ప్రేమ కోసం Part 2 45

నేను దొంగతనం చేస్తున్నాను అని అత్తకు అనుమానం వచ్చి నీతో అదే విష్యం చెప్పింది. నీవు నన్ను నిలదీస్తే అది రోజు నీవు నాకు ఇచ్చే బెట లో నుంచి తీసి కొంటున్నాను అని చెప్పను. ఈ సంఘటనే మా ఇద్దరి కలపడానికి ప్రకృతి వేసిన మొదటి అడుగు.

పక్క రోజు మధ్యాహ్నం సమయం లో

ప్రశాంతి అత్త:- మీ మామయ్య పేరు చెప్పి ఎందుకు రోజు ఎదో ఒక తినుబండారం తీసుకొని వస్తున్నావు.

నేను:- అత్తా మామయ్య వ్యాపారం లో చాలా బిజీ గా ఉంటాడు. ఒడ్డి కోసం వచ్చే పెద్ద వాళ్ళ కు మామయ్య ఎదో ఒక మిఠాయి ఇచ్చి పంపేవాడు. మామయ్య ఆ పని ఎందుకు చేస్తున్నాడు అని అడిగితె. ఒడ్డి ఊరులో చాల మంది ఇస్తారు కానీ మనం చేసే ఈ చిన్ని చిన్ని పనులు మన మీద నమ్మకం పెంచుతాయి. మన అని ఫిల్లింగ్ తీసుకొని వస్తుంది. డబ్బు అవసరం వచ్చిన ప్రతి సారి మన షాప్ గుర్తుకు వస్తుంది.

మనుషుల మధ్య సంబంధం నిలబడాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చెయ్యాలి. ఇది వ్యాపారానికి, సంసారానికి కూడా వర్తిస్తుంది.అందుకే చిన్న మామయ్యను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎదో ఒకటి తీసుకొని వేళ్ళ మంటాను.

పెద్ద మామయ్య నీకు మార్కెట్ నుంచి ఏమి తీసుకొని రావడం చూడలేదు. మామయ్య వ్యాపారం లో పడి మర్చిపోతున్నాడు అని నేను మామయ్య పేరు చెప్పి తీసుకొని ఇస్తున్నాను.

ప్రశాంతి అత్త:- మీ పెద్ద మామయ్య మార్కెట్ నుంచి ఎదో ఒకటి ఇంటికి తీసుకొని వెళ్ళమని మీ చిన్న మామయ్య కి చెప్పాడు. మరి మీ పెద్ద మామయ్య నాకు ఎందుకు తీసుకొని రావడం లేదు అని అడగలేదా..

నేను:- అడిగాను అత్తా… ఆ విష్యం చెపితే నీవు బాధ పడతావు..

ప్రశాంతి అత్త:- బాధ పడను చెప్పు…

నేను:- చిన్న అత్త అలిగి పుట్టింటికి వెళ్తే అడగడానికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. మీ పెద్ద అత్తా అలిగిన, ఎంత గింజుకున్న నేను తప్ప వేరే దారి లేదు.. (ఆ మాట వినగానే అత్తా మొకం మాడిపోయింది)

ఆ రోజు మొదలు కొని నేను మధ్యాహ్నం భోజనం చేసినంత సేపు పక్కనే కూర్చుని ఉండేది. ఆలా కూర్చునే క్రమం లో ఇద్దరం పిచ్చాపాటి మాటలాడుకొనేవాళ్ళం. సాయంత్రం పూజకు పవులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు టీ కూడా కలసి తాగే వాళ్ళం. అత్తా మాట్లాడడం మొదలు పెట్టినతర్వాత అత్త లో ఒంటరితనం ఉంది అని గమనించి నేనుకూడా అమ్మలక్కల లాగా మాట్లాడేవాడిని. ఆలా మా ఇద్దరి మధ్యన చనువు మొదలవ్విన్ది.

భోజనం చేసినప్పుడు పక్కన కూర్చునే పెద్ద అత్తా ఇప్పుడు రోజు నాతో భోజనం చెయ్యడం మొదలు పెట్టింది. భోజనం చెయ్యడం నుంచి నేను భోజనానికి ఎప్పుడు వస్తాను అని ఎదురు చూసే పరిస్థికి వచ్చింది .. నేను కూడా ఎప్పుడు అత్తా తో సరదాగా ఉండేవాడిని.. ఎప్పుడు ఆటపట్టించేవాడిని..

ఒకసారి మన కేసు నిమిత్తము లాయర్ అఖిల మేడం వచ్చినప్పుడు. పెద్ద అత్తా చిన్న అత్తను కలిశారు. అప్పుడు

నేను :- అత్తలు నేను మీ దగ్గర కొన్ని విషయాలు దాచాను.. అవ్వి ఈ రోజు మీకు చెప్పి నా మనసుమీద ఉన్న భారం తొలిగించుకోవాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇంటర్, డిగ్రీ చదివాను.. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వను… హెడ్ మాస్టర్ గారి ద్వారా అఖిల మేడం సహాయం చేసారు.. మీకు తెలియకుండా చేసినందుకు నన్ను క్షమించండి..నాకు ఇంకా చదువుకోవాలి అని ఉంది కానీ అది మీ ఇద్దరికి తెలియకుండా చదువుకోవడం ఇష్టం లేదు. అఖిల మేడం గారు నన్ను లా చెయ్యమని చెపుతున్నారు.నేను కాలేజీ కి వెళ్లకుండా చదువుకొనేలాగా మేడం గారు చూసుకుంటారు అని చెప్పారు మీకు ఇష్టమైతే నేను చదువుకుంటాను.

అఖిల మేడం:- కృష్ణ బయట నా కార్ లో ఉన్న బాగ్ తీసుకొని రా అని నన్ను పంపారు..

చుడండి ఇప్పుడికే కృష్ణ పేరు మీద మీ బిజినెస్ ఉన్నాయి మీ ఆస్తుల్ని ఒక ట్రస్ట్ కిందకు తీసుకొని వస్తున్నాము. దానికి మీ ఇద్దరు డైరెక్టర్స్ మనకు ఉంకో డైరెక్టర్ కావాలి. రేపు ఏ సమశ్య వచ్చిన మనం వాడి మీద పెట్టడానికి. వాడిని లా కాలేజీ లో జాయిన్ చేసి ఫెయిల్ అవ్వేలాగా నేను చేస్తాను..వాడిని మన గుప్లిలో ఉంచొచ్చు.. ఎవ్వరికి తెలియకుండా మన ఎగ్జిట్ కార్డు కింద వాడిని తయారు చేస్తుంటే. వాడు ఇప్పుడు వరకు అత్తలకు తెలియకుండా నేను చదివాను.. ఇకమీదట వాళ్లకు తెలియకుండా ఏమి చెయ్యను అని మంకు పట్టు పట్టుకొని కూర్చున్నాడు. ఈ విష్యం మన నాలుగురిమధ్య ఉండాలి.

మీ పిల్లని బయట దేశం లో చదివించి అక్కడ మీ ఆస్తులని తరలించడానికి మనకు ఈ కృష్ణ కావాలి.మేడం మాటలు విన్న అత్తలు సరే అని ఒప్పుకున్నారు..

ఆ సంవత్సరం మీ పెళ్లి రోజు..భోజనానికి వస్తున్నావు అని నాతో అత్తకు పులావ్ పంపించిన రోజు.. నీ తో కలసి తినాలి అని అత్తా నీకోసం ఎదురు చూస్తూ ఉంది. అత్తా తినలేదు అని నేను కూడా తినకుండా నీకోసం ఎదురు చూస్తునాను. మధ్యాహ్నం నాలుగు ఐన నీవు రాలేదు..

నేను:- అత్తా నాకు ఆకలి వేస్తుంది.. కలెక్షన్ కి వెళ్ళాలి..

అత్తా:- భోజనం పెడతాను అంటే వద్దు అన్నావు..

అత్తా భోజనం పెట్టింది. ప్లేట్ లో మొదటి ముద్ద అత్త నోటి దగ్గర పెట్టాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్లి తలుపు తీసాను. ఎదురు గా మామయ్య.

మామయ్య చేతిలో ఉన్న బాగ్ ఇచ్చి ఇది వైజాగ్ లో ఉన్న మన ఆడిటర్ గారికి ఇచ్చి రా అని పంపారు. అలానే ఎంగిలి చెయ్యి తో వెళ్ళిపోయాను.

వైజాగ్ నుంచి వచ్చే సరికి రాత్రి రెండు అవ్వింది. పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి ఆడిటర్ గారు ఇచ్చిన కాగితాలు ఇచ్చి షాప్ కి వెళ్లి పడుకున్నాను.

పక్క రోజు పెద్ద అత్తా వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం భోజనానికి, టీ కి వెళ్లలేదు. రాత్రి క్లబ్ నుంచి మామయ్య ఏవో కాగితాలు కావాలి అంటే కబురుపెడితే అప్పుడు పెద్ద అత్తా వాళ్ళ ఇంటికి వెళ్ళాను.

నేను:- మామయ్య కాగితాలు ఇవ్వమన్నాడు.

ప్రశాంతి అత్తా:- మధ్యాహ్నం భోజనానికి ఎందుకు రాలేదు..

నేను:- ఈ రోజు బయట తిన్నాను..

ప్రశాంతి అత్తా:- కాలజామూన్ బాగుంది..

నేను:- బాగుంటాది కాబట్టి కొన్నాను.. నా చేతి ముద్ద తినకపోయినా.. నా చేతితో కొన్న జామున్ తింటావు అని తెచ్చాను..

ప్రశాంతి అత్తా:- అది నీవు కొన్నావా..అయ్యో అయ్యో.. మీ మామయ్య తెపించారేమో అని అనవసరం గా తినేశానే..

నేను:- అబ్బో.. నీ మొగుడు నీకోసం తెప్పించడం కూడ.. ఈ విడ్డురం ఎప్పుడు నుంచో …

ప్రశాంతి అత్తా:- నిన్న పలావ్ పంపాడు కదా…

నేను:- నీ మొగుడికి అంత బొమ్మ లేదు.. పెళ్లి రోజు కూడా ఏడుపు మొకం పెట్టుకొని ఉంటావు అని.. నీ మొగుడికి చెప్పి నేనే తెచ్చాను…

ప్రశాంతి అత్తా:- మీ మామయ్య తానే పంపానని చెప్పాడు…