డిటెక్టివ్ 2 105

శేఖర్ చెప్పినదానికి వాళ్లు షాక్ అవ్వడం చూసి నవ్వి తన laptop లో 2017 లో వచ్చిన ఒక న్యూస్ చూపించాడు అందులో చైనా ప్రధాని ఇండియా వచ్చి ఇండియా లోని స్క్రాప్ machinery నీ కొన్న న్యూస్ గురించి ఉంది అది చూసి అందరూ శేఖర్ వైపు అర్థంకానట్టు చూశారు అప్పుడు శేఖర్ చెప్పడం మొదలు పెట్టాడు “2017 లో చైనా మన దేశంలో కొన్న machinery స్క్రాప్ ఏంటో తెలుసా ప్రింటింగ్ స్క్రాప్ ఆర్బిఐ నుంచి పర్చేస్ చేసిన ఆ machinery ద్వారా మొత్తం ఇండియన్ నోట్లు ప్రింట్ చేస్తున్నారు మనం ఇబ్రహీం డెన్ లో చూసిన ప్రింటింగ్ ప్రెస్ మెషిన్ అదే చైనా మన దెగ్గర machinery కొని అది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అమ్మింది దాంతో వాళ్లు తెలివిగా వాళ్ల ఫండ్స్ ఆగిపోయాయి కాబట్టి వాళ్ళు మన దేశంలో డబ్బు కోసం కుక్కలు లాగా వచ్చే వాళ్ళని జతగా చేసుకొని ఇంత పెద్ద మిషన్ ప్లాన్ చేసారు నాకూ ఈ విషయం ఎలా తెలిసింది అంటే ఇప్పుడు ఇండియా లో వచ్చే నోట్ల పైన కొత్త ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉంటే ఇబ్రహీం గాడి అకౌంటు లో ఉన్న అని నోట్ల పైన పాత ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉంది ” అని చెప్పాడు దాంతో అందరికీ అర్థం అయ్యింది చైనా వాళ్లు మన వేలు తో మన కను పొడిచేలా ప్లాన్ చేశారు అని దాంతో ఎటాక్ ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది దాంతో ప్రధాని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తనకు బ్యాచ్ మేట్ అని చంద్రిక చెప్పింది దాంతో రజాక్ తో సహా శేఖర్, చంద్రిక ఢిల్లీ వెళ్లారు.

ఢిల్లీ PMO లో సెక్యూరిటీ ఆఫీసర్ మన్సూర్ అలీ ఆఫీసు లోకి వాళ్లు వెళ్లారు అతను 5 నిమిషాలో వస్తాడు అని అక్కడ ఉన్న ఒక గార్డ్ చెప్పాడు దాంతో వాళ్లు వెయిట్ చేస్తున్నారు అప్పుడే మన్సూర్ అలీ లోపలికి వచ్చాడు అతని చూసి రజాక్ షాక్ అయ్యాడు అది శేఖర్ గమనించాడు చంద్రిక వెళ్లి అతని పలకరించింది అతను రజాక్ నీ చూసి కొంచెం కంగారు పడ్డాడు అప్పుడు అతను వచ్చి శేఖర్ కీ షేక్ హ్యాండ్ ఇచ్చి “మీ గురించి చాలా విన్నాను ఇండియన్ ష్రేలాక్ హోల్మస్” అన్నాడు అప్పుడు శేఖర్ వాడికి షేక్ హ్యాండ్ ఇస్తూ మన్సూర్ చేయి పట్టుకుని వెనకు విరిచి టేబుల్ పైకి తోసి వాడి మెడ పైన మోచేతి తో అదిమి పెట్టి “నువ్వు ఎవరినైన మోసం చేయవచ్చు నన్ను కాదు ఇక్బాల్ చౌదరి అలియాస్ గణేష్ సింగ్ చౌదరి ” అని అన్నాడు శేఖర్ దాంతో అందరూ షాక్ అయ్యారు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ అధ్యక్షుడు యాసిర్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేసిన తర్వాత వాడి ముఖ్య అనుచరుడు ఈ గణేష్ సింగ్ చౌదరి అలియాస్ ఇక్బాల్ చౌదరి వీడిని ఇండియన్ ఆర్మీ చంపినట్టు ప్రూఫ్ ఉంది కానీ ఎలా బ్రతికి ఉన్నాడు అనేది ఇంకా అర్థం కాలేదు దానికి ఇక్బాల్ నవ్వుతూ “మీ గవర్నమెంట్ కే నా బ్యాక్ గ్రౌండ్ verification లో నా గురించి తెలుసుకోలేక పోయింది నువ్వు ఎలా కనిపెట్టావు రా” అని అడిగాడు “ఇలా టాప్ నేషనల్ సెక్యూరిటీ లో రిక్రూట్మెంట్ చేసుకున్నే వాళ్ళకి దేవుడి చైన్ లు వేసుకున్నే పర్మీషన్ లేదు నువ్వు ఏకంగా నీ మెడ పైన నీ బాస్ యాసిర్ వేసిన మీ సంస్థ tattoo నీ దాచి పెట్టడం మరిచి పోయావు దాంతో పాటు నీ సోఫా టేబుల్ ముందు ఉన్న చెస్ బోర్డు లో ఆ రోజు నువ్వు పెట్టిన ఆర్డర్ లోనే నీ చెస్ కాయిన్స్ ఉన్నాయి రజాక్ నిన్ను చూసి భయపడాడు నువ్వు వాడిని చూసి దాంతో కన్ఫర్మేషన్ చేసుకున్నా ” అన్నాడు అప్పుడు ఇక్బాల్ తన టేబుల్ కింద ఉన్న అలారం ప్రెస్ చేశాడు దాంతో సెక్యూరిటీ వాళ్లు వచ్చారు అప్పుడు శేఖర్ వాడిని వదిలేశాడు.

ఆ తర్వాత ఇక్బాల్ ఫైర్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు దాంతో శేఖర్, చంద్రిక ఇద్దరు టేబుల్ కిందకి దూరారు అప్పుడు రజాక్ నీ తీసుకోని ఇక్బాల్ వెళ్లిపోయాడు ఆ టేబుల్ కింద శేఖర్ కీ ఒక grems spray దొరికింది దాని చూస్తే అది 80% ఆల్కహాల్ అని ఉంది దాని గార్డ్స్ పైకి విసిరాడు దాంతో అది పేలి నిప్పులు వచ్చాయి అప్పుడు చంద్రిక తన దెగ్గర ఉన్న రెండు గన్స్ లో ఒక్కటి శేఖర్ కీ ఇచ్చింది “మనం వాళ్ళని చంపకుడదు వాళ్లు వాళ్ల డ్యూటీ చేస్తున్నారు జస్ట్ గాయపరచు” అని చెప్పాడు ఆ మంట రావడంతో తో గార్డ్స్ చెల్లాచెదురుగా పడ్డారు అప్పుడు చంద్రిక, శేఖర్ వాళ్ళని వదిలి అడ్డం వచ్చిన వాళ్ళని గాయపరిచి అక్కడి నుంచి తప్పించుకున్నారు ఆ టైమ్ లో ఇక్బాల్ రజాక్ నీ తనతో పాటు ప్రధాని ప్రైవేట్ ఫ్లయిట్ లో cargo లో పడేసి హైదరాబాద్ కీ వెళ్లాడు చంద్రిక, శేఖర్ ఇద్దరు ఇప్పుడు సెక్యూరిటీ అధికారి లిస్ట్ లో ఉన్నారు ప్రధాని ఆఫీసు పైన దాడి చేశారు అని దాంతో వాళ్ల కోసం హైవే, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లలో పూర్తిగా సెక్యూరిటీ ఆఫీసర్లు వెతుకుతూ ఉన్నారు వాళ్లు ఒక హైవే లో టివి జనాలు లేని ఒక ఢాబా లో ఉన్నారు అప్పుడు ఎలా హైదరాబాద్ పోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక హెలికాప్టర్ వచ్చి ఆ పక్కన ఉన్న గ్రౌండ్ లో దిగింది దాంట్లో నుంచి సౌమ్య, దేవి ప్రసాద్ ఇద్దరు దిగారు “హైదరాబాద్ కీ లిఫ్ట్ కావాలా బావ” అని అడిగాడు దేవి ప్రసాద్ దాంతో శేఖర్ వాడిని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత నలుగురు కలిసి హైదరాబాద్ కీ బయలుదేరారు.

హైదరాబాద్ చేరుకున్న తరువాత దేవి ప్రసాద్ శేఖర్ తో చెప్పాడు “బావ నేను మా కల్నల్ తో మాట్లాడా ఆయన ఆపరేషన్ కీ పర్మిట్ ఇచ్చారు అంతే కాకుండా సెలవుల మీద ఉన్న మా బెటాలియన్ లోని వాళ్లు మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మనం ఈ మిషన్ కచ్చితంగా పూర్తి చేస్తాం” అని చెప్పాడు దాంతో శేఖర్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత అందరూ యాక్టింగ్ స్కూల్ కీ వెళ్లారు అక్కడ శేఖర్ ఆఫీసు లో అందరూ DRDO మ్యాప్ మొత్తం చూస్తున్నారు “హైదరాబాద్ లో మొత్తం మూడు రీసెర్చ్ సెంటర్ లు ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్లాల్సిన సెంటర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రిసెర్చ్ లేబొరేటరీస్ చంద్రయాన్ గుట్ట ఇక్కడ ఈ రిసెర్చ్ సెంటర్ కీ రెండు దారులు ఉన్నాయి ఒకటి 2km radius అవతల ఉన్న బస్తీ రోడ్డు ఇంకోటి మామూలు మెయిన్ రోడ్డు కాబట్టి రేపు టాస్క్ ఫోర్స్ తరుపున కృష్ణ సెక్యూరిటీ వింగ్ లో ఉంటాడు నేను, చంద్రిక, నీ బ్యాచ్ మేట్ లో కొంతమంది తో బస్తి రోడ్డు లో ఉంటాము నువ్వు మిగిలిన బ్యాచ్ మేట్ లతో మిలిటరీ డ్రస్ లో వాళ్లతో కలిసిపోయి లోపలికి రండి మీ మామ ఎలాగో లోపల నుంచి మనకు సిగ్నల్ ఇస్తాడు అప్పుడు మేము బ్యాక్ గేట్ నుంచి ఎంటర్ అవుతాం దానికి మీ మామ నీ ఒక access card మాకు వచ్చేలా చేయమని చెప్పు” అని ప్లాన్ పూస గుచ్చినటు చెప్పాడు శేఖర్, అప్పుడు కృష్ణ “లోపలికి వెళ్లడం ఇంత కష్టం ఉంటే మళ్లీ లోపాల ఎమైన తేడా వస్తే ఉద్యోగం సంగతి దేవుడికి ఎరుగు ముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ మిషన్ పూర్తి చేయాలి ” అన్నాడు.