గౌతమ్ చేసిన పనికి ఒక్క నిమిషం కోపం వచ్చిన వెంటనే అతని మనసులో తను తన భార్య గా ఫిక్స్ అయ్యాడని అర్థమై నవ్వుకుంటూ బయటికి వచ్చేసరికి గౌతమ్ అందరితో “నందుకి నాకు ఈ పెళ్లి ఇష్టమే…” అని చెప్తాడు
ఆ మాటకి అందరూ సంతోషంగా నవ్వుతూ చూస్తూ “సంతోషం బావగారు పంతులు గారిని పిలిపించి త్వరగా ముహూర్తాలు పెట్టించేద్దాం….” అని నవ్వుతూ గౌతమ్ నాన్నగారు అంటారు
బయటికి వచ్చిన నందుని ఓరగా గౌతమ్ చూస్తే నందు గౌతమ్ వైపు చిరు కోపం గా చూస్తూ తన పక్కకు వచ్చి నిలబడి గౌతమ్ కాలిని గట్టిగా తన కాలితో తొక్కేస్తుంది….(గౌతమి కండలు తిరిగిన శరీరం ఏమీ కాదండీ కొంచెం సన్నగా చాక్లెట్ బాయ్ లా ఉంటాడు…. నందు కూడా సన్నగా పర్ఫెక్ట్ ఫిగర్ తో గౌతమ్ కి సరిపోయేలా ఉంటుంది)
గౌతమ్ వెంటనే “చచ్చాను రా బాబోయ్….” అని గట్టిగా కేకలు వేస్తూ కాలు పట్టుకొని దాని వైపు చూసే సరికి అప్పటికే నందు నవ్వుకుంటూ తన నాన్నగారి పక్కకి వెళ్ళి కూర్చుంటుంది….
గౌతమ్ అమ్మగారు కంగారుగా గౌతమ్ దగ్గరికి వచ్చి “ఏమైంది రా ఎందుకు అలా అరిసావు???” అని అడుగుతారు
గౌతమ్ నందు వైపు కోపంగా చూస్తూ “ఏమీ లేదు మమ్మీ ఏదో కాళ్ళ మీద పడి నట్టు ఉంది కొంచెం నొప్పిగా అనిపించి అరిచాను…. అంతే టెన్షన్ పడకు….” అని నవ్వుతూ అంటాడు
నందు ముసిముసిగా నవ్వుకుంటూ గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది…. అదంతా అందరు గమనించి ఇద్దరి మధ్య చిలిపిగా ఏదో జరిగిందని అర్థమై వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటారు… ఇంతలో నందు నాన్న గారు పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి వారం రోజుల్లో పెళ్లి కి నెల రోజుల్లో ముహూర్తం ఫిక్స్ చేస్తారు….
అలా అందరూ మాట్లాడుకున్నాక నిశ్చితార్థం నందు నాన్నగారు చేస్తానని చెప్పి గౌతమ్ వాళ్లందర్నీ పంపించేసాక నందుతో “చాలా సంతోషంగా ఉంది నందు…. వాళ్ళు కనీసం రూపాయి కట్నం కూడా వద్దన్నారు…. పైగా అబ్బాయి చాలా మంచివాడు నేను ఎంక్వయిరీ కూడా చేశాను ఏ చెడు అలవాట్లు లేవు పైగా చాలా అమాయకుడిలా కూడా ఉన్నాడు నీ నోట్లో పడ్డాడు…. ఇక అతని పరిస్థితి ఏంటో???” అని గౌతమ్ మీద జాలి చూపిస్తూ అంటారు
నందు కోపంగా వాళ్ళ నాన్న వైపు చూస్తూ “అంటే ఏంటి నాన్న నేను నీకు రాక్షసి లా కనిపిస్తున్నానా???” అని అడుగుతుంది
“అది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నువ్వు ఆల్రెడీ రాక్షసివే….” అని నవ్వుతూ చెప్పి “జస్ట్ జోకింగ్ నందు కానీ అబ్బాయి చాలా మంచివాడు…. అతనిని నొప్పించకుండా చూసుకో….” అని అంటారు
సరే అని చెప్పి నందు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లోకి వెళ్ళేసరికి గౌతమ్ నుంచి మెసేజ్ వస్తుంది “ఎందుకు నా కాలు అలా తొక్కే సావు నందు????” అని కార్ లో డ్రైవర్ పక్కన కూర్చుని నందు కి మెసేజ్ చేస్తూ ఉంటాడు
నందు షాకింగ్ “నా నెంబర్ గౌతమ్ కి ఎలా తెలిసింది???”అని అనుకుంటూ ఉండగానే గౌతమ్ నుంచి మరో మెసేజ్ “నీతో మాట్లాడి బయటికి రాగానే నీ చెల్లి దగ్గర నుంచి నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను…. నీ చిన్ని బుర్రని చించేస్తూ అంతలా కష్టపడకు బంగారం….” అని నవ్వుతున్న ఏమోజీ పెడతాడు
నందు నవ్వుకుంటూ “మరి నువ్వు నా పర్మిషన్ లేకుండా నాకు ముద్దు పెడితే ఏం చేయాలి??? నాకు కోపం వచ్చింది అది తీర్చుకున్నాను…. నాకు కోపం వస్తే అది తీర్చుకునే దాకా నేను ప్రశాంతంగా ఉండలేను….” అని అంటుంది
గౌతమ్ వెంటనే గుండెల మీద చెయ్యి వేసుకుని “అమ్మో అయితే నీతో కష్టమే నే బాబు!!! ఏదైనా కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాను నువ్వు నా లైఫ్ లోకి వస్తే చాలు బంగారం….” అని మెసేజ్ పెడతాడు
అలా నందు డ్రెస్ చేంజ్ చేసుకుంటేనే గౌతమ్ కి మెసేజ్ చేస్తూ ఉంటుంది….
అలా కాలం ఎవరికోసం ఆగకుండా నిశ్చితార్ధం అయిన వాళ్ళ మధ్యలో జరిగితే పెళ్లి గ్రాండ్ గా చేస్తారు….
నిశ్చితార్థానికి పెళ్లి కి మధ్యలో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ కలవాలి అనుకుంటే ఇద్దరి తల్లిదండ్రులు కలవకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్పేసరికి ఇద్దరు ఫోన్లోనే మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అయిపోతారు….(ఇది మాత్రం పెళ్లి కుదిరిన అమ్మాయి అబ్బాయి మధ్య కామన్ గా నే జరుగుతుంది….)
పెళ్లి అయినా తర్వాత రోజు గౌతమ్ ఇంట్లో వ్రతం చేసి ఆ రోజే ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటారు….
అక్కడే ఒక వారం రోజులు ఉండి నందు అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఒక వారం రోజులు ఉండి వెంటనే నందు ని తీసుకొని హైదరాబాద్ వెళ్లిపోతాడు…. అప్పటికే గౌతమ్ మంచి అపార్ట్మెంట్ లో ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటాడు….