డిటెక్టివ్ 2 105

దాంతో శేఖర్ వాడిని కొట్టి ఆ ప్రొఫెసర్ భార్య నీ కాపాడమని ఒక మెసేజ్ కృష్ణ కీ పంపి తను లోపలికి వెళ్ళాడు లోపల ఇబ్రహీం జావిద్ నీ తన కంట్రోల్ లో పెట్టుకొని జావిద్ ల్యాబ్ లో తన missile కీ సంబంధించిన టెక్నికల్ పనిలో రజాక్ చేసిన చీప్ కీ సంబంధించిన మార్పులు ఏవో చేస్తూ ఉన్నారు అప్పుడు శేఖర్ జరిగేది అంతా వీడియో తీస్తున్నాడు ఆ ప్రొఫెసర్ చేసిన missile అటామిక్ ఎనర్జీ తో హైడ్రో ఎనర్జీ నీ లాగుతుంది ఇప్పడు ఆ చీప్ తో కనుక అది లింక్ అయితే అది అక్కడికక్కడే బ్లాస్ట్ అయి దాని ద్వారా వచ్చే ఎనర్జీ తరంగం వల్ల మొత్తం సిటీ లో ఉన్న గ్రౌండ్ వాటర్ లీక్ అయి సిటీ మొత్తం మునిగి పొత్తుంది అప్పుడే రజాక్ వచ్చాడు అని ఇబ్రహీం వాళ్ల లీడర్ కీ శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు అప్పుడు ఆ లీడర్ రజాక్ నీ చంపేయమని చెప్పాడు అప్పుడు వాడు రజాక్ నీ కాల్చే సమయంలో శేఖర్ తన గన్ తో ఇబ్రహీం నీ వాడితో ఉన్న నలుగురిని కాల్చి చంపాడు అప్పుడు పైన ఉన్న ఇంట్లో కృష్ణ, చంద్రిక చేరి ఒక వైపు వెళ్లి ప్రొఫెసర్ భార్య నీ సోఫా లో పెట్టి కాపలా కాస్తున్న ఇద్దరిని ఒకేసారి కాల్చి చంపారు.

ఆ తర్వాత జావిద్ నీ ఎంక్వయిరీ చేశారు ఎందుకు ఇలా దేశ ద్రోహం చేస్తున్నారని అడిగితే అప్పుడు ఆయన తన కూతురు వాళ్ల దగ్గర ఉంది అని చెప్పాడు ఎప్పుడో చిన్నప్పుడు తప్పి పోయిన తన కూతురిని వాళ్లు ఒక మానవ బాంబ్ నీ చేశారు ఇప్పుడు నేను వాళ్లు చెప్పినది చేయకుంటే నా కూతురు నీ చంపేస్తారు అని ఏడ్వడం మొదలు పెట్టాడు అప్పుడు ఆయన వెనుక సాదియ చిన్నప్పుడు ఫోటో చూశాడు శేఖర్ అప్పుడు సాదియ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది తను చిన్నప్పుడు ఫ్యామిలీ తో ట్రిప్ కీ వచ్చి కాశ్మీర్ లో తప్పి పోయి అక్కడే ఒక అనాధాశ్రమం లో పెరిగాను అని చెప్పింది అది గుర్తు వచ్చి వెంటనే దేవి ప్రసాద్ కీ వీడియో కాల్ చేశాడు అప్పుడు సాదియ వాడు వంట చేస్తూ ఉన్నారు అప్పుడు సాదియ కీ జావిద్ నీ చూపించాడు అప్పుడు సాదియ తన తండ్రి నీ గుర్తు పట్టింది దాంతో సాదియ కీ వాళ్ల అమ్మ నాన్న కీ ఒకేసారి ఆనందభాష్పాలు రాలాయి.

శేఖర్ సాదియ నీ తన అమ్మ నాన్న తో కలిపేసరికి అందరూ సంతోషంగా ఉన్నారు, కొని సంవత్సరాల క్రితం జావిద్ ఫ్యామిలీ కాశ్మీర్ కీ వెళ్లారు అప్పుడు అక్కడ మత కలహాలు మొదలయ్యాయి దాంతో పాటు టూరిస్ట్ లను కూడా చంపడం మొదలు పెట్టారు అప్పుడు మిలిటరీ వాళ్లు టూరిస్ట్ లను తిరిగి పంపడానికి పెట్టిన లారీ లో ఎక్కుతుండగా ట్రక్ పైన దాడి చేశారు అప్పుడు వెంటనే బండి నీ పోనిచ్చిన సమయంలో ట్రక్ ఎక్కుతున్న సాదియ కింద పడింది ఆ తర్వాత గొడవ గుంపులో కలిసి పోయింది ఆ తర్వాత ఒక షాప్ లో దాకుంది గొడవలు అని సర్దుకున్నాక బయటకు వచ్చి ఏడుస్తు చలికి వణుకుతూ ఉంది అప్పుడు వచ్చిన మిలిటరీ వాళ్లు తనని rescue క్యాంప్ కీ తీసుకుని వెళ్లారు సాదియ నీ ఎప్పుడు బయటికి పంపే వాళ్లు కాదు తన ఊరు హైదరాబాద్ అని తెలుసుకాని అడ్రస్ గుర్తు లేదు దాంతో వాళ్లు తనని ఒక అనాధాశ్రమం లో చేర్పించారు, సురక్షిత ప్రాంతానికి వెళ్లిన తర్వాత జావిద్ వాళ్ల కూతురు గురించి అడిగారు అప్పుడు కొంతమంది పిల్లల శవాలు పేర్చి ఉంటే అందులో ఒక శవం పైన సాదియ కోట్ చూసి తను చనిపోయింది అని అనుకున్నారు, జునైద్ కీ జావిద్ డిటైల్స్ ఇచ్చిన హఫీజ్ తన గురించి ఎంక్వయిరీ చేయమని చెప్పాడు దాంతో వాళ్ల బలహీనత తెలుసుకున్న హఫీజ్ ఇబ్రహీం తో ఒక జూనియర్ ఆర్టిస్టు తో ఒక వీడియో తీయించి వీలను మోసం చేసి missile నీ వాళ్లకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఉన్నారు కానీ సమయానికి శేఖర్ వచ్చి అని సరి చేశాడు దాంతో మరుసటి రోజు ఉదయం ఫ్లయిట్ కీ వాళ్లు హైదరాబాద్ వచ్చారు, రెండు సంవత్సరాల క్రితం ఇండియన్ ఆర్మీ బేస్మేంట్ పైన పాకిస్తాన్ వాళ్లు దాడి చేశారు అప్పుడు కాశ్మీర్ లో చాలా గొడవలు జరుగుతున్నాయి అప్పుడు మార్కెట్ కీ వచ్చిన సాదియ మీద ఎటాక్ జరుగుతున్న టైమ్ లో దేవి ప్రసాద్ తనని కాపాడాడు అలా సాదియ దేవి ఇద్దరు లవ్ లో పడి పెళ్లి చేసుకున్నారు, సాదియ రాగానే వాళ్ల సంతోషం కీ అవ్వదలు లేవు తాము లేకుండా తన పెళ్లి జరిగింది అని బాధ పడిన కూతురు తల్లి కాబోతుందని సంతోషం తో తను తిరిగి వచ్చినందుకు గ్రాండ్ గా ఇంట్లో ఫంక్షన్ చేశారు.

ఇలా ఉంటే ఇన్ని రోజులు తనకి మర్యాద ప్రేమ పంచిన వాళ్లు తనని చంపాలీ అనుకోవడం రజాక్ కీ షాక్ ఇచ్చింది దాంతో వాడు డైలమాలో పడ్డాడు అప్పుడు శేఖర్ వాడిని తీసుకోని మసీదు కీ వెళ్లాడు అక్కడ బయట హిందూ ” లు ఎలా ఐకమత్యం తో వ్యాపారాలు చేస్తున్నారో ఎలా సోదర భావంతో కలిసి ఉంటున్నారో చూపించాడు అది చూసి రజాక్ కొంచెం ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత లోపలికి తీసుకోని వెళ్లి రజాక్ తో పాటు శేఖర్ కూడా నమాజ్ చేశాడు అప్పుడు రజాక్ నీ కుర్చోబేటి “నువ్వు మొన్నటి వరకు నా వాళ్లు అనుకున్న వాళ్లు నీ వల్ల వాళ్ళకి ప్రమాదం అని తెలియగానే నిన్ను చంపాలి అని చూశారు సాటి ” అయిన ఆ ప్రొఫెసర్ నీ మోసం చేశారు మొన్నటి వరకు నీతో అవసరం ఉంది కాబట్టి నీ మీద ప్రేమ నటించారు ఇప్పుడు రిస్క్ అని నిన్ను చంపాలీ అని చూశారు నీ లక్ష్యం ఏంటి అబ్దుల్ కలాం గారి లాగే పెద్ద సైంటిస్ట్ అవ్వాలి అని కదా ఇప్పుడు నువ్వు ఈ దేశం కోసం ఉపయోగించిన తెలివి నీ అదే దేశం నీ నాశనం చేయాలి అనుకున్నావు అని ఆయనకు తెలిస్తే ఎంత బాధ పడుతారో ఊహించుకో నా జీవితం మొత్తం ఈ దేశం కోసం త్యాగం చేయడానికి నేను రెడీ అదే దేశం జోలికి వస్తే చంపడానికి కూడా ఆలోచించను ” అని చెప్పాడు అది అంత విన్న రజాక్ ఏడుస్తు శేఖర్ నీ కౌగిలించుకున్నాడు.

ఆ తర్వాత అందరి భయం ఇప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో ఇంతవరకు తెలియదు అసలు ఆ చీప్ ఎక్కడ అని అందరూ ఆలోచిస్తూ ఉంటే శేఖర్ ఆ చీప్ తీసి చూపించాడు అందరూ షాక్ అయి చూశారు అప్పుడు చంద్రిక అడిగింది “నీకు ఆ చీప్ ఎలా దొరికింది” అని అప్పుడు శేఖర్ చెప్పడం మొదలు పెట్టాడు “సౌమ్యా తన బాయ్ ఫ్రెండ్ కోసం ఈ షూ కొనింది కాకపోతే అతనికి సైజ్ సరిపోలా అందుకే బెంగళూరు వెళుతూ నను కలిసి సారీ చెప్పింది తన వల్ల వచ్చిన misunderstanding కీ నాకూ డివోర్స్ అయ్యాయి అని ఆ తరువాత షూ డిజైన్ నచ్చి నేను తీసుకున్న నాకూ రోడ్డు మీద నడిచే అప్పుడు రాళ్లనీ తనడం అలవాటు అలా కొట్టినప్పుడు షూ తెగింది దాంతో ఈ చీప్ దొరికింది షూ కీ సంబంధించిన ఏదో అనుకున్నా అది ఇక్కడే దాచి పెట్టా ఆ తర్వాత ఆ ముసలాయన చెప్పాడు కదా చీప్ అని అప్పుడే నాకూ అర్థం అయింది ఈ చీప్ అయి ఉంటుంది అని తరువాత కాశ్మీర్ లో దీని నమూనా చూసినప్పుడు కన్ఫర్మేషన్ చేసుకున్నా అంతే కాకుండా ఈ మిషన్ కీ డబ్బులు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటే నాకూ ఇంకో విషయం తెలిసింది ఈ మొత్తం మిషన్ కీ ఫండ్స్ మన గవర్నమెంట్ ఏ ఈ ఉగ్రవాద సంస్థ కీ ఇచ్చింది ” అని చెప్పాడు దానికి అందరూ షాక్ అయ్యారు.