేయడానికి పిలిచింది “ఇన్స్పెక్టర్ గారు ఉస్మాన్ నీ మీరు ఎక్కడ పట్టుకున్నారు” అని అడిగింది