భర్త భార్య Part 2 247

గౌతమ్ నవ్వుతూ “అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చిన ఇదే కదా అనేది!!! నేను నీకు అదే సమాధానం చెప్తున్నాను నేను బాగా ఉన్నాను…. నేనే వండుకొని తింటున్నాను…. ఆ ఉద్యోగం వదిలేసి రాలేను…. నువ్వు నా గురించి బెంగ పెట్టుకునే అవసరం లేదు….అని” అని నవ్వుతూ చెప్తాడు

ఇదంతా గౌతమ్ నాన్నగారు చూసి నవ్వుకుంటారు….

గౌతమ్ నాన్నగారు వెంటనే సీరియస్గా ఫేస్ పెట్టి “రేపే పెళ్లిచూపులు కి వెళ్ళాలి సిద్ధంగా ఉండు….”అని చెప్పగానే గౌతమ్ సరే అని అంటాడు…

నెక్స్ట్ రోజు ఉదయాన్నే పది గంటలు అప్పుడు గౌతమ్ రెడీ అయ్యి తన అమ్మానాన్నలతో పాటు నందుని పెళ్లిచూపులు చూసుకోవడానికి వెళతారు…..

@@@@@@@@@

నందు కూడా తన నాన్నగారు నందు కి అంతా చెప్పటం వలన కనీసం గౌతమ్ ఫోటో కూడా చూడకుండానే ఒప్పుకొని ఎలాగైనా ఫస్ట్ పెళ్లిచూపుల లోనే వచ్చే పెళ్లి కొడుకు కి తను నచ్చాలని అందంగా రెడీ అవ్వాలని ఆ వారం రోజుల్లో బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతుంది…..(అందరూ అమ్మాయిలు ఇంతే ఉంటారేమో కదా!!!! ఎలాగైనా ఫస్ట్ పెళ్లిచూపులు లోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని అనుకుంటారు కదా!!!!)

పెళ్లిచూపులు ముందురోజు షాపింగ్ మాల్ కి వెళ్లి తనకు నచ్చిన పట్టు సారీ కొనుక్కోని వచ్చి తన అమ్మానాన్నలకి చెల్లెలకి చూపించి వాళ్లు బాగుంది అనగానే సంతోషంగా పెళ్లిచూపులు కి అదే కట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది…..

అలా గౌతమ్ వాళ్ళు వచ్చేసరికి నందు నాన్నగారు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి సోఫా లో కూర్చోబెడతారు(నందు నాన్నగారిది సామాన్య మధ్యతరగతి డాబా ఇల్లు…. ఆ ఇంటిలో రెండు బెడ్రూంలు ఒక కిచెన్ ఒక హాల్ ఒక పెరడు ఉంటాయి….) గౌతమ్ ఇంటిని అంతా చూస్తూ “బాగుంది చాలా నీట్ గా ఎరేంజ్ చేసుకున్నారు” అని మనసులోనే అనుకుంటాడు….

గదిలో తన చెల్లెలి సహాయంతో రెడీ అవుతున్న నందు కార్ సౌండ్ కి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు అనుకొని నందు మనసులో “ఇతను అందంగా ఉంటాడా?? లేకపోతే యావరేజ్ గా ఉంటాడా??? బాగా సంపాదిస్తున్నాడా??? డైలీ నేనడిగింది లేదు కాదు అనకుండా కొనిస్తాడా??? నన్ను బాగా చూసుకుంటాడా???” అని ఆలోచించుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది(పెళ్లిచూపులు కి రెడీ అయిన ప్రతి అమ్మాయి మనసులో ఉండేది ఇదే కదా!!!!)

నందు అమ్మ గారు గౌతమ్ వాళ్ళకి కాఫీ టిఫిన్ పెట్టి అబ్బాయి గురించి అన్నీ వివరాలు తెలుసుకున్నాకా గౌతమ్ అమ్మగారు వాళ్ళు అమ్మాయి ని రమ్మని చెప్పగానే నందు అమ్మగారు, తన చెల్లెలు ఇద్దరు వెళ్లి నందు చెల్లెలు నందుని రెడీ చేస్తూ ఆటపట్టిస్తూ ఉంటే వాళ్ళిద్దర్నీ నవ్వుతూ చూసి నందుని పై నుంచి కింద వరకు చూసి మెటికలు విరుస్తూ”చాలా అందంగా ఉన్నావు నందు… కచ్చితంగా వాళ్ళ అబ్బాయికి నువ్వు నచ్చుతావు…. అబ్బాయి కూడా చాలా బాగున్నాడు…. ఈ సంబంధం గాని ఫిక్స్ అయితే మీ ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంటుంది…. వాళ్లు నిన్ను చూసుకోవటానికి పిలుస్తున్నారు పదా…” అని అంటుంది

నందు కొంచెం బిడియంగా సిగ్గుగా ఫస్ట్ పెళ్లి చూపులు అవటం వలన ఎలాగైనా “అమ్మ చెప్పిందంటే అబ్బాయి చాలా అందంగా ఉండి ఉంటాడు….ఎలాగైనా ఈ అబ్బాయి తోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని….” మనసులో దేవుని కోరుకుంటూ ఉంటుంది

గౌతమ్ కూడా “అమ్మాయి అందంగా ఉండాలని ఈ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అవ్వాలని” దేవుని కోరుకుంటూ ఉంటాడు….(అందరూ అబ్బాయిల మనసుల్లోనూ ఇదే ఉంటుందా??? కొంచెం మీ ఒపీనియన్ షేర్ చేయండి….)

నందు తలదించుకునే బయటికి వచ్చి తన నాన్నగారి పక్కన కూర్చుంటుంది….

నందు బయటికి రాగానే గౌతమ్ కి నందు వాడే పర్ఫ్యూమ్ ఆరోమా స్మెల్ వచ్చే సరికి ఏమరుపాటుగా తలెత్తిన గౌతమ్ నందు ని అలా పట్టు సారీ లో పైనుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటే తనని అలా చూసి ఫిదా అయిపోయి మనసులో “ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది…. ఈ అమ్మాయికి ఎన్ని పద్ధతులు వచ్చి ఉంటే ఈ అమ్మాయి కానీ నా వైఫ్ అయితే చాలా బాగుంటుంది!!!”అని అనుకుంటూ నందు తీక్షణంగా చూస్తూ ఉంటాడు