భర్త భార్య Part 2 247

నందు లోపలికి వెళ్లి గౌతమ్ లోపలికి రాగానే వెంటనే డోర్ లాక్ చేసి తల పైకెత్తి సూటిగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ తన చీర చెంగు నడుము దగ్గర దోపుకుని “ఏంటి నేను బయటికి వచ్చిన దగ్గర నుంచి ఆ తినేసేలా చూడటం???? అయినా ఎప్పుడు అమ్మాయిలని చూడనట్టు అలా చూస్తున్నావ్ ఏంటి????” అని తన నడుము మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది

సడన్ గా మారిన నందు వేరియేషన్ కి గౌతమ్ షాక్ అయ్యి ఫెయింట్ అయ్యేలా ఉంటే వెంటనే నందు గౌతమ్ చెంప మీద చిన్నగా కొట్టి “ఓయ్ నన్ను ఇలా చూసి షాక్ అయ్యావా???? కానీ ఇదే నా ఒరిజినల్ క్యారెక్టర్….. కూర్చో నీతో చాలా మాట్లాడాలి….” అని చెప్పి గౌతమ్ ని బెడ్ మీద కూర్చోబెట్టి తను గౌతమ్ ఎదురుగా బాసిమఠం వేసుకొని కూర్చుంటుంది….

గౌతమ్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేక గుడ్లప్పగించి మరి నందు వైపే చూస్తూ ఉంటే “ఓయ్ ఏంటి అలా చూస్తున్నావ్ తినేస్తావా ఏంటి???? నేను బయటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే చూసావు???” అని సీరియస్ గా అడుగుతుంది

నందు అప్పుడు చేరుకొని “లేదండి మిమ్మల్ని బయట చూసినప్పుడు చాలా సాఫ్ట్ గా కనిపించారు…. ఇక్కడేమో ఇలా మాట్లాడుతున్నారు??? అందుకే కొంచెం షాక్ అయ్యాను….” అని నార్మల్ అవుతూ అంటాడు

నందు గౌతమ్ వైపు సూటిగా చూస్తూ “అమ్మాయిలు అన్నాక ఇలాగే ఉండాలి…. మెత్తగా ఉంటే ప్రతి ఒక్క వెధవ ఆడుకుంటాడు…..అందుకే నేను అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం లేదు…. ఇంతకీ నేను నీకు నచ్చానా????” అని సూటిగా అడుగుతుంది

గౌతమ్ అమ్మాయిల సిగ్గుపడుతూ బెడ్ షీట్ ని నలిపేస్తూ “చాలా నచ్చారండి మిమ్మల్ని చూడగానే పడిపోయాను….” అని అంటాడు

నందు గౌతమ్ వైపు వింతగా చూస్తూ “ఏంటండీ ఆ సిగ్గుపడటం నేను సిగ్గు పడాల్సింది పోయి మీరు సిగ్గు పడుతున్నారు…. ఇంతకీ నా గురించి మీకు తెలుసా???” అని అడుగుతుంది

“లేదండి నేను కనీసం మీ ఫోటో కూడా చూడలేదు….. డైరెక్టుగా పెళ్లిచూపులు కి వచ్చేసాను నచ్చితే ఓకే చెప్తాము లేకపోతే లేదు అనుకున్నాను….” అని గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ల సిన్సియర్ గా చెప్తాడు

గౌతమ్ మాటల్లోని సిన్సియారిటీ నచ్చి “ఓకే నేను డిగ్రీ చేశాను ఇంతవరకు ఎవరినీ ప్రేమించలేదు…. కాలేజ్ లో అబ్బాయిలకి నన్ను చూస్తే హడల్ అందుకే త్వరగా నాకు ఎవరూ ప్రపోజ్ చేయరు…. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్…. ఏదున్నా మొహం మీద చెప్పేస్తాను మనసులో ఏదీ దాచుకోను…. మా నాన్నగారు నన్ను పై చదువులు చదివించలేక డిగ్రీ తర్వాత చదువు మాన్పించేశారు…. నాకు కూడా చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక నేను మానేశాను….. పైగా నా డిగ్రీ అయిపోయి జస్ట్ టూ మంత్స్ అవుతుంది… ఇక పెళ్లి చేయాలనుకున్నారు…. మొదటి సంబంధం మీదే మీరు నాకు బాగా నచ్చారు…. మీకు ఓకే అయితే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం….. ఇంతకీ మీకు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా??? ఉంటే నిరభ్యంతరంగా చెప్పండి నేను చాలా బ్రాడ్ మైండెడ్ ఇలాంటివన్నీ పట్టించుకోను…‌.” అని డైరెక్టుగా అడుగుతుంది

నందు అంత డైరెక్ట్ గా అడుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని గౌతమ్ ఫస్ట్ షాక్ అయిన వెంటనే చిరునవ్వు నవ్వుతూ “అయ్యో నాకు అలాంటివి ఏమీ లేవండి…. నేను కూడా పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకోవాలి అనుకున్నాను పైగా అమ్మాయిలు మీ లాగ ఉంటేనే నాకు చాలా ఇష్టం నందు…. అవును నీ పేరు నందికనే కదా!!!నేను మిమ్మల్ని నందు అని పిలవచ్చా???” అని అడుగుతాడు

“మీరు నన్ను పెళ్లి చేసుకునే పని అయితే మీరు ఎలా పిలిచినా నేనే పలుకుతాను…. నాకేమీ అభ్యంతరం లేదు….” అని నవ్వుతూ అంటుంది

“అయితే నేను నిన్ను నందు అనే పిలుస్తాను నాకు నువ్వు బాగా నచ్చావు…. నీ మాటలు నీ క్యారెక్టర్ ఇంకా నచ్చింది….” అని మీరు నుంచి నువ్వు లోకి వచ్చి అంటాడు

నందు వెంటనే గౌతమ్ బుగ్గలు పట్టుకుని లాగుతూ “మీరు ఎంత క్యూట్ గా ఉన్నారో తెలుసా ఈ డ్రెస్ లో???? వచ్చినప్పట్నుంచి ఇలా మీ బుగ్గలు లాగుదామని మనసు పీకుతోంది ఇప్పటికి కుదిరింది…. ఒకవేళ మీకు నేను నచ్చలేదని చెప్పి అంటే ఇంత అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కాదు…. మీరు నా గురించి తప్పుగా అనుకోవద్దు….” అని సిగ్గుపడుతూ ఉంటుంది

గౌతమ్ నవ్వుతూ “నాకు కూడా నిన్ను చూసినప్పటినుంచి ఒకటి చేయాలని ఉంది…. నీకు నేను ఇష్టమో లేదో తెలియక సైలెంట్ గా ఉన్నాను…. కానీ ఇప్పుడు నీకు ఇష్టం అని తెలిశాక ఆ అవసరం లేదు….” అంటూ వెంటనే తన బుగ్గ మీద ముద్దు పెడతాడు

గౌతమ్ నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చెయ్యని నందు షాక్ అయిపోయి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి గౌతమ్ వైపే చూస్తూ ఉంటుంది…..

“ఐ లవ్ యు నందు నువ్వు నాకు చాలా నచ్చావు…. మీ వాళ్లకి కూడా నేనే చెప్తాను…. నువ్వు ఈ షాక్ నుంచి తేరుకొని నిదానంగా బయటికి రా….” అని మళ్ళీ మరొక బుగ్గ మీద ముద్దు పెట్టి మరి బయటికి వెళ్ళిపోతాడు….