భర్త భార్య Part 2 247

నందు స్కై బ్లూ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్న లైట్ వెయిట్ పట్టు సారీ కట్టుకుని మెడలో ఒక నెక్లెస్, చెవులకి పెద్ద బుట్టలు, రెండు కనుబొమల మధ్య రెడ్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని, తలలో మల్లెపూలు పెట్టుకుని సింపుల్ గా రెడీ అయ్యి ముట్టుకుంటే మాసిపోయే రంగులో పైనుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది….

గౌతమ్ ఆరడుగుల కి ఒక్క ఇంచ్ తక్కువ ఎత్తులో వైట్ అండ్ బ్లూ కలర్ చెక్స్ షర్ట్ డార్క్ బ్లూ జీన్స్ వేసుకొని ఇన్ షట్ చేసుకుని ట్రిమ్ చేసిన గడ్డంతో చురు కత్తి లాంటి చూపులతో నందు కి ఏ మాత్రం తీసిపోని రంగులో హ్యాండ్సమ్ గా ఉంటాడు….

నందు కి గౌతమ్ చూపులు తాకుతున్న సైలెంట్గా మనసులోని టెన్షన్ పడుతూ తలదించుకుని ఉంటుంది…..

గౌతమ్ అమ్మగారు నాన్నగారు గౌతమ్ నందు వచ్చిన దగ్గరనుంచి చూస్తూ ఉండేసరికి వాళ్ళకి గౌతమ్ కి నందు నచ్చిందని అర్థమై నందుతో “తలదించుకునే ఉంటావా మా కొడుకుని కూడా చూసేదేమైనా ఉందా కోడలు పిల్ల???” అని గౌతమ్ అమ్మగారు నవ్వుతూ అంటారు

అయినా నందు తలదించుకునే ఉండేసరికి నందు అమ్మగారు నందు చెవిలో “ఒకసారి అబ్బాయిని చూడు నందు….” అని చెప్పగానే నందు చిన్నగా తలెత్తి గౌతమ్ వైపు చూసి తన చూపుల బాణాల్ని గౌతమ్ గుండెల్లో గుచ్చి సైలెంట్ గా వెంటనే తల దించుకొని ఉంటుంది

ఆ చూపుకి గౌతమ్ గుండె పేలిపోయి మనసులో”గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనే పట్టు మీద రాయి వేసి కొట్టినట్టుందే….”అనే సాంగ్ కూడా వేసుకొని “ఇక ఫిక్స్ ఇదే నా పెళ్ళాం”అనుకోని వెంటనే తన అమ్మానాన్నలతో “అమ్మాయి నాకు బాగా నచ్చింది మమ్మీ …. అమ్మాయికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం….” అని నందు వైపే చూస్తూ ఆత్రంగా మాట్లాడుతాడు

ఆ మాటకి గౌతమ్ నాన్నగారి సీరియస్ గా గౌతమ్ వైపు చూస్తూ “నీకు అమ్మాయి నచ్చిందని మాత్రమే చెప్పు ఎప్పుడు మీకు పెళ్లి చేయాలి అనేది మేము చూసుకుంటాం….” అని గౌతమ్ కి మాత్రమే వినిపించేలా అంటారు

గౌతమ్ మాటలకి నందు ఫ్యామిలీ అంతా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే గౌతమ్ నాన్నగారు వెంటనే నందు నాన్నగారితో “ఏమనుకోకు రా వీడికి కొంచం ఆత్రం ఎక్కువ…. ఏది దాచుకో లేడు వెంటనే బయటికి కక్కేస్తాడు….” అని నవ్వుతూ అంటారు

నందు నాన్నగారు పర్వాలేదు అనగానే నందు మనసులో “ఓహో అబ్బాయి గారికి చాలా తొందరగా ఉన్నట్టుందే నన్ను పెళ్లి చేసుకోవడానికి!!!!” అని నవ్వుకుంటుంది

గౌతమ్ మనసులో “ఈ నాన్నలు ఉన్నారే ఎప్పుడు ఇంతే కొడుకుని ఎప్పుడు ఏదో ఒక మాట అందామా అని చూస్తూ ఉంటారు….” అని అనుకొని బయటికి ఏమీ తెలియని అమాయక చక్రవర్తి సైలెంట్ గా సరే అని చెప్పాడు

గౌతమ్ ఎక్స్ప్రెషన్ని ఓరగా చూస్తున్న నందు నవ్వుకుంటుంది…..

నందు నాన్నగారు “నందు నీకు అబ్బాయి నచ్చాడా???” అని అడిగితే “నేను కొంచెం అబ్బాయి తో మాట్లాడాలి నాన్న…” అని అడుగుతుంది

గౌతమ్ వెంటనే పైకి లేచి “నేను రెడీ వెళ్దామా మాట్లాడుకోవడానికి!!!!” అని పళ్ళన్ని బయటికి పెట్టి నవ్వుతూ అంటాడు

గౌతమ్ నాన్నగారి సీరియస్ గా గౌతమ్ వైపు చూసేసరికి అప్పుడు గౌతమ్ ఏం చేశాడో గుర్తుకు వచ్చి “ఛ ఇలా చేశాడేంటి??? ఈ అమ్మాయి నా గురించి ఏమనుకోని ఉంటుంది???” అనుకుంటూ ఇబ్బందిగా అందరి వైపు చూస్తూ ఉంటాడు

నందు నాన్నగారు గౌతమ్ వైపు చూసి నవ్వుతూ “నీ గదిలోకి తీసుకు వెళ్ళు నందు ఇద్దరు మాట్లాడుకోండి….” అని అంటారు

నందు సరే అని నెమ్మదిగా పైకి లేచి అడుగుల్లో అడుగులు వేస్తూ ఒక అయిదు నిమిషాలకి తన రూమ్ చేరుకుంటుంది…..

గౌతమ్ నందు వెనకే అడుగులు వేస్తూ “ఏంటి ఈ అమ్మాయి ఇంత స్లోగా నడుస్తుంది????”అని నందుని బ్యాక్ సైడ్ నుంచి చూసి “బ్యాక్ సైడ్ నుంచి సూపర్ ఉంది….” అని నందు చీర జాకెట్ కలవని చోట గౌతమ్ చూపు నడుము దగ్గర ఆగిపోయి “దీని నడుము ఎంత ఒంపులు తిరిగి ఉంది??? పైగా దానిలో నెలవంక ఎంత అందంగా ఉంది??? ఇప్పుడే దాన్ని ముద్దు పెట్టుకోవాలని పిస్తుంది….. ఇన్ని సంవత్సరాలు నా బ్రహ్మచర్యానికి వెంటనే స్వస్తి పలకాలి అనిపిస్తుంది….. ఎలాగైనా సరే ఈ అమ్మాయికి నేను నచ్చి మా పెళ్లి వెంటనే జరిగేలా చూడు స్వామి….” దేవుడు మెక్కేసుకుంటూ ఉంటాడు